నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి....

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి....


మనందరికీ అక్టోబర్ 2న అనగానే గాంధీ జయంతి గుర్తుకు వస్తారు. అదేరోజు ఒక మహానుభావుడు కూడా జన్మించారు. ఈయన మన దేశంలోనే అత్యంత నిజాయితీపరుడుగా రాజకీయ నాయకుడిగా పేరు ఉన్న కానీ, ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతేకాదు ఈయన నెహ్రు గారి తర్వాత మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనే "లాల్ బహదూర్ శాస్త్రి" గారు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేదానికి నిలువెత్తు నిదర్శనం. ఈయన గొప్పతనం గురించి తెలుసుకుంటుంటే మనకు కన్నీళ్లు వస్తాయి. మరి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి అయిన మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

లాల్ బహదూర్ శాస్త్రి గారి బాలయ్యములు ఎదురుకొన్న కష్టాలు:
ఈయన 1904 అక్టోబర్ 2న ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి గారు స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి కేవలం 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి ప్రేగు వ్యాధితో చనిపోయారు. దాంతో అందరూ కలిసి వాళ్ల తాతగారు ఇంటికి వెళ్లిపోయి అక్కడే పెరిగారు. చిన్న వయసులోనే ఈయన చదువు హరీష్ చంద్ర హైస్కూల్లో సాగింది. ఈయన ఇల్లు గంగా నదికి ఒకవైపు ఉంటే, ఈయన చదువుకునే స్కూలు మాత్రం నదికి మరోవైపు ఉండేది. కాబట్టి ఈయన స్కూల్ కి వెళ్లాలంటే ప్రతిరోజు పడవ మీద నదిని దాటాలి. కానీ ఈయన కుటుంబం పేదరికంలో ఉండడం వలన ప్రతిరోజు పడవ కి ఇవ్వడానికి రెండు పైసలు డబ్బులు ఉండేవికాదు. దాంతో ఈయన తన చొక్కా విప్పి పుస్తకాలను అందులో చుట్టి తల పైన కట్టుకొని నదిలో ఇత కొట్టుకుంటూ స్కూలుకి వెళ్లేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్లీ నదిని ఇత కొట్టుకుంటూ వెనక్కి వచ్చేసేవారు. దీన్నిబట్టి ఈయన ఎంత కష్టపడి చదువుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈయనకు చిన్నప్పటినుండి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ల గురించి తెలుసుకొని వాళ్ల ఆశయాలకు ఆకర్ష్యుడు అయ్యాడు. ఆ వయసులోనే అంటరాని వారికోసం వెనకబడిన వారి అభివృద్ధి కోసం పనిచేసేవారు. అంతేకాదు ఈయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీకాస్తావా కానీ ఈయన కులాలకు వ్యతిరేకం. అందుకే తన పేరులో కులాన్ని తెలియజేసే శ్రీకాస్తావా అనే పదాన్ని తీసేశారు.

లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉద్యమంలోకి ప్రవేశించడం:
ఒకసారి ఈయన హరీష్ చంద్ర అనే స్కూల్లో పదో తరగతి చదువుతున్న రోజుల్లో గాంధీ గారు బెనారస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యువత సహాయనిరాకరణ ఉద్యమంలో చేరామని పిలుపు వచ్చి అప్పుడు చదువు మానేసి భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. 

శాస్త్రి అన్నే బిరుదు: 
ఉద్యమాలలో పాల్గొంటున్న యువతకు చదువు చాలా అవసరం అని గుర్తించిన శివప్రసాద్ గుప్త అన్నే ఆయన 1921 లో కాశీవిద్య పిటి స్థాపించారు. దీనితో చదువు మానేసి స్వతంత్ర ఉద్యమాలలో పోరాటం చేసే విద్యార్థులకు చదువు నేర్పించేవారు. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ ఇన్స్టిట్యూట్ నుండి మొదటిసారిగా1925 ఫిలాసఫీ ఎథిక్స్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందారు. అందుకు గాను కాశి విద్యపీట్ వాళ్లు ఆ డిగ్రీ తో పాటుగా ఈయనకు శాస్త్రి అని బిరుదు కూడా ఇచ్చారు. శాస్త్రి అంటే ఇంగ్లీషులో స్కాలర్ అని అర్థం. ఆ శాస్త్రి అనే పదం ఆయన పేరులో చేరి లాల్ బహదూర్ శాస్త్రి అయింది.

తర్వాత ఆయన లాలా లజపతిరాయ్ గారు స్థాపించిన లోక్ సేవ మండలం అనే సొసైటీలో మెంబెర్ గా జాయిన్ అయ్యిరు. గాంధీ గారి నేతృత్వంలో హరిజనుల అభివృద్ధి కోసం కష్టపడేవారు. అలా కొంతకాలానికి అదే సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యారు.

లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏడుసార్లు జైలుకి వెళ్లారు

  • 1928 శాస్త్రి గారికి లలిత అనె ఆవిడతో వివాహం జరిగింది. వీళ్ళకి ఆరుగురు పిల్లలు కొంతకాలానికి గాంధీ గారు పిలుపుమేరకు శాస్త్రి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మెంబర్ గాను చేరారు. ఆ సమయంలో ఈ బ్రిటీసస్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందుకు రెండున్నర సంవత్సరాలు పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఒకసారి ఈయన జైలులో ఉన్నప్పుడు ఈయన భార్య లలిత శాస్త్రి గారు ఈయనకు ఇష్టమని రెండు మామిడి పండ్లను బ్రిటిష్ జైలు అధికారులకి తెలియకుండా తెచ్చి శాస్త్రి గారికి ఇచ్చారు. కానీ, ఈయన తీసుకోలేదు. అధికారులకు తెలియకుండా బయట ఆహార పదార్థాలు తీసుకురావడం చట్టానికి వ్యతిరేకం. జైలు అధికారులు నిన్ను నమ్మి ఎటువంటి చెకింగ్ చెయ్యకుండా లోపలికి పంపించారు. ఇలా బయట నుంచి పండ్లు తెచ్చి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పారు. అలా మామిడి పండ్లను వెనక్కి పంపించేశారు. అలాగే మరొకసారి ఈయన జైలులో ఉన్నప్పుడు ఈయన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నదని తెలిసి తన కూతురు చికిత్స కోసం తనకి 15 రోజులు ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని అధికారులని అడిగారు. దానికి అధికారులు ఒప్పుకొని చికిత్స పూర్తి అయిన వెంటనే తిరిగి జైలుకి రమ్మని బయటికి పంపించారు. కానీ, ఈయన ఇంటికి వెళ్లిన కొంతసేపటికె ఈయన కూతురు మరణించారు. దానికి ఈయన ఎంతో బాధపడి ఇంకా చేసేది ఏమీ లేక మూడు రోజులు పాటు దహన సంస్కారాలు పూర్తి చేసేసి నాలుగో రోజున తిరిగి జైలుకు వెళ్లిపోయారు. అప్పుడు అధికారులు "నీకు 15 రోజులు అనుమతి ఇచ్చారు కాదా అప్పుడే వచ్చేసావేంటి" అని అడిగారు. అప్పుడు శాస్త్రి గారు "నేను నా కూతురు చికిత్స కోసం వెళ్లాను కానీ, ఆమె మరణించింది. కాబట్టి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసాను నేను ఇంకా బయటే ఉంటే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. అందుకని నేను తిరిగి వచ్చేసాను" అని చెప్పేసరికి అధికారులు ఆయన నిజాయితీకి ఆశ్చర్యపోయారు. 1947 లో స్వతంత్రం వచ్చేవరకు ఎన్నో ఉద్యమాలలో పాల్గొనడం వలన ఏడుసార్లు జైలుకి వెళ్లారు. మొత్తం తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.

స్వాతంత్రము వచ్చిన తర్వాత శాస్త్రి గారికి వచ్చిన పదవులు 

  • చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనకు సెంటర్ లెవెల్ లో పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పదవులు లభించాయి. ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఆడవాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో మొదటిసారిగా ఆడవాళ్లను కండక్టర్ జాబ్స్ లో అప్పోయింట్ చేశారు.
  • అంతవరకు ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతూ ఉంటే పోలీసులు లాఠీ చార్జీలు, ఫిరంగీలు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ అయిన తర్వాత అలా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని చెదరగొట్టడానికి ఎక్కువ గాయాలు కలిగించే లాఠీ చార్జీలు, ఫిరంగీలు లేకుండా వాటర్ జట్లను ఉపయోగించండి అని ఆదేశం ఇచ్చారు. మొదటిసారిగా వాటర్ జట్లను తీసుకువచ్చారు.
  • తర్వాత 1952 లో రైల్వే మినిస్టర్ గా పదవి దక్కింది. ఈయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా అందరిలాగే రైలులో ప్రయాణించేవారు. అప్పుడే రైలు ప్రయాణంలో ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పారు. అందుకే మొదటిసారిగా రైలులో జనరల్ భోగిలలో ఫ్యాన్లను అందించింది కూడా శాస్త్రి గారె. కానీ, ఈయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు 1956 లో తమిళనాడులో వర్షం వల్ల పాడైపోయిన ఒక బ్రిడ్జి కూలి ఒక ట్రైన్ నదిలో పడిపోవడం వలన సుమారు 150 మంది పైగా చనిపోయారు. ఆ ప్రమాదాలకు నైతిక బాధ్యతను తన మీదనే వేసుకొని రైల్వే మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. అలా ప్రమాదాలకు నైతిక బాధ్యతను వహించి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయారు. అలా ఆయన ఆరోజు రాజీనామా చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అది చూసిన ఆయన కార్ డ్రైవర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి రండి సార్ కారులో కూర్చోండి మిమ్మల్ని ఇంటిదగ్గర దిగబెడతాను అంటే అప్పుడు శాస్త్రి గారు ఇప్పుడు నేను రైల్వే మినిస్టర్ కాదు ఒక సాధారణమైన పౌరుడిని ఈ టైంలో నేను ప్రభుత్వ వాహనాన్ని వాడుకోవడం తప్పని ఆ కారు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనిని బట్టి ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కానీ తర్వాత కూడా మినిస్ట్రీ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా 1961 నుండి 1963 వరకు ఇండియాకి హోమ్ మినిస్టర్ గా కూడా చేశారు.

ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు చేసిన మంచి పన్నులు

  • అయితే 1964లో ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు గుండెపోటుతో చనిపోవడంతో ఆ పదవి లాల్ బహదూర్ శాస్త్రి గారికి వచ్చింది. దేశానికి రెండో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి వైట్ రేవోల్యూషన్ ని ప్రారంభించారు. పాల ఉత్పతు లు, పాల సరఫరా పెంచడానికి గుజరాత్ లో అమూల్ పాల సహకార సంస్థలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారు.
  • ప్రధానమంత్రి కాకముందే 1962 లో మనకి చైనా కి జరిగిన యుద్ధం లో మన దేశం ఓడిపోవడం వల్ల మన దేశం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ కారణంగా దేశం అంతటా ఆహార కొరత ఎక్కువగా ఉండేది. సరిపడ ఆహారం ఉండేది కాదు. పక్క దేశాల నుండి ఆహారం దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దాంతో ఈయన దేశం నుండి ప్రజలందరూ వారానికి ఒక పూట భోజనాన్ని చెయ్యకుండా ఉపవాసం ఉండమని అలా మిగిలిన ఆహారాన్ని, ఆహారం లేని వాళ్ళకి పెట్టమని పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన మాటకు దేశమంతా స్పందించింది. ప్రజలంతా వారానికి ఒక పూట భోజనము మానేశారు. హోటల్స్, ఫుడ్ బిజినెస్ లు అన్ని కూడా సోమవారం సాయంత్రం స్వచంతంగా క్లోజ్ చేసేవారు. దేశంలో చాలా చోట దీనిని శాస్త్రి వ్రతం అని పిలిచేవారు. ఈయన ఏది తీసుకొని వచ్చినా మొదట వారి కుటుంబంలో నుంచి మొదలుపెట్టేవారు.
  • దేశంలో ఆహారం పంటను సాగును పెంచడానికి తన ఆఫీసు గార్డెన్ లో ధాన్యాలు కూరగాయలు పండించడం మొదలుపెట్టి అదేవిధంగా దేశమంతా కూడా వాళ్ల వాళ్ల ఇంట్లో ఖాళీ స్థలాలలో ధాన్యాలను, కూరగాయలను పండించమని పిలుపుని ఇచ్చారు. దేశమంతా ఆ మాట విని ఇంట్లోనే చిన్న చిన్న పంటలు వేసి పండించేవారు. అదేవిధంగా శాస్త్రి గారు ఎక్కువ దిగుబడి ఇచ్చే కొత్త రకాల విత్తనాలని తీసుకువచ్చేవారు. ఆ విధంగా దేశంలో గ్రీన్రే రివోల్యూషన్  తీసుకువచ్చి మళ్లీ దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ ని పెంచి దేశాన్ని కరువు నుంచి బయటకు పడవేశారు. అంతేకాదు మన దేశంలో ఆహార ధాన్యాల ధరలను, సరఫరాలను కంట్రోల్ చేసే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కూడా ఈయన హయంలోనే స్థాపించబడింది.
  • ఈయన పదవిలో ఉన్నా కూడా ఏనాడు ఆ పవర్ ని దుర్వినియోగం చేయలేదు. ఆయన దేశ ప్రధాని అయినా సరే వాళ్ల పిల్లలు సాధారణమైన సిటీ బస్సులో ప్రయాణం చేసేవారు. కానీ ఒకసారి ఈయన కుమారుడు తన సొంత పనికి గవర్నమెంట్ కారు ఉపయోగించాడని తెలిసి కారు ని తన సొంత పనికి 14 కిలోమీటర్లు దూరం ఉపయోగించిన దానికి ఎంత ఖర్చయిందో లెక్కేసి శాస్త్రి గారి తన సొంత డబ్బుని గవర్నమెంట్ కి కట్టేశారు.
  • అలాగే ఒకసారి ఢిల్లీలోని సెయింట్స్ స్టీఫిన్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వడానికి, అడ్మిషన్ ఫీజు కట్టడానికి స్టూడెంట్స్ అందరూ లైన్ లో నిలుచున్నారు. అందులో ఒక పిల్లవాడు ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయారు. దాంతో ఆ పిల్లవాడిని కాలేజీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చికిత్సను అందించి పిల్లవాడు లేచిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరో చెప్తే పిలిపిస్తాం అని మీ నాన్నగారి పేరు ఏంటని అడిగితే ఆ పిల్లవాడు వెంటనే మా నాన్నగారి పేరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మా నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. అని చెప్పగానే అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అంత పెద్ద పదవిలో ఉండి కూడా ఎప్పుడు తన పేరును గాని పవర్ ని గాని ఉపయోగించలేదు.
  • అలాగే ఒకసారి శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ లేలాండ్ లో ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు హరికృష్ణ శాస్త్రి గారికి ఆ కంపెనీ లో ప్రమోషన్ వచ్చింది. ఇదే విషయం సంతోషంతో శాస్త్రి గారికి చెప్పారు. ఆయన వెంటనే ఇంత సడన్ గా ఎందుకు ఆ కంపెనీ నీకు ప్రమోషన్ ఇచ్చిందో నాకు తెలుసు. కొన్ని రోజులు తర్వాత ఆ కంపెనీ నా నుంచి ఏదో ఒక సహాయం కోరుతుంది. నేను అలా చేస్తే దేశ ప్రజలంతా దానిని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు. నేను ఆ పనిని చేయలేను కాబట్టి నేను ప్రధానిగా ఉన్నంతకాలం నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వీలు లేదు అని తన కుమారుడిని ఆ కంపెనీలో ఉద్యోగం మాన్పించేసారు.
  • ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. ఆ టైంలో డిఫెన్స్ బడ్జెట్ ని పెంచడం అలాగే మిలటరీ కి ఫుల్ పవర్స్ ని ఇచ్చి సైన్యానికి సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ సమయంలోనే రైతులు, సైనికులు దేశానికి అసలైన ఆధారమని గుర్తించి వాళ్లని గౌరవించారు. మనం ఎక్కువగా వినే "జై జవాన్ జై కిసాన్" అనే నినాదాన్ని ఇచ్చి రైతులు, సైనికుల విలువలను అందరికీ తెలియజేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారె. ఆ తర్వాత కాలంలో ఇదే జాతీయ నినాదం గా మారిపోయింది. దాదాపు ఆ యుద్ధంలో మనం గెలవబోతున్నాం అనే సమయానికి ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చి యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసింది.

లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణము

ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపివేస్తున్నట్టు శాంతి ఒప్పందవం చేసుకోవడానికి ఉజికిస్తాన్ కి వెళ్ళినప్పుడు శాంతి ఒప్పందం పైన సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే 1966 జనవరి 11న శాస్త్రి గారు మరణించారు. అయితే ఈయన మరణానికి కారణం గుండెపోటు అని కారణాలు వచ్చాయి. కాని ఈయన మరణం వెనక చాలా మిస్టరీలు ఉన్నాయి. ఈయనకు పాలలో విషం పెట్టి చంపేశారని అందుకే ఈయన బాడీని వాళ్ల కుటుంబానికి అప్పగించే సమయానికి ఆయన ముఖం నీలం రంగులో ఉందని అలాగే ఆయన శరీరంలో పొట్టమీద, మెడ వెనక భాగంలో అక్కడక్కడ కోసినట్టు గా ఉన్నాయి. ఈయన మరణం గురించి భారత ప్రభుత్వం కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మీడియా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతేకాకుండా సడన్ గా చనిపోయారు. అలాంటి వ్యక్తి శరీరాన్ని కనీసం పోస్టుమార్టం కూడా చేయలేదు. కనీసం ఎలా చనిపోయారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే చాలామంది సమాచారపు చట్ట ప్రకారం శాస్త్రి గారి మరణం గురించి వివరాలు కావాలని కోరారు. కానీ, అప్పటి గవర్నమెంటు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. అయితే ప్రజల నుండి కూడా నిరసనలు రావడంతో దాదాపు శాస్త్రి గారు చనిపోయిన 11 సంవత్సరాలు తర్వాత 1977లో పార్లమెంట్ ఆయన మరణం వెనుక ఉన్న కారణాలు కనిపెట్టమని తెలుసుకోమని కమిటీ వేసింది. అప్పట్లో శాస్త్రి గారితో పాటు ఉజికిస్తాన్ కి వెళ్లిన పర్సనల్ డాక్టర్ అలాగే ఇంకొక వ్యక్తి రామ్నాథ్ అక్కడ సాక్ష్యాలుగా ఉన్నారు. కానీ ఎంక్వైరీ కమిటీకి సాక్ష్యం చెప్పడానికి వస్తున్న డాక్టర్ గారిని ఒక ట్రక్కు గుద్దడం వలన డాక్టర్ అక్కడికక్కడే చనిపోయారు. అలాగే రామ్నాథ్ సాక్ష్యం చెప్పడానికి వస్తున్నప్పుడు మరొక ట్రక్ వచ్చి గుద్దడంతో రెండు కాళ్ళని కోల్పోయారు. అలాగే జ్ఞాపకశక్తి కోల్పోయి గతాన్ని మర్చిపోయారు. ఆ సాక్షులు ఇద్దరు లేకపోయేసరికి ఇంకా తెలుసుకోవడం అక్కడితో ఆగిపోయింది. దాంతో శాస్త్రి గారి మరణం ఎనక ఏదో కుట్ర జరిగిందని అనుమానాలు మరింత బలపడ్డాయి. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం భారతదేశపు రాజకీయాల్లోనే ఒక పెద్ద తెలుసుకోలేని విషయం అని ఇప్పటికీ చెప్పుకుంటారు.

ఇంత నిజాయితీ అయిన మనిషి, స్వతంత్ర సమరయోధుడు దేశ ప్రధానమంత్రి అయిన గొప్ప వ్యక్తి మరణం మిస్టరీగా మిగిలిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈయన భరతదేశానికి ప్రధానమంత్రిగా కేవలం 19 నెలలు మాత్రమే ఉన్నారు. కానీ, ఈ కొద్ది కాలంలోనే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఈయన చనిపోయే సమయానికి ఈయనకంటూ సొంత ఇల్లు కూడా లేదు. అంత నిస్వార్ధంగా నిజాయితీగా పనిచేశారు. ఎప్పుడు చూసినా కల్మషం లేని చక్కటి చిరునవ్వుతో ఎంతో సౌమ్యంగా ఉండేవారు. ముద్దుగా మాట్లాడుతూ సాధారణంగా ఉండేవారు.

లాల్ బహదూర్ శాస్త్రి గారికి వచ్చిన అవార్డ్స్

స్వతంత్ర సమరయోధుడిగా, మంచి రాజకీయ నాయకుడిగా చేసిన సేవలకు గాను శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఈయనకు దేశంలోనే అత్యున్నతమైన భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !