ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయము చరిత...
కడప జిల్లా సిద్ధవటానికి దక్షిణముగా ఒంటిమిట్ట అనే గ్రామము ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయము అనే దేవాలయము ఉంది. ఇది చాలా పురాత కాలానికి సంబంధించిన క్షేత్రము. కడప పట్టణానికి సుమారు 22 కిలో మీటర్ల దూరములో, కడప నుండి చెన్నైకి వెళ్లే మార్గములో ఈ ఆలయము ఉంది. ఈ ఆలయములో ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు కొలువుతీరి ఉన్నారు. సుమారు 160 అడుగుల ఎత్తులో మిట్ట పైన ఈ ఆలయము నిర్మించబడింది. అందువలన ఒంటిమిట్ట అని ఈ ఆలయానికి, గ్రామానికి పేరు వచ్చింది.
ఒంటిమిట్ట ఆలయము యొక్క చరిత్ర
వంతుడు, మిట్టడు అని ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులు కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికారు. అందుకని వీళ్ళ పేరు మీదనే ఒంటిమిట్ట అని పేరు వచ్చింది.
ఒంటిమిట్ట ఆలయానికి మరో కథనము ఉంది. పూర్వము ఒంటిమిట్టను ఏకశిలా నగరము అని పిలిచేవారు. ఇక్కడ గల కోదండ రామాలయములోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించారు. ఒకే శిలలో శ్రీ రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఇక్కడ మనము చూడవచ్చు. ఈ దేవాలయములో శ్రీ రామ తీర్థము ఉంది. ఒకరోజు సీత దాహముతో నీటిని కోరాగ శ్రీరాముడు రామ బాణముతో పాతాళ గంగను పైకి తెచ్చి సీతమ్మ తల్లి దాహము తీర్చినట్టు స్థల పురాణము తెలియజేస్తున్నది. లక్ష్మణుడికి కూడా గంగను ఇదే విధంగా పైకి తెచ్చి వదినమ్మ సీత దాహము తీర్చాడని స్థలపురాణము తెలియజేస్తున్నది. దానిని లక్ష్మణ తీర్థము అని అంటారు.
ఒంటిమిట్ట ఆలయము యొక్క నిర్మాణ శైలి
గోపుర నిర్మాణము చోళ శిల్పకళ నేర్పునను కలిగి అత్య అద్భుతంగా ఉంటుంది. భద్రాచలము తర్వాత అంతటి పేరు పొందిన ఈ క్షేత్రములోని కోదండ రామాలయము 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజులు నిర్మించినట్టుగా తెలుస్తున్నది. తర్వాత 3 అంచలంచలుగా అభివృద్ధి జరిగినట్టుగా సామాన్య శకము 1555, 1558, 1564 లో శాసనాలల్లో తెలుస్తున్నది. స్థల పురాణము ప్రకారము సీతారామ కళ్యాణము జరిగిన తర్వాత ముఖండు మహర్షి, సింగి మహర్షి ఇద్దరు కలిసి శ్రీరాముడిని ప్రార్థించగా దుష్టశిక్షణార్థము కోసము ఆ స్వామి సీతారామ లక్ష్మణ సమేతుడు అయ్యి ఈ ప్రాంతానికి వచ్చి త్యాగ రక్షణ చేశాడని పురాణము చెప్తున్నాది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని చెబుతారు. ఒకరోజున జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నములో సీతారామ లక్ష్మణులు దర్శనము ఇవ్వడముతో ఆనంద భరితుడయ్యి సీతారామ లక్ష్మణులను ప్రతిష్టించారని అంటారు. అందుకే దీనికి జంబవంత ప్రతిష్ట అని పేరు కూడా వచ్చింది.
ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించిన ముస్లిం రాజులు
ఒంటిమిట్ట రామాలయము సందర్శకులను ఆకర్షించే అంశాలలో హిమామ్ బేక్ బాబి ఒకటి. ఇది 1640 సంవత్సరములో కడపను పరిపాలిస్తున్న అబ్దుల్ నజీర్ ఖాన్ ప్రతినిధి ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడని భక్తులు చెప్పారు. దాంతో ఆయన మూడు సార్లు శ్రీరాముడిని పిలిచారు. అందుకు ప్రతిగా మూడుసార్లు ఓం అని శబ్దము వచ్చింది. అది విని హిమామ్బే చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పటినుంచి స్వామి భక్తుడిగా మారిపోయారు. అక్కడ నీటి అవసరాల కోసము ఒక బావిని కూడా తవ్వించారు. ఆయన పేరు మీదగా ఈ బావిని హిమామ్ బేక్ బావిగా పిలుస్తారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని ఎందరో మంది ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడము విశేషము.
ఒంటిమిట్ట నివాసి అయిన అయ్యే రాజు తిప్పకవి సామాన్య శకము 1432 నుండి 1446 వరకు సంఘ రాజు వంశములో ముఖ్యుడు అయిన దేవరాయల వారి ఆశ్రమములో కవిగా ఉన్నారు. ఈయన గగ్గువీర గాధ్యం రచించారు. వరకవి అనేది ఈ కవికి పేరు. ఒంటిమిట్ట కోదండరాముడు పైన ఈ కవి శతకము కూడా రాశారు.
ఒంటిమిట్ట ఆలయము గురించి కొన్ని ముఖ్య విశేషాలు
- ఐదు అంతస్తుల తూర్పు రాజా గోపురము కింద నుంచి ఆలయ ప్రవేశము జరుగుతుంది. ఆ మెట్ల మీద ఈ ఆలయము, గద్వాలయము, అంతర ఆలయము, మండపము అనే మూడు బాగాలుగా ఉన్నాయి. గర్భగుడిలో శ్రీ సీతారామ లక్ష్మణులు మనకు దర్శనము ఇస్తారు.
- ఈ ఆలయములో ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకమైన ఆలయము రాజగోపురముకు ఎదురుగా ఉన్నది. అయితే ఇక్కడ విశేషము ఏమిటంటే ప్రతి ఆలయము లో కూడా ఆంజనేయుడు రాముల వారి పాదాల చెంత ఉంటారు. కానీ, ఇక్కడ మాత్రము శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి వేరుగా కొలువై ఉన్నారు.
- శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణము అందు కళ్యాణ మండపము 32 స్థిలా మండపాలతో రంగ మండపము శ్రీరామలింగేశ్వర సన్నిధి ఉన్నాయి. మండపము లో ద్వారము దగ్గర పోతన గారి విగ్రహము కూడా ఉంది.
- భారత దేశపులోని గొప్ప ఆలయ గోపురాలను ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ ఆలయము. గోపురము ఒకటి సామాన్య శకము 1652వ సంవత్సరములో భారత దేశ యాత్ర చేసిన ఒక వ్యక్తి ఈ ఆలయము శిల్ప సంపదన గురించి పేర్కొన్నారు.
- తూర్పు వైపున ఉన్న సీతారాముల లక్ష్మణులు మూర్తులు ఒక భక్తుడి కోసము పశ్చిమము వైపుకి మరిల్లినట్టు ఒక పురాణ కథ కూడా ప్రచారములో ఉంది. ఆంధ్ర మహా భాగవతాన్ని రచించిన భక్త పోతన భాగవత గ్రంధాన్ని ఈ ఆలయములో చెరువుగట్టు మీద కూర్చొని రచించారు అని ప్రతిదీ. అంతేకాక, తన భాగవతాన్ని ఈ కోదండ రాముడికి అంకితము ఇచ్చారు.
- ఆంధ్ర వాల్మీకి గా ప్రసిద్ధి చెందిన సుబ్బారావు గారికి స్వప్నములో ఇద్దరు బైరాగిలు కనిపించారని వారి ఆదేశము మేరగానే ఒంటిమిట్టలో నివాసము ఏర్పాటు చేసుకొని రామాలయాన్ని పునరుద్ధరణ చేయడానికి కృషిచేసి టెంకాయ చిప్ప చేత పట్టుకొని పాదయాత్ర చేస్తూ లక్షలాది రూపాయలు సేకరించి ఆలయము నిర్మాణము కావించారు.
- ఈ ఆలయములో నిత్య పూజలు అర్చనలతో పాటు శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శ్రీ సీతారాముల స్వామి కళ్యాణము చతుర్థి నాడు జరగడము విశేషము. పౌర్ణమి నాడు రథోత్సవము జరుగుతుంది.