ప్రాణము ఉన్న శివలింగా క్షత్రము..... శ్రీ కాళహస్తి......
శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము. ఈ పట్నము స్వర్ణముఖి నదికి తూర్పున ఉంది. ఇది దక్షిణ భారతదేశములోనే ప్రాచీనమైన పంచభూత లింగములలో నాలుగవది అయినా వాయు లింగము కలిగిన గొప్ప దైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడు గాలికి కదులుతూనే ఉంటుంది. మరొకటి ఎల్లప్పుడూ నిక్షళంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ఉన్నాయి. ప్రాచీనమైన భారతీయ వాస్తు కలకు నిదర్శలుగా విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుడు ఒక పనితనానికి పానాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురము శ్రీకృష్ణదేవరాయలు కాలములో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే 1000 కాళ్ళ మండపము కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కలంకారి శ్రీకాళహస్తి పుట్టినిల్లు. సువర్ణముఖి నది తీరనా వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభు లింగము లింగముకు ఎదురుగా ఉన్న దీపము లింగము నుండి వచ్చే గాలికి రేపరెపలాడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసన్నాంబ అంబాత్రేయనాలల్లో ఈమె ఒకరు. శివలింగము ఇక్కడ ఒత్తుల ఆకారములో ఉంటుంది. చతురాస్ర ఆకారములో ఉంటుంది. స్థల పురాణ ప్రకారము బ్రహ్మకు జ్ఞానము ప్రసాదించిన ప్రదేశము. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయుడు, తిన్నేడు, వేశ కన్యలు, యాదవ రాజు, శ్రీకాళహస్తి మహత్యము రాసిన వారి కథలు. ఈ క్షేత్ర మహత్యముతో ఇవి పెను వేసుకొని ఉన్నాయి.
శ్రీ కాళహస్తి కన్నప్ప కథ
కన్నప్ప అనే వేటగాడు నిత్యము స్వామిని కొలుస్తూ ఉండేవారు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చారు. అప్పుడు వెంటనే కన్నప్ప తన కన్నును పీకి స్వామి కంటికి పెట్టారు. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడము మొదలయ్యింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కంటిని కూడా పీకి స్వామికి పెట్టారు. తర్వాత స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పను కనుకరించి ముక్తి ప్రసాదించారు.
శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన స్తంభాలు, గాలి గోపురము
విజయనగర రాజు అయిన శ్రీ కృష్ణదేవరాయలు గారు రాతిపై చెక్కించిన రచనలు ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మండపము అన్నిటికన్నా తూర్పు పడమర ఉన్న ఎత్తయిన గాలిగోపురము నిర్మించబడిందని తెలుస్తున్నది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరములో గజపతులపై విజయాన్ని గుర్తుగా నిర్మించినట్టు తెలియజేస్తుంది. ఈ గోపురము 2010 మే 26న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురములో అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమక్తులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోయాక కొద్ది రోజులకి క్షేత్రము లైలా తుఫాన్ కారణంగా ఒకవైపు బాగా బీటలు మారింది. మరోవైపు కొన్ని రోజులకు పూర్తిగా కూలిపోయినది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తలరించడంతో ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదు. కానీ, రెండు రోజుల తర్వాత శిధిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహము లభ్యము అయింది. కూలిపోవడానికి కారణాలు అన్వేషించడానికి సాంకేత ఒక కమిటీ నియమించింది.
శ్రీకాళహస్తి ఆలయము లో జరిగే రాహు, కేతు పూజలు
ఈ ఆలయము దేశంలోనే అతి పెద్ద ఆలయాలలో ఒకటి. ఆలయములోపల అమ్మవారి సన్నిధికి సమీపములో ఒక ప్రదేశము నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలు సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయము భారతదేశములో కేవలము కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రావు కేతువు, సర్ప దోషము నివారణ పూజలు ఈ ఆలయములో విశేషంగా జరుగుతాయ. దేశము నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివారణ కావిచ్చుకుంటారు. ఇంకా రుద్రాభిషేకము, పాలాభిషేకము, పచ్చ కర్పూరభిషేకము మొదలైన పూజలు కూడా జరుగుతుంటాయి.
ఈ ఆలయములో ఉన్న ప్రేత్యేకతలు
- శ్రీకాళహస్తి ఆలయములో ఒక ప్రత్యేకత్వం కూడా ఉంది. ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముకులై ఉన్నారు. ఆలయము దర్శనము ద్వారా చతుర్విధ పురుషోర్ధ సిద్ది లభిస్తుంది అనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసము. పాతాళ గణపతి ఉత్తరా ముఖము గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖము గాను, శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖము గాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖము గాను ఉన్నారు.
- ఈ దేవాలయము చాలా పెద్దది పై కప్పు పై రంగులతో చిత్రించిన అనేకమైన చిత్రములు ఉన్నాయి.
- కాశి క్షేత్రము లాగానే ఇక్కడ చనిపోయిన వారికి పరమశివుడు ఓంకార నామము మంత్రము, తారక మంత్రము ఉపదేశించి మోక్షము ఇచ్చురాని భక్తుల నమ్మకము.
- దేవాలయ ప్రాంగణములోనే పాతాళ అగ్నేశ్వర ఆలయము ఉంది.
- దేవాలయానికి సమీపములో కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము కూడా నిర్మించారు.
- శ్రీకాళహస్తీశ్వర ఆలయము రాజ గోపురము ఒక పై సింహద్వారము దక్షిణ ముఖముగా ఉంటుంది. స్వామి వారు ఉత్తర ముఖముగా ఉంటారు.
- ఆది శంకరుడు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. శ్రీ క్షేత్రము ఒక ఇతర నామములు దక్షిణ కైలాసము అని అంటారు.
- అలాగే సద్యోముక్తి క్షేత్రము అని శివానందకై నిలయము అని పేరు కొనడము జరిగింది.
- మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవము జరుగుతుంది.
- సామాన్య శకం పూర్వము మూడవ వార్షిక శతాత్వము తమిళ సంగం వంశానికి చెందిన నకిరణ్ అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి గురించి దక్షిణ కాశీగా చారిత్రాక ప్రస్థానము తెచ్చారు.
- ఆలయానికి ఆనుకొని ఉన్న కొండ రాళ్లపై పల్లవుల సైలులో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరవాత చోళ్లులు 11వ శతాబ్దములో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది.
పంచలింగాలలో ఒక్కటి అయిన వాయు లింగము ఈ ఆలయములో ఉంది
శ్రీ కాళహస్తిలోని శివలింగము పంచలింగాలలో వాయు లింగంగా ప్రసిద్ధి చెందింది. మిగతా నాలుగు లింగాలు కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీ లింగము, శ్రీరంగ వర్ధన ఉన్న చెంబుకేశ్వరుడు జల లింగము, అరుణాచలములో తేజోలింగము, చిదంబరములో ఆకాశలింగము, ఐదవది శ్రీకాళహస్తీలో ఉన్న వాయు లింగము. ఇక్కడ స్వామి వాయు తత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడి వైపున ఉన్న రెండు దీపాలు ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు.
ఈ ఆలయములో ఉన్న దేవత మూర్తులు
ఆలయానికి నాలుగు దిక్కులుగా నాలుగు గోపురాలు 120 అడుగులు ఎత్తుగల రాజ గోపురములు ఉన్నాయి. స్వామి గ్రామోత్సవము ఈ గోపురము నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీరికి ఎదురుగా ఉన్న గోపురము నుండి వస్తారు. స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకొని వెళ్తారు. ఈ గోపురము నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణ గోపురము నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును. ఇక్కడ అనేక శివలింగాలు మహత్తులు లేదా దేవతల చేతులతో ప్రతిచబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వర లింగము, అగ్యస్యుడు నీలకంఠేశ్వర లింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వర లింగము, ఇంకా వ్యాసుడు మార్కండేయుడు, మృత్యుంజయస్వర లింగము, రాముడు, పరశురాముడు, ఇందిరా అది దేవతలు, సప్త ఋషులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్టించిన లింగాలు కూడా ఉన్నాయి. వర్ణాల కోసం మృత్యుంజైశ్వరుడిగా సహస్త్ర లింగాభిషేకము చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు వివిధ గణపత మూర్తులు, సుబ్రహ్మణ్యస్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు కూడా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, వరదరాజస్వామి, వీర రాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహము కూడా ఉంది. శంకరాచార్యులు స్పటిక లింగము ఆలయములో శిల్పకలతో శోధించిన స్తంభాలు, మండపాలు ఇంకా అనేక వర్ణాల చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మండపము. నూరు కాళ్ళ మండపము, పది నాలుగు కాళ్ల మండపము, కోట మండపము వాటిలో కొన్ని నూరు కాళ్ల మండపము చక్కని శిల్పాలకు నిలయము. 16 కాళ్ల మండపంలో 1529లో అచ్యుతు దేవరాయల పట్టాభిషేకము జరిగింది. అమ్మవారి ఆలయము ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారము పైకప్పులో చక్కని చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది రాహు, కేతువ క్షేత్రము అని కూడా ప్రసిద్ధి చెందింది. పుత్ర శోకానికి చెందిన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచ ముఖము నాగలింగేశ్వరుడిగా దర్శనము ఇచ్చాడంట. ఈ నాగరూపమున్నే బ్రహ్మదేవుడు కూడా అర్శించాడంట. ఈ నాగరూపము కారణము వలన ఈ క్షేత్రానికి రాహు కేతువుల క్షేత్రము అని కూడా పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు, కేతువుల గ్రహదోషాలను నుండి వివాహరణ కోసము ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమును అలంకారము చేస్తారు. దక్షిణ ముఖముగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారములు లోనికి ప్రవేశించగానే ఉత్తర ముఖముగా కొలువైన దక్షిణామూర్తిని దర్శించుకోవచ్చు. దక్షిణామూర్తి పూజలు అందుక్కోవడము కారణము వలన ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రము అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరే ఎక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయాన్ని ప్రముఖ స్థానాన్ని ఉంది.
ఈ ఆలయము లో జరిగే అభిషేకాలు
ఆలయములో జరిగే సేవలు కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూర అభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, శ్రీ శనీశ్వర స్వామి అభిషేకము, పంచామృత అభిషేకము ఇలాగే ఇంకొన్ని అభిషేకాలు కొన్ని సేవలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి.
ఆలయము పరిసరాలలో ఉన్న తీర్థాలు
ఆలయ పరిసరాలలో 36 తీర్థాలు ఉన్నాయి. సహస్ర లింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కర నీళ్లు. వాటిలో ముఖ్యమైనది దేవాలయములో పాతాళ గంగ లేదా మూకతీర్థము దాని సేవిస్తే నత్తి, మూగ రోగాలు పోయి వాక్ చేతుర్యం కలుగుతుంది. ధర్మకర్తలిం మండపాలలో దేవదాయ శాఖ ఆధ్వర్యములో ఆలయ నిర్వహణ జరుగుతుంది.
శ్రీకాళహస్తి కి వెళ్లడానికి మార్గము
శ్రీకాళహస్తి నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము అయినా తిరుపతికి 38 కిలోమీటర్లు దూరములో నెల్లూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరములో ఉంది ఈ ఆలయము. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు సౌకర్యము ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయము ఉంది.