భీముడి కంటే దుర్యోదనుడు బలవంతుడు.....

భీముడి కంటే దుర్యోదనుడు బలవంతుడు.....

మహాభారతంలో భీముడు పాత్ర ఎంతో ప్రత్యేకత్వమైనది. అతను వాయు అంశతో కుంతీదేవికి పుట్టారు. మిగిలిన పాండవుల పరాక్రమము కురుక్షేత్ర యుద్ధములో కనపడితే భీముడి పరాక్రమము మాత్రము మొదటినుంచి కనపడుతూనే ఉంటుంది. అందుకే భీముడిని మహాభారతములో మొదటి నుంచి చివరి వరకు యుద్ధము చేసిన వీరుడిగా చెప్పుకుంటారు. అదేవిధంగా దుర్యోధనుడు కూడా భీముడికి ఏ మాత్రము తక్కువ కాదు. బుద్ధి బలంలోను భుజబలంలోను భీముడు కంటే ఎంతో నేర్పు. 

భీముడు పుట్టిన నక్షత్రములోని మరో ఐదుగురు శక్తివంతులు పుట్టారు. ఈ ఐదుగురిలో ఎవరు ముందు ఒకరిని చంపుతారో మిగిలిన వారి చావు కూడా అదే వీరుడి చేతిలో ఉంటుంది. ఒకే నక్షత్రములో పుట్టిన ఈ ఐదుగురు భీముడు, దుర్యోధనుడు, జలాసంధుడు, కీచకుడు, బకాసురుడు వీరంతా భీముడితో సమానంతమైన శక్తిమంతులు ఉంటాయి. వీరిలో జలసంధుడు, కీచకుడు, బకాసురుడు బ్రతికి ఉంటే కురుక్షేత్ర యుద్ధములో దుర్యోధనుడు పక్షాన యుద్ధము చేసి ఉండేవారు. ఈ మహాశక్తిమంతులను ఓడించడము చాలా కష్టము అయ్యేది. కురుక్షేత్ర యుద్ధము మరింత కఠినముగా అయ్యేది. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకొని భీముడు చేత వారిని ముందుగానే అంతము చేయిస్తాడు. కురుక్షేత్ర యుద్ధానికి పాండవులకు మరింత సులభంగా చేస్తాడు. అందుకే కృష్ణుడు లేకపోతే పాండవులు లేరని చెప్తారు. 

కురుక్షేత్ర యుద్ధము 17వ రోజు సెల్యూడిని రథసారథిగా నియమించారు. కర్ణుడు భీముడిని ధర్మరాజుని ఓడించాడు. కానీ, చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణ అర్జునుల మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. యుద్ధము మధ్యలో కర్ణుడి రథచక్రము భూమిలో దిగిపోయింది. ఆ చక్రాన్ని బయటకి తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తున్న సమయములో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశించాడు. అర్జునుడు కృష్ణుడి మాటని ధిక్కరించలేక కర్ణుడి మీద అస్త్రము పయోగించి కర్ణుడిని వధిస్తాడు. కర్ణుడి మరణముతో కౌరవుల బలము పూర్తిగా తగ్గిపోయింది. అప్పటివరకు ధైర్యంగా మీసము తిప్పిన దుర్యోధనుడు భయముతో యుద్ధభూమిని వదిలి పారిపోయాడు. 17వ రోజు ముగిసిపోయింది. ఆరోజు పాండవులు విజయము సాధించారు. 

18వ రోజున కౌరవులు వైపు ముగ్గురు యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారే అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచార్యుడు. మరి 18వ రోజు పూర్తి భీముడికి దుర్యోధనుడికి మధ్యన జరుగుతుంది. ఆ యుద్ధము చూస్తే ఎవరి శక్తి మనసులో మనకు అర్థము అవుతుంది. దుర్యోధనుడిని ఓడించే శక్తి బీముడికి ఉందో లేదో తెలుస్తుంది.  

మహాభారతము శల్యపర్వము  ద్వితీయాశ్వానము తీసుకోవడం జరిగింది. కర్ణుడు మరణించగానే దుర్యోధనుడు పాండవులకు భయపడి వైపాయెనము అడుగులోకి దిగి నీటి అడుగున దాకున్నారు. దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు. ఆ విధంగా నీటిలో దాక్కుంటాడు. అశ్వద్ధామ మరికొంతమంది వీరులు దుర్యోధనుడు దాగివున్న వైపాయెనము నది ఒడ్డుకు వచ్చి రాజా ఇదేమిటి పిరికివాడిగా మడుగులో దాచుకోవడము ఏమిటి. ఈ మడుగు నుంచి బయటికి వచ్చి మా సహాయముతో పాండవుల పైన యుద్ధము ప్రకటించు. పాండవుల సేనలను సంహరించి రాజుగా ఈ భూ మండలాన్ని పాలించు. క్షత్రియునికి శత్రువులని జయించడము లేదా యుద్ధంలో మరణించి స్వర్గ లోకపు సుఖాలను అనుభవించడము. అంతేగాని ఈ విధంగా నువ్వు పిరికివాడిగా దాకోవడము నీలాంటి వీరోడికి మంచిది కాదు. ఆ మాటలకు దుర్యోధనుడు వీరులారా నాకు క్షత్రియ ధర్మము తెలియక కాదు. ప్రస్తుతము నా శరీరము అంతా గాయాలతో అలసిపోయి ఉంది. నా శరీరము ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నాది. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. తర్వాత పాండవులతో తిరిగి యుద్ధము చేస్తాము అని అంటాడు. 

పాండవులకు దుర్యోధనుడు వైపాయెనము అడుగులో ఉన్నట్టు తెలిసి అక్కడికి వెళ్తారు. దుర్యోధనుడిని వధిస్తేనే యుద్ధములో పాండవులు గెలిచినట్టు మరియు బీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. దుర్యోధనుడిని ఎలాగైనా నీటి మడుగు నుంచి బయటకు రావడానికి ధర్మరాజు ఎన్నో విధాలుగా రెచ్చగొట్టాడు. ఆ మాటలు అన్నీ విన్న దుర్యోధనుడు "మడుగు లోపల నుంచి ధర్మజ నేను ఒక్కడినే ఉన్నాను. మీరు ఐదుగురు ఉన్నారు. మీకు చదరంగా బలాలు సహకారంగా ఉన్నాయి. నేను నా సైన్యాన్ని నా సోదరులని మొత్తాన్ని కోల్పోయాను. మీ దగ్గర అనేక అస్వసరాలు ఉన్నాయి. నా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. పైగా నేను 18 రోజులు యుద్ధము చేసి అలసిపోయి ఉన్నాను. మీరు విజయ గర్వముతో రెట్టింపు ఉత్సాహముతో యుద్ధ వీరులగా నిలిచారు. కాబట్టి మీ ఐదుగురు ఒకేసారి నాతో వచ్చి యుద్ధము చేయడము ధర్మము కాదు. కావాలంటే ఒక్కొక్కరే వచ్చి నాతో యుద్ధము చేయండి. అప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో దీనికి మీరు ఒప్పుకుంటే నేను బయటకు వచ్చి మీతో యుద్ధము చేస్తాను. బంధుమిత్ర సమేతంగా మిమ్మల్ని అందరిని వధిస్తాను. అంతేగాని అందరూ కలిసి ఒక్కడితో యుద్ధము చేయడం ధర్మము కాదు. నేను కృష్ణుడికి మీకు భయపడి ఇదంతా చెప్పడము లేదు. కేవలము యుద్ధ ధర్మాన్ని తెలియజేస్తున్నాను" అని అన్నాడు. దానికి ధర్మరాజు "దుర్యోధన నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నువ్వు ఒంటి చేతితో మా అందరిని వధించడములోనూ తప్పులేదు. నీకు నా గురించి తెలుసు కదా మేము అందరము కలిసి నీ ఒక్కడిపై దాడి చేసే అంతటి అధర్మపరులము కాదు. కాబట్టి నీకు ఒక అవకాశము ఇస్తున్న. నీకు అవసరము అయినా అస్త్రశాస్త్రలను ప్రధాని తీసుకొని మాలో ఒకరిని ఎన్నుకో. అతడే నీతో పోరాడుతాడు. నువ్వు ఆ ఒక్కడిని ఓడిస్తే ఈ రాజ్యము అంతా నీకే దక్కుతుంది. ఇక్కడ ఉన్న బంధుమిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మ యుద్ధము చేస్తాడు" అని చెప్పాడు. 

అప్పుడు దుర్యోధనుడు "ధర్మరాజ్య రథాలతో అస్త్రశాస్త్రలతో ఇన్ని రోజులు అతి భయంకరంగా యుద్ధము చేసాము. ఈరోజు కొంచము కొత్తగా పోరాడుదాము. నేను అలాగే మీ పక్షములో వీరుడు ఇద్దరము కలిసి నేల మీద నిలబడి గధ యుద్ధము చేద్దాము. అలా ఒకరి తర్వాత ఒకరిగా ఎంతమందైనా రండి. నేను నా గధతో మీ అందరిని చంపి కురువీరుల రుణము తీర్చుకుంటాను" అని అన్నాడు. అది విన్న ధర్మరాజు ఆలోచనలలో పడుతాడు. ఇదే సరైన సమయము అనుకొని మడుగులో దుర్యోధనుడు ఒక్కసారి నీటిలో నుంచి బయటకి వచ్చాడు. అక్కడ ఉన్న వారందరికీ దుర్యోధనుడు కాల యముడిగా కనిపించాడు. ధర్మరాజుతో మన ఒప్పందము ప్రకారము మీలో ఒక్కరే నాతో యుద్ధానికి రావాలి. ఎందుకంటే మీరు చాలామంది ఉన్నారు. నేను ఒక్కడినే ఉన్నాను. పైగా నేను బాగా అలసిపోయి ఉన్నానని అని అంటాడు. దానికి ధర్మరాజు అది ఏమిటి దుర్యోధన ఆరోజు పద్మావ్యూహములో కౌరవుల వీరులు అందరూ కలిసి బాలుడు అయిన అభిమన్యుడిని ఒక్కడిని చేసి చంపలేదా ఇది అలాగే అనుకో అని అన్నాడు. దానికి దుర్యోధనుడు మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ మాట్లాడుతూ భయపడకు దుర్యోధన నువ్వు చేసిన దుర్మార్గము గురించి చెప్పాను. అంతేగాని ఇచ్చిన మాట తప్పను. యుద్ధనీతికి వ్యతిరేకంగా ప్రవర్తించను. నీకు నచ్చిన కవచము ధరించు. యుద్ధానికి సిద్ధము అవ్వు. మేము ఐదుగురము ఉన్నాము. మాలో నీకు నచ్చిన వాడిని ఎన్నుకో అతడే నీతో యుద్ధము చేస్తాడు. నువ్వు అతనిని ఓడించి చంపితే సమస్త సంపద నీ సొంతము అవుతుంది. ఈ భూమిని పాలించుకో అదే అతడి చేతిలో నువ్వు మరణిస్తే వీర స్వర్గము చేరుతావు. నీకు నచ్చిన కవచము తొడుక్కో, కావాల్సిన ఆయుధాన్ని ఎంచుకో, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడము తప్ప నీవు కోరినవి అన్నీ ఇస్తాను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు బంగారు కవచము తొడుక్కొని పాండవులను యుద్ధానికి ఆహ్వానిస్తాడు. నా గధకు మిమ్మల్ని ఆహారము చేస్తాను. మీ చావుని కళ్ళారా చూస్తాను. నాతో గధ యుద్ధానికి ఈశ్వరుడు కూడా సాహసము చేయలేరు. మీరు ఇంకా ఎక్కడికి పోలేరు నా చేతిలో చావడము తప్ప అని గర్వంగా నిలబడుతాడు.

