తిరుపతి ఆలయము గురించి విషయాలు...

తిరుపతి ఆలయము గురించి విషయాలు...

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయము గురించి చాలాసార్లు విని ఉంటారు. కానీ, ఈ ఆలయములోని రహస్యాల గురించి మాత్రము చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పాలి. దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఈ ఆలయము కొలువై ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాగా కూడా రూపు దిద్దుకుంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యము పొందిన అనేకమైన దేవాలయాలు దక్షిణ భారతదేశములోనే చాలానే ఉన్నాయి. కానీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము మాత్రము అన్నిటికమైన ప్రముఖమైనదని చెప్పుకోవాలి.


రామాంజనేయుల చారులు కొండమీద గోవింద రాజు స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడముతో తిరుపతి దేవస్థానానికి బీజము పడింది. తన శిష్యుడైన యాదవ రాజును రామాంజనేయులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణము ప్రారంభించారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడము పూర్తి అయిన తర్వాత క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించారు. దానికి తన గురువు పేరిట రామాంజనేయ పురము అని నామకరణము చేశారు. రామాంజనేయ పురము మాత్రమే కాకుండా యాదవరాజు చాలా గృహాలని కూడా నిర్మించారు. శ్రీశైల పూర్ణుడు అనంతరము ఆచార్యులకు ఇలాంటి భక్తులకు నివాసాలు ఏర్పాటు చేశారు. దేవాలయాలకు తూర్పున ధాన్య గృహము, వాయువు దిశలో అంగడిని నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాది వేశారు.

తిరుపతి లో వెంకటేశ్వర స్వామివారికీ వచ్చే కానుకాలు

ఈ ఆలయానికి వచ్చి భక్తులు ఏ కోరికలు కోరిన అవి తీరుతాయని అందరి నమ్మకము. అలా కోరుకున్నవి నెరవేరిన వారు తిరిగి ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి తమ వెంట్రుకలు ఇవ్వడము ఆనవాయితీ. తిరుపతి ఆలయములో ప్రతిరోజు 20వేల మంది భక్తులు తమ వెంట్రుకలని దేవుడికి సమర్పిస్తారు. అంతేకాదు అనేక విలువైన ఆభరణాలు డబ్బులు కూడా దేవుడి గుడిలో వేస్తూ ఉంటారు. అందుకనే దేశములో అత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన ఆలయముగా తిరుపతికి పేరు ఉంది. ఇక్కడ కానుకల రూపములో వచ్చిన డబ్బులు బంగారము ఇతర విలువైన వస్తువులను లెక్కించేందుకు అనేకమంది ఉద్యోగులు నిరంతరము పని చేస్తూ ఉంటారు. ప్రతి నెల ఈ ఆలయానికి వచ్చే ఆదాయము 200 నుంచి 300 కోట్ల రూపాయలు. ఈ ఆదాయములో ఎక్కువ మొత్తాన్ని సమాజ సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. కరోనా లాంటి సమయములో కూడా 3000 మంది ఉద్యోగులకు మూడు నెలల పైగా జీతాలని, పెన్షన్లని ఇతర ఆద్రిక సహకారాలు అందించారు. ఈ గుడికి వచ్చి దేవుడికి ఏ కోరిక కోరుకున్న నేవేరుతుందని భక్తులకు గెట్టి నమ్మకము. బడా నేతలు, బడా కంపెనీ అధినేతలు కూడా ఇక్కడికి వచ్చి దేవుడిని ముక్కుకుంటారు. గుత్త దారాల రూపములో డబ్బులు విలువైన నగలు హుండీలో వేస్తూ ఉంటారు. ఈ ఆలయ ఆదాయము దేశములోనే అనేక బ్యాంకులో పిక్స్ డిపాజిట్ చేశారు. ఈ ఆలయ ట్రస్ట్ కి ప్రతి సంవత్సరము 8 వేల కోట్ల రూపాయలు పైగా ఆదాయము వస్తుంది.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారి విగ్రహము విశేషాలు

ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి నిత్యము పూజలు అందుకుంటారు. విష్ణుమూర్తి అవతారముగా భావిస్తారు. ఈ ఆలయము గర్భగుడిలో వెలసిన మూర్తులు మానవ నిర్మాతలు కావు. ఇక్కడ దేవుడు స్వయంగా వెలిశారు. రాతి విగ్రహము లాగా కనిపించిన ఆమూర్తులకు దగ్గరగా వెళ్లి స్వయంగా దర్శించుకున్నప్పుడు ఆ భావన వేరే విధంగా ఉంటుంది. భగవంతుడు స్వయంగా కనిపించిన అనుభూతి కలుగుతుంది. అందుకే ఇక్కడ విగ్రహానికి చందనము పూస్తారు. భగవంతుడి తలకి దెబ్బ తగిలిందని చందనముతో రాస్తే ఆ గాయము తగ్గిపోతుందని నమ్ముతారు. ఈ దేవుడి విగ్రాము తల పైన ఉన్న వెంట్రుకలు కూడా నిజమైనవే. వేల సంవత్సరాలుగా ఆ వెంట్రుకలు అలాగే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండే వెంట్రుకలు ఎప్పుడు పాడు అవ్వవు. భక్తులు పూజారీలు చెప్పే విషయము ఏమిటంటే "ఈ విగ్రహము నుండి సముద్ర అలలు శబ్దము వస్తుంది" అని చెప్తూ ఉంటారు. శ్రద్ధగా వింటే సముద్రము మధ్య నిలబడి అలల సవ్వడి వింటున్నట్టు అనుభూతి కలుగుతుంది. తిరుపతిలోని ప్రధాన ఆలయము కుడివైపున ఒక కర్ర పెట్టి ఉంటుంది. ఈ కర్రతోనే వెంకటేశ్వర స్వామి బాల్యములో అమ్మ చేతితో దెబ్బలు తిన్నాడని చెప్తుంటారు. ఈ దెబ్బలుతోనే తల మీద గాయము అయింది. ఆ కారణము వల్లనే ప్రతి శుక్రవారము చందనముతో పూతను పూస్తారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విగ్రహము చాలా ప్రత్యేకతమైన రాయితో తయారు అయ్యింది. ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తే మాత్రము సజీవంగా కళ్ళముందురా ప్రత్యక్షమై అనుభూతి కలుగుతుంది. భగవంతుడి విశ్రాంతి కోసము ఈ ప్రాంతాన్ని చాలా చల్లగా ఉంచుతారు. వెంకటేశ్వర స్వామి తల పైన నుదుటి మీద చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. ఆలయ పూజారులు అనుక్షణము ఆ చెమట చుక్కలని శుభ్రము చేస్తూ ఉంటారు. ఇంత గొప్పగా దేవుడిని కొలుస్తారు. అంతే గొప్పగా ఆలయ అలంకరణ జరుగుతుంది. ప్రతిరోజు ఈ భగవంతుడి విగ్రహానికి కింద భాగములో దోతీని పై భాగములో చీరను అలంకరిస్తారు. వెంకటేశ్వర స్వామి మూర్తిలోనే లక్ష్మీదేవి కూడా ఉంటుందని పూజారుల నమ్మకము. అందుకనే ఈ విధంగా అలంకరిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వరూపము అని భక్తుల నమ్మకము. భగవంతుడి గుండెల్లో లక్ష్మీదేవి కనిపిస్తుంది. ప్రతి గురువారము వెంకటేశ్వర స్వామిని అలంకరించినప్పుడు లక్ష్మీదేవి రూపము కనిపిస్తుంది. ప్రతివారము చందనముతో అలంకరించినప్పుడు చందనము అంటించే సమయములో లక్ష్మీ రూపము కనిపిస్తుంది. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దగ్గరగా చూడండి. ఒక గది నుండి మరో గది లోపల ప్రతిష్టించినట్టుగా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ప్రచినతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసన ఆధారాలు ఉన్నాయి.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారికీ తులసి మాలలతో చేసే పూజలు

