భగత్ సింగ్ జీవిత చరిత్ర......
భగత్ సింగ్ ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడు రోమాలు నిక్కపూర్చుకుంటాయి.
భగత్ సింగ్ బాల్యము
భగత్ సింగ్ సొంత ఊరు పంజాబ్ రాష్ట్రములోని ల్యాల్లపూర్ జిల్లా. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సంతాన్ కిషన్ సింగ్. భగత్ సింగ్ పుట్టిన సమయములో కిషన్ సింగ్ సోదరులు అందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటము వలన వాళ్లందరినీ జైల్లో పెట్టారు. అయితే పిల్లాడు పుట్టి పుట్టగానే వాళ్లందరినీ జైలు నుండి విడుదల చేసారని వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టము వచ్చిందని భావించి పిల్లాడికి భగత్ సింగ్ అనే నామకరణము చేశారు. కుటుంబములో అందరూ స్వాతంత్ర్య ఉద్యమాలలలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. ఈ కారణము చేత చిన్నప్పటినుండే భగత్ సింగ్ మనసులో కూడా బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేక భావన కలిగింది. ఒక్కసారి వాళ్ళ నాన్న, బాబాయి తో కలిసి భగత్ సింగ్ అలా బయటికి వెళ్లారు. అయితే కొంచెము సేపు అయిన తర్వాత భగత్ సింగ్ కనిపించకపోవడముతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్ కనిపించరు. అప్పుడు భగత్ సింగ్ "నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి, వాటితో ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమేయొచ్చు" అని ఆవేశంగా చెప్పారు.
అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాళ్ళ బాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన భగత్ సింగ్ పై చాలా ప్రభావము చూపింది. ఆ ప్రదేశానికి వెళ్లి భూమిని ముద్దాడి, అక్కడ రక్తముతో తడిచిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తుడో చెప్పడానికి. చిన్నతనములో యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. వాటి వల్ల ఆయన కమ్యూనిజము వైపు ఆకర్షణ అయ్యారు. ఆ కాలములో ఉన్న అతికొద్ది మారక్సిస్ట్ లో ఆయన ఒకరు.
భగత్ సింగ్ ఉద్యమాలలో పాల్గొనడము
భగత్ సింగ్ డి.ఏ.బి కళాశాలలో చదువుకుంటున్నప్పుడు అప్పట్లో స్వాతంత్ర ఉద్యమాలలలో చురుగ్గా పాల్గొనడము వల్లన కొందరు ముఖ్యులు లాల లజపతిరాయ్, రాజ్ బిహారి, మహాత్మా గాంధీ గారు పరిచయమయ్యారు.
భగత్ సింగ్ విప్లవ సంస్థలలో చేరడము
1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాలను మానేసి లాహోర్లోని కాలేజీలో చేరారు. భగత్ సింగ్ కి గాంధీజీ అంటే చాలా అభిమానము ఉండేది. ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వతంత్రము సాధిస్తాడని నమ్ముతూ ఉండేవారు. అయితే 1982లో చౌరీచోరాలో జరిగిన సంఘటన వలన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమము ఆపేశారు. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్రువుడు అయ్యారు. అదే సమయములో పంజాబ్ హిందీ సాహిత్యం సమ్మేళనము వాళ్ళు నిర్మించిన వ్యాస రచించిన పోటీలలో భగత్ సింగ్ ప్రథమ బహుమతి సాధించారు. అక్కడే పరిచయము అయ్యాడు భీమ్సేన్ విద్యా అలంకార్. ఆయన సాహిత్య సమితి అధ్యక్షుడు కళాశాలలలో చదువుతున్న సమయాలలో తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవ సంస్థలలో చేరారు. అలాంటి సమయాలలో విద్యా అలంకార్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. దాంతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు. భగత్ సింగ్ దాంట్లో చేరిన తర్వాత దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అని మార్చబడింది. ఆ సమస్థ సభ్యుల్లో ప్రముఖమైన వాళ్ళు యోగేంద్ర శుక్ల, చంద్రశేఖర ఆజాద్. ఈ సమస్థ ఏర్పాటుకు ముఖ్య కారణము రష్యాలోని బోల్స్ వీక్ విప్లవము సంస్థలో చేరిన అప్పటినుండి బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వము వాళ్లందరిపై తీవ్రవాదులుగా ముర్దవేశారు.
అది ఫిబ్రవరి 1928 వ సంవత్సరం సైమమ్ కమీషన్ భారతదేశములో అడుగుపెట్టింది. ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశము "భారతదేశములో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడము". అయితే, ఆ కమిటీలో ఒక్క భారతీయుడు కూడా లేరు. అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైమమ్ కమిషన్ కమిటీ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు లాలా లజపతిరాయ్ దానికి నిరసనగా ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు. కానీ, పోలీసులు అత్యుత్సవంతో పాల్గొంటున్న వాళ్ళందరిపై లాటి చార్జ్ చేశారు. ఆ దెబ్బలకి లాలా లజపతిరాయ్ చనిపోయారు. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి అయిన భగత్ సింగ్ లజపతిరాయ్ ని చంపినందుకు పోలీస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు. తన స్నేహితులైన శివరామరాజు, గురువు జై గోపాల్ సుఖదేవ్, తలపర్ తో కలిసి ప్రణాళిక రచించారు. వాళ్ల పథకము ప్రకారము జై గోపాల్ ఆ అధికారిని చూసి భగత్ సింగ్ కి సైగల్ యాలి. అయితే జై గోపాల్ తప్పిదము వలన అసలు అధికారి బదులు వేరే వారిని చంపేశారు. భగత్ సింగ్ పోలీస్ అధికారిని చంపిన తర్వాత భగత్ సింగ్ మీద నిగా ఎక్కువయింది. దాంతో తప్పనిసరి పరిస్థితులలో మారువేషములో భగత్ సింగ్ సంచరించసాగారు.
భగత్ సింగ్ అసెంబ్లీలో చేసిన దాడి
దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉండడంతో వాటిని అనిచవేయడానికి బ్రిటిష్ వాళ్లు ఒక కొత్త చట్టము తీసుకువచ్చారు. దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా హార్ట్. అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక్క ఓటు తేడాతో విరిగిపోయింది. కానీ, బ్రిటిష్ వారు దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు. అందుకు ప్రతికాగా భగత్ సింగ్ వాళ్ళ అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నారు. 1929న ఏప్రిల్ 8న భగత్ సింగ్ తన స్నేహితుడితో కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబు వేశారు. అయితే ఆ బాంబులు తయారు చేయడములో అనుభవము లేకపోవడము వలన దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరంగా విసిరి వేయడము వలన ఎవరికి ఏమీ కాలేదు. బాంబు కేసులో భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు భగత్ సింగ్ మీద విచారణ జరుగుతున్న సమయములోనే పోలీసు అధికారిని అతను చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన సుఖదేవు రాజ గురువుకి కూడా శిక్ష పడింది. కానీ, జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ ఉద్యమాలను చేయడము ఆపలేదు. బ్రిటిష్ ఖైదీలకి భారతీయ ఖైదీలకి మధ్యన చూపిస్తున్న అసమానతను పార్వద్రోయడానికి 63 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. దాంతో ఆయన పేరు భారతదేశపు మొత్తం మారు మోగింది. అంతకు ముందు వరకు భగత్ సింగ్ కేవలము పంజాబ్ ప్రాంతము వరకు మాత్రమే పరిమితులు అయ్యారు. చివరికి 1931న మార్చి 23న రాజ్య గురువు సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని బ్రిటిష్ వాళ్లు ఉరి తీశారు. అలా ఓ విప్లవకారుడు ప్రాణాలు అనంత వాయువులో కలిసి పోయింది. మనిషికి న్యాయము చేయడము కోసమే చట్టము ఏర్పడింది. అలా అని చట్టము చేసే ప్రతి పని న్యాయము కాదు. ఒక్కొక్కసారి ఆ చట్టము వల్లన కూడా అన్యాయము జరుగుతుంది. అలాంటప్పుడు దానికి సమాంతరంగా ఇంకొక చట్టము పుడుతుందని రుజువు చేసారు. దేశము కోసము, దేశ ప్రజల కోసము తమ ప్రాణాలను త్యాగము చేసిన వారికీ వందనము అభివందనము.