అప్పుడు కృష్ణుడు ధర్మరాజు తో రహస్యంగా "ధర్మజ మీలో ఒక్కడిని ఓడిస్తే రాజ్యాన్ని దుర్యోధనుడికి ఎలా ఇస్తావు. నువ్వు ఇంత తెలివి తక్కువగా ఎందుకు మాట్లాడావు. దుర్యోధనుడు ఒక్క భీముడిని తప్ప మీలో ఎవరినో ఒకరిని కోరుకుంటే అతన్ని ఒక్క నిమిషములో తన గధ తో చంపుతాడు. ఇన్ని రోజులు కష్టపడి యుద్ధము చేసింది దీనికోసమేనా. అయినా నీకు దుర్యోధనుడు గధ యుద్ధము గురించి తెలియదా. భీమసేనుడికి బుజ బలము ఎక్కువ. కానీ, దుర్యోధనుడికి గధ యుద్ధంలో నేర్పు ఎక్కువ. నేర్పు ముందు భుజబలము ఎందుకు పనికిరాదు తర్వాత నీ ఇష్టము" అని చెప్తాడు.

అది విన్న బీముడు కృష్ణ అన్న గారి ఆజ్ఞనీ అనుగ్రహము నా చేతిలో గధ ఉండాలి. ఈ 14 భువనాలను ఒక్క క్షణములో జయించగలను. ఇంకా ఈ దుర్యోధనుడు ఎంత. ఈ దుర్యోధనుడు నా ముందు క్షణము కూడా నిలబడడు. ఈ మాత్రము దానికి అన్న గారిని నిందించడము ఎందుకు. ఈరోజు నేను నా గధ యుద్ధముతో దుర్యోధనుడిని చంపి నీకు సంతోషము కలిగిస్తాను. భీమసేన నిన్ను తక్కువ చేసి మాట్లాడడము లేదు. బకాసుడిని, ఇడింబిని, కీచకుడిని, జలసంధుడిని వధించావు. ఇవన్నీ మామూలు మనుషులు చేసే పనులు ఏమి కాదు. నీ ముందు దుర్యోధనుడు ఎంత. నువ్వు దుశ్శాసనుడిని చంపి గుండెలు చీల్చి రక్తము తాగుతుంటే బొమ్మలాగా నిలబడ్డాడు గాని నీతో యుద్ధానికి దిగాడా ఈ దుర్యోధనుడు. అప్పుడే తెలిసింది అతని వీరత్వము ఏమిటో ఆనాడు. కౌరవ సభలో పాంచాలి నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతిజ్ఞలో ఒకటి నేర్చావు, ఇక రెండవది అదే దుర్యోధనుడి తొడలు విడగొట్టి చంపడము. దానిని ఇప్పుడు నువ్వు తీర్చు. ఈ దుర్యోధనుడిని చంపి మీ అన్న ధర్మరాజును కురుసామ్రాజ రాజుని చెయ్యి. ఇంక ఆలస్యము చేయకు నీ గధకు పండుగ చెయ్యి. నీ వెనక నేను ఉన్నానని ఉత్సాహపరిచాడు. కానీ, ఒక్క మాట మరవకు భీమసేన దుర్యోధనుడు గధ యుద్ధములో ఎంతో నేర్పు అని ఎన్నో ఏళ్ళు కతోరత్వమైన శ్రమ చేసి సాధన చేశాడు. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండు అని అన్నాడు.

భీముడు దుర్యోధనుడికి ముందుకు వెళ్లి కోపముతో రగిలిపోతూ "మా అన్న ధర్మరాజుని మాయ జూదము ఆడించి ఓడించావు. మా రాజ్య భాగమును తీసుకున్నావు. నిండు సభలో ద్రౌపదిని అవమానించావు. ఈ అరాచకాల అన్నిటికీ నేడు ఫలితము అనుభవిస్తావు. అందుకే నా ఎదురుగా నిలిచావు. భీష్మ, ద్రోణ, కర్ణ నీ కోసము తమ ప్రాణాలు బలి పెట్టావు. నీ కోసము ఎంతోమంది బంధుమిత్రులు వారి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఎంతో మంది రాజులను తోడుగా తెచ్చుకున్నావు. వారందరూ యుద్ధములో మరణించారు. ఈ దారుణ మరణాలకి మూలము అయిన పురుషుడైన శకుని నీ కళ్ళ ముందె చచ్చాడు. నీవు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా నేడు నా గధకి ఆహుతి చేస్తాను. ఈ లోకములో ఉన్న కల్మషాన్ని నేను పోగొడతాను. రా నాతో యుద్ధము చేసి చచ్చిపో" అని అన్నాడు. 

భీమసేనుడు అన్న ఆ మాటలకు దుర్యోధనుడు ఇలా అన్నాడు "భీమసేన ఎక్కువగా మాట్లాడకు నాతో గధ యుద్ధము చేయడానికి ఆ ఇంద్రుడే భయపడుతాడు. ఇక నువ్వెంత, నాకు రాజ్యము సర్వసము దారపొయ్యి" అని అన్నాడు.

భీముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడు గధ యుద్ధము చేస్తున్నాడని అది చూడడానికి బలరాముడు అక్కడికి చేరుకున్నాడు. ఆయనను చూసి పాండవులు ఆయనకు ఎదురు వెళ్లి నమస్కరించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, పాంచాలి, యాదవులు చదరంగబలాలు చుట్టూ కూర్చొని ఉండగా భీమ దుర్యోధనులు ఇద్దరు గధ యుద్ధానికి సిద్ధము అయ్యారు. 

తలపై కిరీటాలతో ఒంటిమీద బంగారు కవచాలతో భారీ ఆకారాలతో కండలు తిరిగిన దేహాలతో చేతిలో గధలు పట్టుకొని యుద్ధభూమిలో నిలుచుని ఉన్న వారిద్దరినీ చూస్తే త్రేతా యుగములో వాలి, సుగ్రీవుడి లాగా కనిపిస్తున్నారు. దుర్యోధనుడిని చంపి అతడి రెండో ప్రతిజ్ఞ నెవేర్చుకోవాలని భీముడు తన తమ్ముళ్ళని అందరినీ వధించిన భీముడిని వధించి సమస్త భూమండలానికి అధిపతి కావాలని అనుకుంటున్నాడు దుర్యోధనుడు. ఇంకా భీముడు దుర్యోధనుడు ఇద్దరు సింహము లాగా ఒకరిపై ఒకరు వారి గధలతో దాడి చేసుకుంటున్నారు. వారి గధ శబ్దానికి భూమి కంపించి నట్టు అయ్యింది. ఒకరిని ఒకరు గధలతో కొట్టుకుంటూ భయంకరమైన సింహాల లాగా యుద్ధము చేస్తున్నారు. నేల మీద ఉన్న దులి ఆకాశము మీదికి ఎగిరి పడుతున్నది. వారికి కిరీటాలు ఎగిరిపడ్డాయి. వారికి కవచాలు విరిగి ముక్కలు అయ్యాయి. ఇద్దరి శరీరాల నుంచి రక్తము కారుతుంది. కానీ ఎవరు తగ్గడము లేదు. వారిద్దరిలో ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. కానీ, సమయము గడిచే కొద్దీ భీమసేనుడు నిరసించి పోతున్నాడు. దుర్యోధనుడు మరింత శక్తిని పెంచుకుంటున్నారు. దానికి కారణము ఒక్కటే భీముడు యుద్ధంలో బలాన్ని ఉపయోగిస్తే దుర్యోధనుడు నేర్పుని ఉపయోగిస్తున్నాడు. భీముడు కొట్టిన దెబ్బల నుంచి సులభంగా తప్పించుకుంటూ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు. దుర్యోధనుడు గధ యుద్ధములో తనకు తెలిసినేవి అన్ని ప్రదర్శిస్తున్నాడు. దానికి తోడు దుర్యోధనుడు రాక్షస అంశతో జన్మించినవాడు. అతని శరీరములో నావికి పైభాగమంతా వజ్ర శరీరము అయింది. ఎటువంటి అస్త్ర శాస్త్రాలు ఆయుధాలు దుర్యోధనుడికి హాని కలిగించలేవు. ఆ కారణముగా భీముడు కొట్టే దెబ్బలన్ని దుర్యోధనుడిని ఏమీ చేయలేకపోతున్నాయి. ఇదంతా చూస్తున్న పాండవులకు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో యుద్ధము ఎందుకు వద్దన్నాడో అర్థము అవుతున్నది. కృష్ణ నువ్వు చెప్పింది నిజమే దుర్యోధనుడు నేర్పు ముందు భీముడు బలము సరిపోవడము లేదు. ఇప్పుడు మేము గెలిచేది ఎలా కృష్ణ. మేము నిన్నే నమ్ముకున్నాము. ఇప్పుడు మేము ఏమి చేయాలో చెప్పు కృష్ణ అని పాండవులు అంటారు.

అర్జున, బీముడు, దుర్యోధనుడు ఇద్దరు ఒకే గురువు దగ్గర యుద్ధము నేర్చుకున్నారు. భీముడికి శారీరక బలము ఎక్కువ. కానీ, బుద్ధి బలము, నేర్పు బలము శూన్యము. అయితే దుర్యోధనుడికి బలము, బుద్ధి, నేర్పు అన్నీ ఉన్నాయి. పైగా అతని శరీరము పై భాగము వజ్రకాయము. ఎటువంటి ఆయుధాలు అతన్ని చంప లేవు. ధర్మ ప్రదంగా అయితే భీముడు దుర్యోధనుడిని గెలవడము అసాధ్యము. అతని గెలవాలంటే ఒకటే ఉంది. అదే ఆధర్మ మార్గము అధర్మాని అధర్మముతోనే ఓడించాలి. దుర్యోధనుడి పై శరీరము అంతా వజ్రకాయము. కానీ, నావి కింద భాగము మాత్రమే సాధారణమైన శరీరము. కాబట్టి దుర్యోధనుడిని ఓడించాలంటే అతని తొడలను విరకొట్టి చంపాలి. కానీ, గధ యుద్ధము నియమము ప్రకారము నావి కింద భాగము అంటే తొడల మీద కొట్టడము ధర్మ విరుదము. అయితే నాడు కౌరవ సభలో భీముడు, దుర్యోధనుడు తొడలు వీరచుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి నావి కింద తొడల భాగము మీద కొట్టాడని మనము సమర్ధించుకోవచ్చు. భీముడిని ఆ పని చేయమని ఆధర్మము అయినప్పటికీ ప్రస్తుతము దుర్యోధనుడిని ఓడించాలంటే అది ఒక్కటే మార్గమని అన్నాడు. అది విన్న అర్జునుడు వేరే దారి కనపడలేదు. దాంతో భీమసేనుడి వైపు చూస్తూ భీముడు కూడా తన వైపు చూడగానే తను తొడలు చేర్చి దుర్యోధనుడిని అక్కడ కొట్టమని సైగ చేశాడు. కృష్ణుడు కూడా దానికి అంగీకారంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ సైగాలు అర్థము చేసుకున్నాడు. ఆధర్మ యుద్ధానికి శ్రీకృష్ణుడే అనుమతి ఇచ్చిన తర్వాత ఇక ఆలస్యము ఎందుకు అనుకొని దుర్యోధనుడి తొడలు విరగొట్టడానికి సరైన సమయము కోసము ఎదురు చూస్తు అలా చూస్తూ చూస్తూ దుర్యోధనుడిని కొట్టడానికి తన గధతో ఒక్క దెబ్బ వెయ్యగా దుర్యోధనుడు ఆ దెబ్బ నుండి తప్పించుకొని తిరిగి భీముడి వీపు మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు బీముడు మూర్చపోయి నేల మీద పడిపోయాడు. అది చూసిన దుర్యోధనుడు విజయ గర్వముతో గట్టిగా నవ్వాడు. భీముడు తలపై కొట్టి చంపడానికి పైకి ఎగిరి అతనిపై నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయములో భీమసేనుడు మెలుకువ వచ్చి ఎదురుగా దుర్యోధనుడు కనిపించాడు. ఇదే సరైన సమయము అనుకున్న భీముడు తన గధకు దగ్గరగా ఉన్న తొడలపై తన బలము అంతటినీ ఉపయోగించి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తొడ ఎముకలు ఒక్కసారిగా విరిగిపోయాయి. మొదలు నరికిన చెట్టు లాగా నేల మీద పడిపోయాడు. ఈ విధంగా మహాభారతములో భీముడు దుర్యోధనుడిని వధిస్తాడు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !