పుట్టపర్తి సత్యసాయి బాబా గారి జీవిత చరిత్ర

పుట్టపర్తి సత్యసాయి బాబా గారి జీవిత చరిత్ర 


ఈయన పేరు తెలుగు రాష్ట్రాలలో వినని వారు ఉండరు. శిరిడి అవతార పురుషుడిగా ఈయనని భావిస్తారు. అంతేకాదు, ఈయనని దేవదేవుడు నాగరాజుగా అన్ని కూడా కొలుస్తారు. ప్రజలందరూ పుట్టపర్తి సాయిబాబాగా పిలుస్తున్న వీరి అసలు పేరు "సత్యనారాయణ రాజు". వీరు ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపురము జిల్లాలోని గొల్లపల్లి అనే గ్రామములో వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ అనే దంపతులకు జన్మించారు. గొల్లపల్లి గ్రామాన్ని పుట్టపర్తి గా పేరు మార్చి పిలుస్తున్నారు. వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు మొత్తము ఐదుగురు సంతానము. వీరిలో నాలుగో సంతానమే సత్యనారాయణ రాజు. అంటే వీరికి ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. వీరిది చిన్నప్పటినుండి నిరుపేద కుటుంబము.

సత్యనారాయణ రాజు గారి జన్మించడము వెనుక ఒక కథనము

సత్యనారాయణ రాజు జన్మించడము వెనుక ఒక చిన్న ఆశక్తికరమైన కథనము ఉంది. అదేమిటంటే వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు సత్యనారాయణ వ్రతం చేయడము వల్లనే ఈ బాబు పుట్టడముతో వీరు ఇతనికి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ బాబు పుట్టిన సమయములో వారి ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంటా అవే వచ్చాయి. అది ఇప్పటికీ కూడా అందరూ చెప్తుంటారు. అలాగే ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రాసిన పుస్తకము ప్రకారము వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతుల ఇంట్లో వ్రతము చేసుకున్న తర్వాత ఈశ్వరమ్మకు నీలపు రంగులో ఒక కాంతి తనలో లీనమైనట్టు కలలో కనిపించిందంట. ఆ తర్వాత అమ్మ గర్భవతి అయింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి పక్కలో ఒక నాగుపాము కనిపించిందంట. ఈ కారణముగానే ఆయనకు అందరూ నాగరాజుగా భావిస్తారని ఆ పుస్తకములో రాశారు.

సత్యనారాయణ రాజు బాల్యము

వీరి బాల్యము విషయానికే వస్తే బొక్క పట్నంములో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. వీరికి చిన్న వయసు నుంచే నాటకాలు, సంగీతము, కవిత్వము, నటన అటువంటి అంశాల పైన ఇష్టము ఉండేది. అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఉరవకొండ పాఠశాలలో చదువుకున్నారు. ఆ సమయములోనే ఒకసారి ఆయనకు తేలు కుట్టింది. ఆ తర్వాత నుంచి ఆయనకు ఒక్కసారిగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు. తర్వాత ఆయన ఎలా ప్రవర్తించేవారు అంటే "సమాధి స్థితిలో ఉన్నట్టు ఉండేవారు. అంతేకాదు, పురాణ శ్లోకాలు చెప్పేవారు. అన్నం సరిగ్గా తినేవారు కాదు". ఇలా ఉండగా ఒకనాడు 1940లో తాను శిరిడి సాయిబాబాకు చెందిన ఫకీర్ అవతారము అని తనకు తానే ప్రకటించుకున్నారు. ఆ పేరు తనకు తానే పెట్టుకున్నారు. అదే సంవత్సరములో అనగా 1940 అక్టోబర్ 20 న ఆ సంవత్సరములో ఆయనకు 14 సంవత్సరాలు ఆ రోజున ఆయన చదువు మానేస్తున్నానని చెప్పి తనని భక్తులు పిలుస్తున్నారు నాకు చాలా పని ఉందని అందరితో చెప్పి ఊరు బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల వరకు దగ్గర్లోనే ఒక తోటలో చెట్టు క్రింద కూర్చొని అక్కడే గడిపే వారంట. ఆ సమయములోనే అతని దగ్గరికి మెల్లగా ప్రజలు రావడము మొదలయ్యింది. ఇలా తన దగ్గరకు వచ్చిన ప్రజలతో భజనలు చేయించేవారు. అంతేకాదు, వారితో ఈ కాలానికి చెందిన సాయిబాబా అవతారము అని చెప్పేవారు. అప్పటినుంచి ఆయనని సాయిబాబాగానే చెప్పుకుంటూనే వచ్చారు. బొక్కపట్నం స్కూల్ రికార్డులో 1942వ సంవత్సరానికి చెందిన రికార్డులలో ఈయన పేరు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇంకా అప్పటినుంచి అందరూ ఈయనని సత్యనారాయణ రాజుగా కాకుండా పుట్టపర్తి సాయిబాబాగా, సత్యసాయిగా పిలవడము ప్రారంభించారు.

సత్యసాయి బాబా దెగ్గరికి భక్తులు దర్శించికోవడము

ఆ తర్వాత సత్యసాయి మద్రాస్ కీ దక్షిణ భారతలో పర్యటన ప్రారంభించారు. దీంతో తొందరగా ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దాంతో 1944లో ఈయన చుట్టూ ఉండే అనుచరులు ఆయనకు ఏకంగా ఒక గుడి కట్టారు. ఇప్పుడు దాన్ని పాత మందిరం అని పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఇది సాయిబాబా ఆశ్రమము అయిన ప్రశాంతి నిలయముగా మారింది. ఆ తర్వాత ఈ గుడిని మరింత పెద్దదిగా 1948లో కట్టడము ప్రారంభించి 1950 కి పూర్తి చేశారు. ఇక క్రమంగా వీరి పేరు అనేది దేశవ్యాప్తంగా వ్యాపించడముతో భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అలాగే వీరి పేరు మీద ఎన్నో కట్టడాలు వెలిసాయి. ఇందులో భాగంగానే 1954 లోని బాబా చిన్న గ్రీన్ హాస్పిటల్ పుట్టపర్తి లో నిర్మించారు. 1957వ సంవత్సరములో సత్యసాయి గారు మొత్తం ఉత్తర భారతదేశ దేవాలయాలు తిరిగారు. 1963లో ఆయనకు నాలుగు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయములో ఆయన ఏమి చెప్పారంటే "తాను చనిపోయిన తర్వాత కర్ణాటక రాష్ట్రములో ప్రేమ సాయి అవతారములో జన్మిస్తానని" అప్పుడు చెప్పారు. అయితే ఈ గుండెపోటు అనంతరము వారు మరలా కోలుకోవడము జరిగింది. ఇంకా 1958లో సత్య సాయి బాబా తన అనుచరులు వీరి పేరు మీద సనాతన సారథి అనే పేపర్లు ప్రింట్ చేయడము ప్రారంభించారు. ఆ సమయములోనే అనేక దేశాల నుంచి అజ్ఞాతక అని ఇష్టము ఉన్నవాళ్లు సత్యసాయిని దర్శించుకోవడానికి భారతదేశానికి రావడము మొదలుపెట్టారు. ఆ తర్వాత 1963 లో అతను చెప్పే ప్రవచనాలు తనని తాను శివుడి ఒక శక్తి గల అవతారము అని తనని తాను ప్రకటించుకున్నారు. అలాగే తను శిరిడి సాయిబాబా అవతారమని అనేవారు.

సత్యసాయి బాబా విదేశాల పర్యటన

ఆ తర్వాత 1968 జూన్ 29న ఈయన మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన సత్యసాయి తను ఏ మతానికి మద్దతుగా రాలేదని అందరికీ ప్రేమను పంచడానికి మాత్రమే వచ్చానని చెప్పేవారు. తన వైపుకి అందరినీ తిప్పుకునే మనస్తత్వము తనది కాదని, కేవలం అందరికీ ప్రేమ పంచి నమ్మకాన్ని ఇవ్వాలని ఉద్దేశముతోనే అక్కడికి వచ్చినట్టుగా ఆ దేశాలలో చెప్పేవారు.

సత్యసాయి బాబా చివరికి సొంత గ్రామానికి రావడము

ఇక ఆ తర్వాత తను పుట్టిన గ్రామము గొల్లపల్లికీ వచ్చి సిరపడ్డారు. తన గ్రామము అనేది తనకి ఎంతగానో ఇష్టమైన ప్రదేశము కావడముతో ఆయన చనిపోయే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయము తీసుకున్నారు. ఇక సత్యసాయికి ఉన్న పలుకుబడి వల్లన భక్తులు ఈ గ్రామాన్ని గొల్లపల్లి అని కాకుండా పుట్టపర్తి అని పిలవడము ప్రారంభించారు. ఇంకా ఒకప్పుడు చిన్న గ్రామముగా ఉన్న ఈ ప్రాంతం ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం. చైతన్య జ్యోతి అనే ఓ పెద్ద మత్త ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేశారు. దీనిని డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎన్నో అవార్డులు సైతము వచ్చాయి. ఈ మత ప్రదర్శనశాల ఒక్కటే కాదు. ఇంకా ఇక్కడ అజ్ఞాతక మ్యూజియము, ఒక రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇండోర్ స్టేడియం లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దేశవిదేశాలకు చెందిన వీఐపీలు వచ్చి దర్శించుకునేవారు.

సత్యసాయి బాబా 80వ పుట్టినరోజు

సత్యసాయి బాబా 80వ పుట్టినరోజున ప్రపంచ నలుమూలల నుండి 10 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇతర దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు వచ్చారు. 

సత్యసాయి బాబా గారు ఎక్కువగా గడిపే సమయము

ఏడాదిలో ఎక్కువ సమయము సత్య సాయి ఇక్కడ ప్రశాంతి నిలయములోనే ఉండేవారు. ఎండాకాలములో కొన్ని రోజులు మాత్రము బెంగళూరులో బృందావనము అనే ఆశ్రమములో ఉండేవారు. అప్పుడప్పుడు కొడైకెనాల్ లోని సాయి శృతి ఆశ్రమానికి కూడా వెళ్లేవారు.

సత్యసాయి బాబా కి భక్తులు కట్టించిన మందిరాలు

సత్యసాయి బాబాకి భక్తులు ముఖ్యంగా మూడు ముఖ్యమందిరాలు కట్టించారు. దీనిలో మొదటిది ముంబైలోని ధర్మక్షేత్రం. దీనిని సత్యము అని కూడా అంటారు. రెండవది హైదరాబాదులోని శివము. మూడవది చెన్నైలోని సుందర మందిరము.

సత్యసాయి బాబా రోజు వారి పనులు

సత్యసాయి బాబా రోజు వారి పనులు ఎలా ఉండేవంటే. "ఉదయం ఓంకారాన్ని జపించేవారు. ఆ తర్వాత సుప్రభాతము మొదలవుతుంది. తర్వాత వేద పారాయణ సంగీతరణ భజనలు జరిగేవి. ఆ తర్వాత ఆయనని చూడడానికి వచ్చిన వారికి దర్శనము ఇచ్చేవారు".

ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలో ఆయనను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన పుట్టింది ఆ నెలలోనే కాబట్టి.

సత్యసాయి బాబా భక్తులకు ఇచ్చే దర్శనము

దర్శనము సమయములో బాబా సందర్శకుల భక్తుల మధ్యలో నడుస్తూ వారు పెట్టే నమస్కారాలని వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని తన చేతులతో సృష్టించి పంచేవారు చేతి నుంచి వీపుదిని ఎలా తీస్తున్నారని ఎవరికి అర్థము అయ్యేది కాదు. అది మిస్టరీగానే ఉండిపోయింది. భక్తుల్లో కొందరిని ప్రత్యేక దర్శనానికి మాట్లాడే దానికి బాబా పర్మిషన్ ఇచ్చేవారు.

పుట్టపర్తి సాయిబాబా ను దర్శించుకోవడానికి వచ్చే వి.ఐ.పిలు

పుట్టపర్తి సాయిబాబా భక్తుల్లో వీఐపీలు కూడా ఉన్నారు.  ప్రధానమంత్రులు, రాష్ట్రమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు, అనేకమంది పొలిటిషన్లు, సినిమా వాళ్ళు, క్రీడాకారులు, తారలు కూడా ఆయన భక్తులుగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ, అబ్దుల్ కలామ్, బాలీవుడ్ అగ్రనేతలు, సచిన్ టెండుల్కర్ లాంటివారు పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకునేవారు. సత్యసాయి ట్రస్ట్ కి కొన్ని వేల కొద్ది విరాళాలు ప్రపంచము నలుమూలల నుండి వచ్చాయి.

సత్యసాయి మరణము

సత్యసాయి బాబా గారు ఎంతో ఎత్తుకు ఎదిగిన వీరికి 2011 న మార్చ్ 28న ఆయన ఆరోగ్యము పాడయింది. మూత్రపిండాలు, ఛాతికి సంబంధించిన సమస్యలతో హాస్పిటల్లో చేరారు. సుమారు నెలరోజులు అయిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యము బాగు అవ్వలేదు. 2011 న ఏప్రిల్ 24వ తేదీన అనగా తన 85 ఏళ్ల వయసులో మరణించారు. ఇక వీరి మరణాంతరం సత్య సాయి బాబా దేహాన్ని వేదమంత్రోత్సవాల మధ్యన మహా సమాధి కట్టారు. పుట్టపర్తి ప్రశాంత నిలయంలోని కొలువంత హాల్లోని అన్ని కార్యక్రమాలు శాస్త్రవిత్తంగా జరిపారు. 2011 జూలై 17 నుంచి సత్యసాయిబాబా మహాసమాధిని భక్తులు దర్శించుకోవడానికి వీలు కల్పించారు.

సత్యసాయి బాబా గారు చేసిన సేవా కార్యక్రమాలు

సత్యసాయి బాబా కారణము వలన పుట్టపర్తి రూపు రేఖలు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా పుట్టపర్తి పేరు వచ్చింది. సత్యసాయి పేరు మీద ఎన్నో స్కూల్లు, కాలేజీలు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, మహిళా సంరక్ష కేంద్రాలు, అనాధ ఆశ్రమాలు, సేవా కేంద్రాలు ఎన్నో ఏర్పడి సేవలను అందిస్తున్నాయి. పుట్టపర్తి లోనే కాకుండా చాలా నగరాలలో సత్యసాయి ట్రస్ట్ కింద నడిచే ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో మంచి మంచి పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఎన్నో ఆలయాలని కట్టించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టులు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను సంపాదించుకున్నారు. వేల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు నీటి సౌకర్యము కలిపించారు. అయితే తనకు తాను దేవుడని చెప్పుకుంటున్నారని సత్య సాయి బాబా మీద ఎన్నో ఆరోపణలు కూడా వచ్చేయి. అయితే వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు తన వంతు సాయము తాను చేశారు. వారి అవసరాలు తీర్చారు. ఆ గ్రామములో ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా అనేక వసతులను కలిపించారు. ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ఆపేవారు కాదు. అందుకే ప్రజలు ఈయనను దేవుడిగా భావిస్తున్నారు.

సత్యసాయి మీద కొందరు శాస్త్రవేత్తలు చేసిన పరిశోదనలు

అయితే కొందరు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఈయన గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బాబా చేతిలో నుండి విభూతిని తీసి ప్రజలకు ఇస్తున్నారు. అలాగే ఈయన ఫోటో పెట్టుకున్న వారి ఇంట్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు రావడము ఇవన్నీ చూసి శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఐస్లాండ్ కి చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎర్లెండూర్ హరలెసన్ నియంత్రుత పరిస్థితులలో బాబాను అధ్యయనము చేయడానికి ప్రయత్నించారు. కానీ, అందుకు ఆయన అనుమతి దొరకలేదు. అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమల గురించి తెలుసుకోవాలని ఎన్నో అధ్యనాలు చేశారు. అయినా ఏమి కనుక్కోలేకపోయారు. 1976 ఏప్రిల్ లో బెంగళూరు విశ్వవిద్యాలయములో అప్పటి ఒక శాస్త్రవేత్త ఒక హేతువాది అయిన డ్ర్.హాయ్.నరసింహాయ్య గారు మూఢనమ్మకాల్ని, మహిమలన్నీ హేతువాదంగా పరిశోధించడము హేతుపతంగా పరిశోధించే సంస్థని స్థాపించాడు. బాబా తన మహిమలను భక్తితో కాదు ప్రయోగితత్వముగా చూపించాలని ఈ కమిటీ అనేకసార్లు అడిగిన దానికి ఆయన ఒప్పుకోలేదు. తర్వాత ఆ కమిటీ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయములో అన్ని న్యూస్ పేపర్ లో కూడ వచ్చాయి. కొంత వివాదానికి కూడా దారి తీసింది. ఆ తర్వాత నరసింహయ్య స్థాపించిన కమిటీ 1977లో రద్దు అయింది. ఆ తర్వాత 1992లో కెనడాకు చెందిన మరొక హేతువాది బాబాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కథనాలల్లో వాస్తవము లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఒక అతను ఒక పుస్తకములో రాశారు. ఆ తర్వాత బాబా మహిమల మీద పరిశోధనలు చేసిన కూడా ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఇలా చాలామంది హేతువాదులు సత్యసాయి బాబా చేయగలే మహిమలు మేము చేయగలుగుతాము అని చెప్పారు. ఇలా చాలామంది హేతువాదులు వచ్చారు. ఏది ఏమైనా విమర్శలు అనుమానాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకు ఆయన చేసిన సేవ ఇప్పుడు ఆయన పేరుతో చేసే ట్రస్టులు చేసే సేవ మాత్రము ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. సత్యసాయి బాబా దేవుడా కాదా అనే నిర్ణయాన్ని ఇక ప్రజలకు, పెద్దలకు వదిలేశారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !