బద్రీనాథ్ ఆలయము రహస్యాలు....
భూమిపై కొలువైన స్వర్గం, ఎన్నో నిగూఢమైనా రహస్యాలు, మరెన్నో నమ్మలేని నిజాలు, ఇంకెన్నో కనులు మీరుమిట్లు కొలిపే అద్భుతాలు, వీటికి తోడు ఓవైపు ప్రశాంతత, మరోవైపు భయంకరమైన ప్రళయము, దేవతల నివాసం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలు, ఆ మర్మభూమి దేవ భూమి హిమాలయ పర్వతాలలో 3133 మీటర్ల ఎత్తులో కొలువుతీరాడు బద్రి నారాయణుడు. ఆ క్షేత్రమే బద్రీనాథ్.
ఈ ప్రాంతం నుంచే పాండవులు స్వర్గానికి ఆవరోహణ చేశారు. నరనారాయణులు తపస్సు చేసిన ప్రాంతం. ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి రాను రాను అంతరితం అయిపోయి ఈ కలియుగంలో కనీసం చూడడానికి కూడా వీలు లేని సరస్వతీ నదిని ఇక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూడగలము.
మైమరిపించే మంచు కొండలు, చూడగలిగే కన్నులు ఉంటే చూసి ఆస్వాదించే మనసు ఉంటే ప్రకృతిలో పరమాత్మను వీక్షించగలిగే హృదయం ఉంటే ఇక్కడ అడుగు అడుగుకి అందమే ఆనందమే. అద్భుతమైన అలకనంద నదీ సోయగాలు, ఉప్పొంగి ఊరికే సరస్వతీ ప్రవాహము, పచ్చదనంతో మంచు దుప్పటి ముసుగు వేసుకున్న భారతదేశపు చిట్టచివరి గ్రామము, వ్యాస గృహ తన సోదరులతో పాటు స్వర్గారోహణ అణువుగా, భీముడు రెండు పెద్ద కొండలను కలుపుతూ వేసిన వంతెన, పితృ కార్యాలకు పెట్టిన పేరే బ్రహ్మకపాలం, తన చుట్టూ ఎన్నో విశేషాలతో దర్శనం ఇచ్చే బద్రీనాథ్ ఆలయము, అందులో శోభాయ మానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చే బద్రి నారాయణుడు.
నిజానికి హిమాలయాలు అంటే శివ భగవానుడి నివాస స్థానంగా చెప్తారు. మరి, శివ దేవుడికి సంబంధించి హిమాలయాల్లో నారాయణుడు ఎలా కొలువు తీరారు. అసలు ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అని పేరు ఎందుకు వచ్చింది. ఇక్కడ చేసే పితృ కార్యాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత. ఈ విశేషాలన్నీ ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము.
బద్రీనాథ్ ఆలయము ఉన్న ప్రాంతాము
బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రములోని చెమ్మోలి జిల్లాలో అలకనంద నది తీరంలో 3133 మీటర్లో ఎత్తులో ఉంది. నరనారాయణల కొండల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువున భాగంలో ఉంది ఈ ఆలయము. బద్రీనాథ్ చైనా డిబేట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బద్రీనాథ్ పురాణాలలో బద్రికవనం చెప్పబడిన ప్రదేశమే ఈ బద్రీనాథ్.
108 దివ్య దేశాలలో ఒకటి బద్రీనాథ్ ఆలయము. సత్య యుగంలో నరనారాయణులు ఇక్కడే తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ధర్ముడు, మూర్తి అనే దంపతులకు తపోఫలంగా నారాయణుడు నరనారాయణ నామాలతో రెండు మూర్తులగా అవతరించారాని, ఆ నరనారాయణులే ఇక్కడ తపస్సు చేశారని పురాణాలు కథనాలు చెబుతున్నాయి.
మహాభారతంలో ఒక సందర్భంలో శివుడు అర్జునుడితో పూర్వజన్మలో బద్రిక ఆశ్రమంలో నువ్వు నరుడు గాను, శ్రీకృష్ణుడు నారాయణుడిగా గాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారాని చెప్పినట్టు కనబడుతుంది.
ఈ బద్రి క్షేత్రంలో అన్ని లోకాల్లోనూ తీర్థాలు ఉంటాయి. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాసిలో 60 వేల సంవత్సరాలు యోగా వ్యాసం చేసిన ఫలితం ఈ ఆలయం దర్శనం మాత్రం కలుగుతుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. కృతయుగంలో ముక్తి ప్రధాని, త్రేతా యుగంలో యోగ సిద్ధిరాని, ద్వాపరంలో విశాల అని పిలువబడిన ఈ క్షేత్రం కలియుగంలో ఇప్పుడు బద్రి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
బద్రీనాథ్ ఆలయము దెగ్గర ఉన్న రేగుచెట్టు
ఈ క్షేత్ర మహత్యాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే తన కుమారుడైన కుమారస్వామికి చెప్పాడని స్కాంద పురాణం చెబుతుంది. ఈ క్షేత్రానికి బద్రి అనే పేరు రావడానికి కూడా విభిన్నమైన కథనాలు చెప్తారు. ఇక్కడ రేగు చెట్టుకు అమృతం షేవించినట్లు ఉంటుందని, అందువలన ఇది బద్రి క్షేత్రం అని పిలువబడుతుంది. బద్రి అంటే రేగుచెట్లు. ఈ ప్రాంతములో రేగుచెట్లు ఎక్కువగా ఉండేవని అందుకే ఈ క్షేత్రానికి బద్రి క్షేత్రం గా పేరు వచ్చింది. పూర్వము ప్రకారంగా నారాయణుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సందర్భంలో లక్ష్మీదేవి బద్రి వృక్షం అంటే రేగు చెట్టుగా స్వామికి నీడనిచ్చింది. అందుకే ఈ క్షేత్రానికి బద్రి క్షేత్రంగా పేరు వచ్చిందని విభిన్నమైన కథనాలు చెబుతున్నాయి.
ఈ క్షేత్రాన్ని బద్రి విశాల్ లేదా విశాల బద్రి అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు విశాలుడి పూజకు మెచ్చిన నారాయణుడు అతని పేరు మీదగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందని వారాని ప్రసాదించారు. అప్పటినుంచి బద్రీనాథ్ విశాల బద్రి లేదా బద్రి విశాల్ గా పిలవబడుతుంది.
కృతయుగంలో నారాయణ నామ ఉచ్చరించినంత మాత్రానే ప్రతిక్షమై దర్శనం ఇచ్చేవాడంట భగవానుడు. త్రేతా యుగంలో పూజలు నిర్వహిస్తే దర్శనం ఇచ్చేవాడట. ద్వాపర యుగంలో విభిన్నమైన తపస్సులు చేసేవారికి దర్శనం ఇచ్చేవాడంట. ఇక ఈ కలియుగంలో మానవ కల్యాణర్ధము విగ్రరూపం లో ఉండి పూజలు అందుకుంటానని చెప్పగా విశ్వకర్మ ఈ మందిరం నిర్మాణము చేసి విగ్ర ప్రతిష్ట చేసినట్లు చెప్తారు. అయితే ఒక సమయంలో బౌద్ధమతం బాగా పెరిగినప్పుడు వారి ఈ విగ్రహాలను నారద కుండల్లో నిమజ్జనం చేసి బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నారు. ఆ తర్వాత జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు తిరిగి సనాతనధర్మ పునఃవృధారణకు పునుకున్నాప్పుడు నారదా కుండల్లో ఉన్న ఈ విగ్రహాన్ని గుర్తించి వెలిగితీసి ప్రతిష్టించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఇక ద్వాపర యుగంలో ద్వారకా నగరము సముద్రములో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడు ఉదముడిని ఈ క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆదేశించాడని అందుకే యాదవ కులం వినాశనం జరిగినప్పుడు ఈ బద్రి క్షేత్రానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న ఉద్ధముడు మాత్రమే రక్షించబడ్డాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు వారు రామానుజునాచార్యులు వారు మధ్వాచార్యుల వేదాంత దీక్షితులు లాంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి బద్రీనాథ్ దర్శించుకుని ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. బద్రీనాథ్ పరిసర ప్రాంతాలో కొండలు అన్నిటి గురించి వ్యాస మహర్షి మహాభారతంలో వివరంగా వర్ణించినట్టు పండితులు చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారం చాలించిన తర్వాత పాండవులు కూడా తన జీవితాన్ని చలించి స్వర్గరోహన చేసిన పర్వతాలు ఇవే అని స్థల పురాణం చెప్తున్నది. స్వర్గరోహన సమయంలో వారు బద్రీనాథ్ మీదగా ప్రయాణం చేశారని బద్రీనాథ్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకొండల మీదగా ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడే రెండు పెద్ద పర్వతాల మీదగా వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ కొండల మధ్యలో ఉన్న లోయలను దాటుకొని వెళ్లడానికి గాను ఆ రెండు కొండలని కలుపుతూ భీముడు మరోఒక పెద్ద కొండను తెచ్చి వేయగా ఆ కొండమీదుగా పెట్టారని అప్పుడు పాండవులు నడిచి వెళ్లారు. ఆ కొండని భీమ్ ఫూల్ అని చెప్తారు. ఈ భీమ్ ఫూల్ ఇప్పుడు కూడా మనము చూడొచ్చు. ఆ భీమ్ ఫూల్ ఈ మానాకొండలలోనే ఉంది.
ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా లుక్తమైపొయ్యి అంతరితం అయిపోయి సరస్వతి నది మానా కొండలలో కనపడుతుంది. ఇక్కడ కనపడిన సరస్వతీ నది భూమిలో అంతరితం అయిపోయి తిరిగి అదృష్యంగా అలహాబాద్ లో త్రివేణి సంగమల్లల్లో గంగా యమునా నదులతో కలుస్తుందని చెప్తారు.
హిమాలయాలన్నీ శివుడికి నివాస భూములే. శివుడు హిమవంతుడికి అల్లుడు. తన అల్లుడైన శివుడికి తన పర్వతాలన్నీ కానుకగా ఇచ్చేస్తాడంట ఈ భగవంతుడు. అలా శివుడికి క్రీడా వనముగా మారింది ఈ బద్రిక వనము. అయితే శ్రీమన్నారాయణ ఈ ప్రాంతం అందానికి ముక్తుడై ఈ ప్రదేశాన్ని కోరి బాలుడి రూపంలో వచ్చి పార్వతీ పరమేశ్వరుని మెప్పించి ఈ ప్రదేశాన్ని ఈ ప్రాంతాన్ని నారాయణుడికి ఇచ్చి తాను కేద్రనాథ్ పర్వతానికి వెళ్లిపోయారు.
శివుడు అన్నది ఒక కథనం అలా బద్రి నారాయణుడికి నివాసం అయింది. బద్రీనాథ్ క్షేత్రం అలకనంద నది తీరంలో ఉంది. గంగానది పారె ఈ అలకనంద అని చెప్పొచ్చు. గంగమ్మ తల్లి భగీరధుడిని ప్రయత్నంతో అతడి పూర్వీకులకు శాప విముక్తి కలిగించడానికి భూమికి దిగి వచ్చే తరుణంలో శక్తివంతమైన తన ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కాబట్టి కొన్ని భాగాలుగా చీలినట్టు దానిలో అలకనంద నది ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఆలకానంద నది ఒడ్డునే ఉంది బద్రి ధామము.
బద్రీనాథ్ ఆలయము చరిత్ర
ఇక బద్రీనాథ్ ఆలయము చరిత్ర విషయానికి వస్తే జగద్గురువులు అయ్యిన ఆది శంకరా చార్యుల వారు అలకనంద నది తీరములో నారద కొండల్లో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించారు. 16వ శతాబ్దంలో గడవాల్ రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్టించి గుడిని నిర్మించాడని ఆలయ చరిత్ర చెబుతుంది. బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండ చర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణం పునఃర్వర్ధన కార్యక్రమాలు నిర్వహించారు.
బద్రీనాథ్ ఆలయము విశేషాలు
- 1803 లో హిమాలయాలలో సంభవించిన భూకంపం లో ఆలయం శిథిలం కావడంతో జైపూర్ రాజ చేత ఈ ఆలయం పునఃనిర్మించడం జరిగింది.
- బద్రీనాథ్ ఆలయము గోపురముతో కలిపి 50 అడుగులతో దర్శనం ఇస్తుంది. ఆలయం పైకప్పు బంగారు రేకులతో చేయబడి ఉంటుంది.
- ఆలయము నిర్మాణ శైలి ముఖద్వారము రంగులతో అలంకరించబడి బౌద్ధ ఆలయాలను తలపించేలా కనబడుతుంది.
- ఈ మందిరము ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి రోజు తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకు పవిత్ర పూజలు నిర్వహించి, ఆరు నెలలకు సరిపడా నెయ్యి అఖండ జ్యోతిలో వేసి మందిర తలుపులు మూసి వేస్తారు. తిరిగి ఆరు నెలల తర్వాత తలుపులు తెరిస్తే, అక్కడ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ జ్యోతి కొండెక్కడం అనేది ఉండదు. ఇదంతా భగవంతుడి మహిమలే అని భక్తులు ప్రగాఢ నమ్మకం. అలా తలుపులు మూసిన ఆరు నెలలు నాదరుడు పురోహితుడుగా దేవతలు స్వామివారిని సేవించుకుంటారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
- ఆలయములో బద్రి నారాయణుడు వెండి సింహాసనము పై బంగారు గొడుగు క్రింద దర్శనం ఇస్తారు. రెండు అడుగులు ఎత్తున స్వామి వారి విగ్రహ మూర్తికి ఇరువైపులా కుబేరుడు, గరుత్మంతుడు, నర నారాయణులు, శ్రీదేవి, భూదేవి, వీణతో ఉన్న బాల బ్రహ్మచారి నాదర మహర్షి, ఉద్దవుడు ఇలా తన దేవిరులతో భక్త బృందంతో దర్శనం ఇస్తారు.
- బద్రి నారాయణుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ప్రధాన దర్శనీయ స్థలం బ్రహ్మకపాలం ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బ్రహ్మకపాలం ఈ బ్రహ్మ కపాలంలో పితృ దేవతలకు పితృ కార్యాలు నిర్వహిస్తే వారికి శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఈ బ్రహ్మ కఫలం వెనక పెద్ద పురాణం కథనమే ఉంది. ఒక సందర్భంలో ఆగ్రహము చెందిన పరమేశ్వరుడు బ్రహ్మ దేవుడి 5వ తలను ఖండించగా శివుడికి బ్రహ్మ హత్య దోషం అంటుకుంది. ఆ దోషాన్ని పర్యటించుకోవడం కోసం వివిధ ప్రదేశాలలో సంచరించి ఇక్కడికి వచ్చాడంట శివుడు. అలా వచ్చిన తర్వాత శివుడికి అంటిన బ్రహ్మ అత్యాదోషం హరిహరించబడి బ్రహ్మ తల ఇక్కడ పడిందని పురాణ కథనం. అలా ఈ ప్రాంతం పాప పరిహార ప్రదేశంగా పిస్తృ కార్యాలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ నది ఒడ్డున సుమారు పది అడుగుల పొడుగు ఆరడుగులు ఎత్తుతో నాలుగు అడుగులు మందంతో ఉన్న ఒక పెద్ద బండ ఉంటుంది. అదే బ్రహ్మకపాలం అని చెప్తారు.