పి.వి నరసింహారావు గారు .....భారతదేశపు ... 9వ ప్రధానమంత్రి, రాజకీయ జీవితం...

పి.వి నరసింహారావు గారు .....భారతదేశపు ... 9వ ప్రధానమంత్రి, రాజకీయ జీవితం...

భారతదేశములో స్వయం పాలన ప్రారంభమైన శుభ తరుణములో పాలన పగ్గాలు చేపట్టిన నాయకుల్లో కొంతమంది నాయకులు ప్రజాస్వామ్య విధానాలు చేసి దశబ్దాలుగా ఆ విధానాలు చెక్కుచెదరకోకుండా అమ్ములు అయ్యే బాటలో నడిపించారు. అలాంటి నాయకుడిలల్లో అచ్చమైన తెలుగు బిడ్డ "పాములపర్తి వెంకట నరసింహారావు" గారు. దేశ ప్రజలపై నిజమైన ప్రేమ నిండుగా నింపుకున్న పీవీ నరసింహారావు గారు పాలనా విధానము పొందారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరిచారు. ప్రతి పాలన శాఖలో ఉత్తేజము నింపారు. పీవీ అంటే చాణిక్యుడి ప్రతిరూపము. తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు గారు.

పి.వి. నరసింహారావు గారి బాల్యము

తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు గారి పూర్తి పేరు "పాములపర్తి వెంకట నరసింహారావు". కరీంనగర్ జిల్లా భీమదేవరి పల్లి మండలము సీతారామారావు, రుక్మా బాయి అమ్మ పుణ్య దంపతులకు ముద్దుబిడ్డగా జన్మించారు. వరంగల్ జిల్లా లక్ష్మీ పల్లెలోని నానమ్మ గారి ఇంటిలో జన్మించారు పివి. తన మూడవ సంవత్సరములో పాములపర్తి రంగారావు గారికి దత్తపుత్రుడిగా వెళ్లారు. పివి బాల్యము, విద్యాభాష్యము అంతా వరంగల్ ప్రాంతములోనే జరిగింది. ఏడవ తరగతి నుండే హనుమకొండలో ఉన్న పాఠశాలలో తన విద్యని పూర్తి చేశారు. బాల్యము నుండి ఈయన సాహిత్యము, కలల పట్ల మక్కువ పెంచుకున్నారు. ఓరుగల్లు నగరములో ఉండడము వలన ఓరుగల్లులో చారిత్రక స్థల ప్రభావము ఆయనపై ఎక్కువగా ఉండేది. గ్రంథాలయములో ఎక్కువ సమయము గడిపేవారు. ఆ దశలోనే చిత్రలేఖను, నాటకాలపై మరింత అభిరుచి పెరిగింది. శాస్త్రీయ సంగీతము నేర్చుకున్నారు. సంగీతము అంటే ఆయనకు ఆరో ప్రాణము. నాటకాలతో వేషాలు వేసేవారు. సినిమాలపై విమర్శలతో అనేక రచనలు చేసేవారు. యుక్తవయసులోనే కొన్ని రచనలు కూడా చేశారు.

అప్పట్లో తెలంగాణ రాష్ట్రము మొత్తము హైదరాబాదు సంస్థానము నిజామ్ రాజుల పాలనలో స్వతంత్రంగా ఉండేది. దేశవ్యాప్తముగా బ్రిటిష్ పాలనలో ఉంటే హైదరాబాద్ మాత్రము స్వతంత్రంగా ప్రత్యేక చట్టాలతో ఉండేది. నిజామ్ పాలకులకు అండగా ప్రత్యేక రక్షక దళాలుగా రజయకారులు ఉండేవారు. వేలాది ఎకరాల భూములు గ్రామాలు అన్నీ భూస్వాములు అధీనములోనే ఉండేవి. వారిని దోరగా పిలిచేవారు. దొరల విలాస నివాస భవనాలను ఘడియలుగా పిలిచేవారు. ప్రజా యుగానికి నిజామ్ పాలకుల కి మధ్యన దొరలు ఉండి గ్రామాలకు ప్రజానీయముపై పెత్తనము చెలాగించేవారు. పన్నులు వసూలు చట్టాల అమలు నిజామ్ అధికారులతో కలిసి అజమైసి చేస్తూ అనేక అరాచకాలకు అనువిస్తున్న పరిస్థితి ఆనాటిది. ఆనాడు అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో నిజామ్ నీ పొగుడుతూ ప్రార్థన సంగీతము ఆలపించాల్సిందే. విద్యార్థి దశలోనే వందేమాతరము నిమగ్నం అయ్యారు పివి నరసింహారావు గారు. దొరల వారి ప్రార్థన బదులు వందేమాతరము ప్రార్థన చేయడము వలన అందుకని నిజామ్ ప్రభుత్వ వాసులు అక్కడ విద్య చదువుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అందుకని పుణ్యత విద్యని చదువుకోవడానికి పీవీ మహారాష్ట్రలోని ఓ నగరములోకి వెళ్లి అక్కడ ఒక కళాశాలల్లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పివికి ఉద్యోగము లభించిన ఆయన ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని పెంచుకున్న పీవీ బ్రిటిష్ పాలకుల కింద పనిచేయడము తనకి ఏమాత్రము ఇష్టంగా అనిపించలేదు.

పి.వి నరసింహారావు గారి రాజకీయ గురువు

పీవీ రాజకీయ రంగ ప్రవేశానికి ముఖ్య కారకులు పీవీ రాజకీయ గురువు అయిన స్వామి రామానంద తీర్థ గారు. ఈయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో అతివాదుల వర్గములో ముఖ్య వ్యక్తిగా ఉండేవారు. రామానంద తీర్థ అభ్యుదయ భావాలు, ఆయన వేశాలితనం పీవీని ఎంతగానో ఆకర్షించాయి. నిత్యము ఆయన వెంటే ఉన్నారు. రామానంద తీర్థ అంటే ఒక సమస్థ. ఇంకా ఒక శక్తి అని గొప్పగా చాటే వారు పీవీ నరసింహారావు గారు. పీవీ నరసింహారావు అంటే తన గురువుకి ఎంతో అభిమానము. పీవీది భూస్వాములు కుటుంబము. హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ రామానంద అడుగుజాడలలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనేక సత్యగ్రహ కార్యక్రమాలలో పాల్గొనేవారు. 1943లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ కు హాజరైన తదుపరి, ఆ స్ఫూర్తితో రాష్ట్రస్థాయి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేవారు. రామానంద తీర్థ ముఖ్య శిష్యులలో వీరేంద్ర పార్టీ, ఎస్పీ జవా, పీవీ నరసింహారావు వీళ్లు ఎక్కువ గుర్తింపు లోకి వచ్చారు.

పి.వి నరసింహారావు గారి రాజకీయలోకి రంగప్రేవేశము

1951లో పీవీ అఖిల భారత కాంగ్రెస్ లో కమిటీ సభ్యుడు అయ్యారు. పోలీస్ చర్య తర్వాత నిజామ్ ప్రభుత్వము భారత విలీనము అయిన తర్వాత ఇవి ఏఐసీసీ సభ్యుడిగా సేవలందిస్తూ 1952లో ఎన్నికలలో కరీంనగర్ లోకసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీల్లో నిలిచారు. అయితే ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిని చూశారు. పీవీ రాజకీయ ప్రస్థానము ఓటమితోనే ప్రారంభము అయింది. అయితే భవిష్యత్తు రాజకీయ ప్రస్థానము మొత్తము విజయాలతో నిండింది. కష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ అడుగంటి పోతున్న భారత పాలన వ్యవస్థకు పునఃప్రాణ ప్రతిష్ట చేసే దిశా నిర్దేశము చేశారు. పీవీ 1957లో తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర శాసన సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1962, 1967 అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అందుకున్నారు. తొలిసారి శాసన సభ్యుడిగా 1957 లోనే ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలోనే అడుగుపెట్టారు. తొలి ప్రవేశముతోనే అందర్నీ ఆకట్టుకున్నారు. స్పీకర్ గా ఉన్న అయ్య దేవర కాలేశ్వరం అభిమానాన్ని కూడా పొందారు. 1956 సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1962 వరకు ఉప అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పార్టీలో పదవులు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, విద్యా కమిటీ అధికార భాషల సభ్యుడిగా అన్నిటిలోనూ ఆచరించే వాడిగా శ్రీకారము చుట్టారు. ఏ కాలములో ఏ పదవిని ఆయనకి ఆయన తపన పడి స్వార్థముతో తీసుకోలేదు. పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితము ప్రారంభమైన తదుపది శాసన సభ్యత్వాలు, పార్లమెంటు సభ్యత్వాలు, కేంద్ర మంత్రి పదవులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి మహోన్నత్వమైన దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టడములో ఏ రోజు ఆయనకు ఆయన ఎప్పుడు ఆశించలేదు. ఆ పదవీ పగ్గాలన్నీ వచ్చి ఆయన చేతిలో ఇమిడిపోయయి. ఏ వ్యక్తికి ఈ నాయకుడికి దక్కని పదవి అలంకృతాలు పాలనా కీర్తనలు ఒక్క పీవీకే దక్కయి. ఆయన నిండు వ్యక్తిత్వము జ్ఞాన ప్రతిభకు నిదర్శనము. పివి గారు రాష్ట్రస్థాయిలో విభిన్న శాఖలకు మంచి మంత్రివర్యగా సేవలు అందించి అన్ని శాఖలను చైతన్య పరిచారు. న్యాయ సమాచారంగా, మంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, దేవాదాయ, ధర్మదాయ, మంత్రివర్యగా సేవలు అందించారు. ఈ శాఖలో అనేక సవరణలు చేసి నిద్రిష్ఠమైన చట్టాలను అమలు చేశారు.

పి.వి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అవ్వడము

రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు మంత్రివర్గములో పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మానందం రెడ్డి గారి మరణము తర్వాత ముఖ్యమంత్రి పదవి పీవీకే దక్కింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుసారము పివి 1971లో ముఖ్యమంత్రిగా పదవిని పొందారు.

పి.వి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత చేసిన సేవలు

1973లో అనేక సంస్కరణలతో రాష్ట్ర పాలన రూపాన్ని మార్చారు. సాహస నిర్ణయాలు తీసుకున్నారు. పివి ఒక పెద్ద భూస్వాములు కుటుంబము అయినా ముఖ్యమంత్రిగా భూసంస్కరులు చట్టము గట్టిగా అమలు చేశారు. తమ కుటుంబలకు ఉన్న 1000 ఎకరాల సొంత భూములను పరులకు పంచిపెట్టారు. తను ఆచరించి ఇతరులని కూడా ఆచరించేలాగా నికాసైన, నిజమైన, ఆదర్శమైన నాయకుడిగా నిలిచారు.

పి.వి నరసింహరావు గారికి వచ్చిన పదవులు

1974లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పదవిని చేత పట్టి పార్టీకి అత్యంత బలాన్ని ఇచ్చారు. 1977లో పీవీ హనుమకొండ లోక్సభ స్థానములో గెలుపొంది పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు. 1980 ఎన్నికలలో అదే స్థానము నుండి గెలుపొందారు. తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు. 1984లో హోంశాఖ మంత్రిగా మహారాష్ట్రలోని ఒక స్థానము నుండి గెలుపొంది కేంద్ర ప్రణాళిక మంత్రిగా సేవలు అందించారు. ప్రణాళిక సంఘము డిప్యూటీ చైర్మన్, మానవ వనరులు శాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, అత్యంత ప్రతిభ కీర్తులను అందుకున్నారు.

పి.వి. నరసింహారావు గారు ప్రధాని అవ్వడము

1991లో దేశ ప్రధాని రాజీవ్ గాంధీ అత్యంత దుర్ఘటన జరిగింది. హటాటుగా దేశ పాలన వ్యవస్థ సంసోబానికి లోనయింది. పీవీ నరసింహారావు అప్పటికే కొంతకాలముగా రాజకీయాలకి దూరంగా ఉంటూ, ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న దశలో పివి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఈ దశలో ప్రధాన మంత్రి పదవి చేపట్టి దేశ పాలన పగ్గాలు పట్టక తప్పలేదు. ప్రభుత్వాన్ని తిరిగి బలంగా చేశారు. ఆనాడు పీవీ ఈ నిర్ణయాలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నాశనము అయిపోయేది. దేశ పాలన తీవ్ర సంశోభములో పడిపోయేది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో దేశాన్ని ఆదుకున్న వ్యక్తి మన పీవీ నరసింహారావు గారు. మిన్ను విరిగి మీద పడ్డ ఏమాత్రం చలించని వ్యక్తి పీవీ నరసింహారావు గారు. తెలంగాణ తెలుగు భీష్మాచార్యులు. రాజకీయ అనుభవము, పాలన అనుభవము లేని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరుణములో దేశ పాలన వ్యవహారాలో పీవీ రాజీవ్ గాంధీకి కుడి భుజముగా ఉండేవారు. చంద్రగుప్తునికి చాణిక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకు అప్పాజీ వీలు ఎలా వెనుక ఉండి నిలిచారో అలాగే రాజీవ్ కి పివి అండగా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత దేశము సంక్షోభములో పడింది. తీవ్రవడము, ఆర్థిక సంశోభ, మెజారిటీ లేకుండా పార్టీ బలహీనత ఇలాంటి పరిస్థితులలో పివి ప్రధానిగా అధికారము చేపట్టారు. ఆయన సాధారణమైన రాజకీయ నాయకుడు కాదు, అత్యంత ప్రతిభ మూర్తి. చిన్న మచ్చ కూడా అంటని నికాసైన నాయకుడు. ఆదర్శవాది, కవి శేషుడు ఇంకా ఎన్నో గొప్ప అలవాట్లు ఉన్న అలాంటి పీవీ పవిత్ర వాణి భారత పాలనను చేపట్టడము భారత ప్రజానికము చేసుకున్న అదృష్టమే అంటారు. అత్యంత కష్ట కాలములోనే ఆ పదవి ఆయనకు ముళ్ళ కిరీటమే. పాలన చేపట్టడానికి పివికి పూర్తి మెజార్టీ లేదు. మిత్రపక్షాలను కలిసి తెలివిగా మెజారిటీ తెప్పించుకున్నారు. అందరిని ఆప్యాయంగా చూసే పివికి పాలన చేయడము తేలిక అయింది. పార్లమెంట్ సభ్యుడిగా లేకుండా నేరుగా ప్రధాని మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత కొద్ది కాలములోనే నంద్యాల బరంపురము స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఒక స్థానము వదులుకొని రాజ్యాంగ విధివిధానాల ప్రకారము ప్రధాని పదవిని పరిపూర్ణము చేసుకున్నారు. పార్టీ సభ్యులు మెజారిటీ నిరూపించుకున్నారు. సంక్షోభములో పదవి చేపట్టి బల నిరూపణ చేసుకొని అదే స్థితిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పివి కి ముందు ఆ తర్వాత ఏ నాయకుడికి సాధ్యపడలేదు. ఆనాడు ఆయన అమలు చేసిన సంస్కరణలలో ఆయన మరణం తర్వాత ప్రభుత్వాలకి కూడా నేటికీ అమలు అవుతున్నాయి.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !