మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెటిచ్చిన యోగి....యోగి ఆదిత్యనాథ్ జీవితాచరిత్ర....
ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ కి జంగల్ రాజ్ అనే పేరు ఉండేది. ఎందుకంటే ఆ రాష్ట్రం గుండాలకు, గ్యాంగ్ స్టార్లకు, రౌడీ రాజకీయాలకి, కులమత గొడవలకి పెట్టింది పేరుగా ఉండేది. అంతేకాదు, ఇప్పటివరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తన ఐదేళ్ల పదవీ కాలాన్ని ఈ రాష్ట్రంలో పూర్తి చేయలేదు. అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే 1980 నుండి 1988 ఈ మధ్యలో ఆరుగురు ముఖ్యమంత్రిలు ఈ రాష్ట్రములో మారారు. అంటే ఇక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఇంకా కరెక్షన్ గురించి గుండాయిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే అమ్మో అనే విధంగా ఉండేది. అప్పుడు కాషాయము కట్టుకొని ఒకరు వచ్చారు. ఇప్పటివరకు ఉన్న చరిత్రను తిరగరాసి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా మళ్లీ తిరిగి ఎన్నికయి ప్రభుత్వాన్ని స్థాపించి ఒకప్పుడు అసెంబ్లీలో తన చేత కంటతడి పెట్టించిన గ్యాంగ్ స్టార్ లను ఎన్కౌంటర్లో లేపేస్తూ ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి వైపుకు నడిపిస్తున్నా వ్యక్తి ఆయనే "యోగి ఆదిత్యనాథ్". ఇది ఓ సన్యాసి కథ, ఓ యోగి కథ. ఓ మఠాధిపతిగా ఉంటూ రాజకీయాలలో అడుగు పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక ఆదిత్యనాథ్ కథ. ఆయనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి "శ్రీ ఆది యోగి ఆదిత్యనాథ్ జి మహారాజ్" ఒక ప్రజా ప్రతినిధి రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక మత ప్రధానమైన పీఠానికి అధిపతిగా ఉండడమే చాలా అరుదు.
ఆయన పాలనలో మార్పు చూపించడమే యోగి స్పెషాలిటీ. కాశీకి వెళ్ళాడు కాషాయం కట్టాడు ఏమి చేయలేడు అనుకున్న గ్యాంగ్ స్టార్ లను ఎన్కౌంటర్లలో ఏరిపారేశారు. ఈ కాషాయ వస్త్రధారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాము.
యోగి ఆదిత్యనాథ్ కుటుంబము
ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రములో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 1972 జూన్ 5వ తేదీన యోగి జన్మించారు. ఇప్పుడు ఈయన వయస్సు 52 సంవత్సరాలు. యోగి గారి కుటుంబ విషయానికి వస్తే వీరి తండ్రి ఆనంద్ సింగ్. ఆనంద్ సింగ్ గారు ఫారెస్ట్ రేంజర్ గా పని చేశారు. వీరికి మొత్తం ఏడుగురు సంతానం. వారిలో నలుగురు మగ పిల్లవాళ్ళల్లో రెండో వాడే యోగి. మిగిలిన పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు.
యోగి ఆదిత్యనాథ్ గారు సన్యాస దీక్ష
చిన్నప్పటినుండి యోగి కుటుంబ వాతావరణం ఎప్పుడు ఆధ్యాత్మితను కలిగి ఉండేది. ఇక యోగి చదువు విషయానికి వస్తే హెచ్.ఎం.విగర్వాల్ యూనివర్సిటీ నుండి మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. ఇక ఆ సమయంలోనే అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం మొదలైన ఉద్యమాలలో తను కూడా పాల్గొనడము కోసం 1990లో తన 21వ వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయారు. యోగి ఆ తర్వాత గోరకనాథ్ మఠానికి చేరి మఠము అధిపతి అయిన మహంతి వైద్యనాథ్ గారికి శిష్యుడిగా చేరారు. ఇలా నాలుగేళ్లు ఇక్కడే గడిపాక ఇంకా 1994లో మహంతి వైద్యనాథ్ గురువు నుంచి సన్యాసం దీక్షను తీసుకొని ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గా తనని తాను మార్చుకున్నారు.అంతేకాకుండా ఆయన తన కుటుంబం నుంచి 25 ఏళ్ల వయసులోనే సంబంధాలు తెంచుకున్నారు. సన్యాసం తీసుకోవడానికి ముందు ఆయనకు ఎలాంటి వివాహం జరగలేదు. కనుక యోగి గారికి వివాహ జీవితం అంటూ ఏమీ లేదు.
యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ప్రవేశము
తన గురువుగారు మహంతనాద్ వైద్యనాథ్ తన రామ మందిరము ఉద్యమాలలలో పనిచేయడమే కాకుండా ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి గోరాఖీపూర్ వరుసగా నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేశారు. గోరఖ్ నాథ్ ఆలయాన్ని ఆ రాష్ట్ర రాజకీయాలకు మధ్యన ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మహంత వైద్యనాథ్ ముందు మహంతా దివ్య నాథ్ కూడా దీనిని రాజకీయ కేంద్రంగా మార్చారు. ఆయన కూడా గోరాఖీపూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. మహంత్ వైద్యనాథ్ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా యోగి వచ్చారు. ఇలా తన 26 ఏళ్ల వయసులో గోరాఖీపూర్ నుండి ఎంపీగా పోటీ చేసి 6000 ఓట్ల మెజారిటీతో యోగి గెలుపొందారు. ఆ సమయములో లోకసభకు ఎన్నికైన అతి చిన్న వయసుడిగా యోగి రికార్డు సృష్టించారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ వెనక్కి తిరిగి చూసిందే లేదు. వరుసగా 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బి.జె.పి తరపున ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ మాఫియాను తరిమెయడము
అయితే ఆరోజుల్లోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైన రోజుల్లోనే బిజెపి నుండే కాకుండా తనకంటూ ప్రత్యేకతమైన వర్గం కావాలని "ఇందు యువ వాహిని" సంస్థను స్థాపించారు. పేరుకు ఇది సాంస్కృతిక సంస్థ. కానీ, దాని లక్ష్యం హిందూ మతాన్ని రక్షించడము. ఇందులో భాగంగా ఘర్ వాపస్ పేరుతో మతం మారిన 1800 మందిని తిరిగి హిందూమతంలోకి రప్పించడము. ఈ సంస్థను చేపట్టింది మత పర్వితమైన ఉద్రీక్తలలో ఈ సంస్థను జోక్యం చేసుకుంటుందని సంస్థకు నాయకత్వం వహిస్తున్న యోగిని 2007లో అరెస్టు చేశారు. 11 రోజులు పాటు జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ పైన విడుదల అయ్యారు. ఆ టైంలో అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం తనని వేధిస్తున్నరాని ఎంపీగా ఉన్న తనని ఇంత వేధిస్తే ఇక సామాన్యుడు పరిస్థితి ఏంటి అని లోక్సభలో యోగి కన్నీరు పెట్టుకున్నారు. చిత్తశుద్ధితో సన్యాసము తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనకి నీచ రాజకీయాలు అంటగట్టి తనపై కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటూ రాష్ట్రంలో మాఫియాను, గూండా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. వారిని ఇక మట్టిలో కలిపేయాలని ఆనాడే తన మనసులో అనుకున్నారు. తన రాష్ట్ర పరిస్థితులని ఎలాగైనా చక్కదిద్దాలని అనుకున్నారు. ఇక ఎవరైతే నాకేంటి అనే ధోరణతో ఉన్నారు.
బి.జె.పి ని విబేదించడము
యోగి దాదాపు 10 ఏళ్ల పాటు తన సొంత పార్టీ అయ్యిన బీజేపీ అధిష్టానంతో మంచి సంబంధాలు లేకుండానే పోయాయి. అయినా హిందూ ఓటర్లపై ఆయన ప్రభావము వలన పార్టీ నాయకత్వము ఆయనని పక్కన పెట్టలేక పోయింది. యోగి బి.జె.పి అధిష్టానముతో ఎన్నోసార్లు విభేదించారు. అయినప్పటికీ కూడా తప్పనిసరి బిజెపి నేతలు ఆయనతో రాజీ పడాల్సి వచ్చింది. గోరాఖీపూర్ లో మూడు రోజులపాటు "విరాట ఇందు సమ్మేళను" నిర్వహించి బిజెపికే సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును బిజెపి సమర్థిస్తే ఆయన వ్యతిరేకించారు. హిందూ, ముస్లిం వివాహాలకు ఆయన వ్యతిరేకం కాదాని దానిలో ఎలాంటి మోసం ఉండకూడదని అని గట్టిగా అంటారు.
యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతిని స్వికరించడము
యోగి ఆదిత్యనాథ్ మహంతి వైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరక్ నాథ్ ఆలయము మఠాధిపతిగా యోగి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే ఇటు రాజకీయ నేతగా రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా ఒక పీఠాధిపతిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది అతని మత విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకుంటారు.
ఉత్తరప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా యోగి
2017 వ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో ఘనవిజయం సాధించిన బిజెపి యోగిని ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. 2017 మార్చి 19న ఉత్తరప్రదేశ్ కి 21వ ముఖ్యమంత్రిగా యోగి పదవి ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా పార్టీ ముందుకు తన నిర్ణయం చెప్పేవారు. అందుకు ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో బిజెపిలో ఏ నాయకుడు వారికి ఎదురు మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ, యోగి మాత్రం తనకు కావాల్సింది నీర్ మొహమాటంగా అడిగేవారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఒక హార్ట్ టాస్క్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పినట్టు పని చేయాల్సిందే అని ఉద్యోగులకు అర్థం అయింది. కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు తర్వాత మీటింగ్ లో దాన్ని స్టేటస్ తెలుసుకోవడం ఒకవేళ పని జరగడం లేదు అని తెలిసినప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం యోగి పాలన స్టైల్. ఆయన పరిపాలన గుజరాత్ మోడల్ లాగా యూపీ మోడల్ అన్నట్టుగా ఉంటుంది. ఇంతకు యూపీ మోడల్ అంటే లా అండ్ ఆర్డర్ డెవలప్మెంట్. దానితోపాటు హిందుత్వము ప్రచారము అభివృద్ధి చట్ట పాలనపై దృష్టి పెట్టడము. అంతేకాదు, ఎవరైనా తప్పు చేస్తే బుల్డోజర్ ని నడిపించడము. ఈమధ్య బుల్డోజర్ అనే రాజకీయ పదము కూడా బాగా పాపులర్ అయింది. ఇక తను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 36 శాఖలని తన నియంత్రణలో ఉంచుకొని వాటిని నిరంతరము పరీక్షిస్తూ ఉండేవారు.
ముఖ్యమంత్రి అయ్యాక యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాలు
- యూపీలో గో వధ పై అనగా ఆవుల్ని చంపడం పై ఉక్కు పాదం మోపారు. అక్రమ కళేబారాలను ముగించారు.
- లవ్ జియాద్రిని అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా తొలత ఒక బిల్లు తెచ్చారు. ఇక తాను 2007లో అరెస్ట్ అయినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయడం మొదలుపెట్టారు.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా తయారయ్యారు. తన మొదటి 10 నెలల్లోనే రోజుకు నాలుగు పోలీస్ ఎన్కౌంటర్లు చొప్పున వరుసగా నిర్వహించారు. ఇప్పటివరకు యూపీలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి, ఈ ఎన్కౌంటర్లో ముఖ్యమైన మాఫియా డాన్లు అయినా అత్తిక మహమ్మద్, ముక్తార్ అన్సర్లు మట్టిలో కలిసిపోయారు. అంతేకాదు వందలాది రౌడీషీటర్లను ఎన్కౌంటర్లో లేపేశారు. దాంతో రౌడీ రాజకీయము చేయాలంటే భయపడే స్టేజి లో ఉన్నారు. ఇప్పుడు అక్కడి గ్యాంగ్ స్టార్లు శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేటట్టు యోగి సర్కార్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు.
- దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలు అధిక భాగం సాయంత్రం లేదా తెల్లవారుజామున కాలకృత్యాలు కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్తున్న వాళ్లపై జరుగుతున్నాయి. కాబట్టి వాళ్లకి ప్రత్యేకత్వమైన మరుగుదొడ్లు నిర్మించడం అనేది పరిశుద్ధులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, మహిళలు ప్రకారంగా వారి భద్రతకు వారి గుర్తింపుకు సంబంధించిన విషయం అని యోగి ప్రభుత్వం గుర్తించింది. ఇక యోగి ఆదిత్యనాథ్ పరిపాలనల్లలో మహిళలు అలాగే పిల్లలపై నేరాలు చాలానే తగ్గాయని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.
- కరెంట్ 2017 వ సంవత్సరం మొదటి వరకు కూడా రాష్ట్రంలో చాలా గ్రామాలలో రోజు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకు లేదా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు, ఇలా ఈ రెండు షెడ్యూల్లోనే కరెంట్ ఉండేది తప్ప సాయంత్రం ఐదు నుంచి కరెంట్ అనేది ఉండేది కాదు. ఇక కరెంటు ఉన్న ఆ సమయాలలో కూడా ఓల్డేజ్ తక్కువగా ఉండడంతో కేవలం ప్రజలు ఫ్యాన్స్ బల్బులు తప్ప ఇంకేమి వాడలేకపోయారు. కానీ, 2017 వ సంవత్సరం నుంచి యోగి అధికారంలోకి వచ్చాక రోజులో ఉన్న 24 గంటల్లో కచ్చితంగా 18 నుంచి 20 గంటలు కరెంట్ అన్నది ఉండేది. ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఒక ఇల్లు అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు.
- యోగి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క స్కూల్లో కూడా టీచర్లు బయోమెట్రి ద్వారానే హాజర్ వేసే విధానాన్ని తీసుకువచ్చారు. దీంతో ప్రతి టీచర్ ప్రతిరోజు స్కూల్ కి వస్తున్నారు. స్టూడెంట్స్ విషయంలో కూడా ఇదే పాటిస్తున్నారు. దాంతో నేడు స్కూల్లో నకిలీ అటెండెన్స్ అనే కాన్సెప్ట్ తొలగిపోయింది. అలాగే ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో కూడా చాలా కొత్త విధానాలు తేవడంతో ఫేక్ మార్కులు ఫేక్ రిజల్ట్స్ అనేవి పూర్తిగా తగ్గాయి. కేవలం కష్టపడి చదివిన వారే పాస్ అవ్వడం జరుగుతుంది.
- 2017 ముందు వరకు గ్రామాలలో రోడ్లు ఎంతో మురికిగా ఉండేవి. ఇక వర్షాకాలంలో రోడ్లపై నడవడం అనేది జరగని పని. కానీ, నేడు గ్రామాలలోని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లతో ఎప్పుడు పరిశుభ్రతంగా ఉంటున్నాయి.
- నిరుద్యోగ రేటు అనేది ఒకప్పటితో కన్నా కొలిస్తే బాగా తగ్గింది.
- యోగి అధికారంలోకి వచ్చాక ఉత్తర్ ప్రదేశ్ టూరిజం అనేది భారత దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.
- రాష్ట్రములో తొలిసారి ఆదాయము మరింత పెరిగింది. అంతేకాదు, బిజినెస్ లో వీరి రాష్ట్రము రెండో స్థానంలో నిలిచింది.