హిందూ మత ఆచారములో తులసి కోటకు పవిత్ర స్థానము ఉంది. విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే ప్రీతి. అందుకనే ప్రతిరోజు ఈ ఆలయము లో తులసి మాలలతో పూజలు జరుగుతాయి. చాలా ఆలయాలలో ఈ తులసి ఆకులని భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములో మాత్రము ఇలా జరగదు. వెంకటేశ్వర స్వామికి అలంకరించిన తులసి మాలలను గుడి ప్రాంగణములోని ఒక చిన్న బావిలో వేస్తారు. ఇప్పటివరకు ఈ బావి అడుగున ఏముందో ఎవరికీ తెలియదు.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారికీ లడ్డు ప్రసాదము

ప్రతిరోజు ఈ ఆలయములో స్వచ్ఛమైన నేతితో 3 లక్షల లడ్డులు తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించరు. 300 సంవత్సరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయాల పద్ధతిలో తయారుచేస్తారు. ఈ మూడు లక్షల లడ్డులను తిరుపతిలోనే ప్రత్యేకతమైన ప్రదేశములోనే తయారు చేస్తారు. ఆ వంటగదిని పుట్టు అని పిలుస్తారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి వచ్చే పూలు, పండ్లు, ఇతర వస్తువులు

తిరుపతికి 23 కిలోమీటర్ల దూరములో ఉన్న ప్రత్యేకమైన ఊరు నుండి పూలు, పండ్లు దేవుడికి సమర్పించే పాలు, పెరుగు, నెయ్యి లాంటి ఇతర వస్తువులు అన్నిటిని కూడా ఈ ఊరు నుండి తీసుకొని వెళ్తారు. ఇక్కడ ప్రజలు నియమనిష్టలు పాటిస్తారు. ఇక్కడ స్త్రీ, పురుషులు నేత బట్టలే ధరిస్తారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయములో వెలుగుతున్న దీపము

తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములోని గర్భగుడిలో ఒక దీపము వెలుగుతూ ఉంటుంది. ఈ దీపము వేలాది సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది. అందులో నెయ్యి ఉండదు, నూనె ఉండదు. ఇవేవీ లేకుండా దీపము ఎలా వెలుగుతుంది అనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానము లేద.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారికీ పెట్టె కర్పూరము

కర్పూరము గురించి అందరికీ తెలిసినదే. కర్పూరము ఏదైనా విగ్రహము మీద పెడితే కరిగిపోతుంది. కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములో పెట్టే కర్పూరము కరగకుండా అలాగే ఉండిపోతుంది. దీనిని చమత్కారము అని అనాలి.

తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నా రాజులు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలాసార్లు దర్శించుకుని కానుకలు సమర్పించారు. చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరికి పైకి చేరుకోవడానికి అది సమీపమైన కాళ్ళ మార్గాన శ్రీవారి మెట్ల మీదన శ్రీకృష్ణదేవరాయలు తరచూ స్వామి దర్శనానికి డోలిపై వెళ్లేవారు. తొమ్మిదో శతాబ్దములో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తర్వాత శతాబ్దము తంజావూరు చోళులు, మధురైని పరిపాలించిన పాండీయులు, విజయనగర చక్రవత్రులు, సామంతులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అయి కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్మాణాలకు సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్యము పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకోరింది. శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఇద్దరు భార్యల విగ్రహాలను తన విగ్రహాన్ని ఆలయ మండపంపై ప్రతిష్టించారు. ప్రధాన ప్రతి ఆలయములో వెంకటపతి రాయల వారి విగ్రహము కూడా ఉంది. విజయనగర సామ్రాజ్యము పతనము అయిన తర్వాత దేశ నలుమూలలో ఉన్న చాలా మంది చిన్న నాయకులు ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బౌకరించడము కొనసాగించారు. మరాఠీ సైనా జి రఘుజి బోన్స్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజకు నిర్వర్తించడానికి శాశ్వత దాన పథకాన్ని స్థాపించారు. ఈయన వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతన్ని విలువైన వజ్రవైధుర్యలు సమర్పించారు. ఈ మరకతము ఇప్పటికే రఘుజి పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తర్వాత కాలములో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు గద్వాల పాలకులు చెప్పుకోదగ్గారు ఇంత చారిత్రక నేపథ్యము ఉన్న ఆధ్యామిక పరిమళాలు వెదజల్లే ఆలయము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయము.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !