రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం.. ఆలయ విశేషాలు....
భోగ ముక్తి క్షేత్రము రామేశ్వర ఆలయము. భారతదేశములోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు, యాత్రికులు ప్రతిరోజు రామేశ్వర ఆలయాన్ని, ధనుష్కోటిని దర్శించి పూజలు చేస్తూ ఉంటారు. రామేశ్వర పుణ్యక్షేత్రము ఆవిర్భవించి 10 చతురయుగాలు అయిందని చెప్తారు. 15 ఎకరాల విస్తీర్ణత అయినా ఈ ఆలయాన్ని కొన్ని భాగాలను 49 అడుగులు పొడుగు గల ఏకశిలతో నిర్మించబడి ఉంది.
రామేశ్వర ఆలయము విశేషాలు
- శ్రీరాముడి చేతుల మీదగా ప్రతిష్టించబడిన శివలింగము, హనుమంతుడు ప్రతిష్టించిన లింగము, విశాలాక్షి పార్వతీ వద్దిని నటరాజ స్వామికి ఈ ఐదుగురు దేవతామూర్తులకు విమానాలు నిర్మించబడి ఉండడము విశేషము.
- పంచమూర్తుల ఊరేగింపు సమయములో నంది తన వెనుక వైపు చూపకుండా స్వామిని చూస్తూ ముందువైపు వెళ్లడము ఆచారము.
- రామేశ్వరములోని జ్యోతి లింగాని విభీషుణుడు ప్రతిష్టాపించారు. ఈ శివలింగము వెనుక భాగములో కర్పూర హారతి వెలిగిస్తే ముందువైపున లేత ఎరుపు జ్యోతి కనిపిస్తుందని విశేషము. ఈ జ్యోతి లింగాల క్షేత్రాలలో ఏడవదిగా చెప్తారు.
- శ్రీరామనాథ స్వామికి ఇతర దేవీ దేవతల మూర్తులకు అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు మొదలైన పూజా విధానాలను నిర్వహించడానికి కొన్ని శతాబ్దాల కాలంగా మహారాష్ట్ర బ్రాహ్మణులు నియమించబడుతూ ఉన్నారు.
- జేష్ట మాసములో ప్రతిష్టాపన ఉత్సవాలు, కళ్యాణ ఉత్సవము, మాఘ మాసము మహా శివరాత్రి ఉత్సవాలు రామేశ్వర ఆలయములో ప్రసిద్ధి చెందిన ఉత్సవాలు.
- అమావాస్య పౌర్ణమి రోజుల్లో సేతు సముద్రము అడుగున ఉన్న మూలికలు సముద్ర మట్టానికి పైకి వచ్చి ఒడ్డుకు చేరుతాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది కాకుండా కామేశ్వర సేతు సముద్రతీర్థము రెండు లక్షల మైళ్ళ ప్రదక్షణము చేస్తాయని లెక్క కట్టారు.
- రామేశ్వర ఆలయములోని ఒక్కొక్క తీర్థము జీవశక్తులు అయస్కాంత ప్రకంపలు కలిగి ఉంటాయి. ఆ పుణ్యతీర్థములలో తల స్నానము చేస్తే ఆ శక్తులను మనము సంపూర్ణముగా పొందుతాము అని చెబుతారు.
- రామేశ్వర ఆలయములో ఒకే శంఖములో రెండు శంఖాలు ఉన్న దైవికమైన త్రిశంఖు ఉన్నది. రామనాధేశ్వరుడికి అభిషేకానికి ప్రత్యేకంగా ఒక వెయ్యి ఎనిమిది అభిషేక శంఖాలు ఉన్నాయి.
- రామేశ్వర ఆలయాన్ని గర్భగుడిలో మూలవిరాట్ ని స్పర్శించి పూజించే అధికారము శృంగేరి సన్నిదానికి నేపాల్ దేశపు రాజుకి మాత్రమే ఉంది.
- రామేశ్వర ఆలయ నిర్మాణానికి లంకలో త్రికోట వలయ నుండి బ్రహ్మాండమైన నల్లరాలను తీసుకొని రాబడ్డాయి.
- రామేశ్వర ఆలయానికి సేతుపతి రాజు చేసిన సేవలను గౌరవించి ఉండే విధంగా ఈనాటికి కూడా వారి నామము, వారి నక్షత్రాలు మూల మూర్తికి పూజలు చేసే సమయములో సంకల్పముగా పట్టిస్తారు.
- ఈ సేతుపతి శ్రీ రామచంద్రుడికి సహాయపడిన వారి వంశముగా చెబుతారు.
- రామేశ్వర నటరాజ స్వామి సన్నిధిలో ఉన్న పతంజలి మహర్షి సమాధి వద్ద నేటి దీపము వెలిగించి ప్రార్ధనలు చేస్తే రాహు కేతువులు దోషాలు తొలగిపోతాయి.
- ఈ ఆలయములో వైష్ణవ ఆలయాల్లో ఇచ్చినట్టు తీర్థ ప్రసాదాలు ఇస్తారు.
- కాశీలో మరణిస్తే ముక్తి, శివలింగాలు కలిగిన నర్మదా నది తీరాన వ్రతాలు చేస్తే ముక్తి, కురుక్షేత్రంలో దానాలు చేస్తే ముక్తి. కానీ, ఈ పుణ్యఫలాన్ని ఇచ్చే క్షేత్రంగా శ్రీ రామేశ్వరము ప్రసిద్ధి చెందింది.
- పితృదేవతలకు తర్పణాలు వదిలిన వారికి భార్య గర్భిణీ అయిన సమయములో భర్తకి ఈ ఆలయము అయిన తీర్థాలలో సానము చేసే అర్హత లేదు.
- సేతు తీర్థములో స్నానము చేయవచ్చు. తీర్థమే దైవము అయి ఉండగా స్నానము చేయడానికి దినము, తిధి, వార, నక్షత్ర ఇవే కాకుండా ఎటువంటి నియమాలు లేకుండా సేతు సానుము చేయవచ్చు.
- కాశిలో యాత్ర చేసినట్టు అయితే యాత్ర పరిపూర్ణత కాదు. మొదట రామేశ్వరము వెళ్లి సముద్ర స్నానము చేసి అక్కడి సముద్రపు ఇసుకను తీసుకొని కాశీకి వెళ్లి అక్కడ గంగా నదిలో కలపి, తిరిగి రామేశ్వరానికి వచ్చి కాశీ నుండి తెచ్చిన గంగతో రామనాధేశ్వరుడుకి అభిషేకము చెయ్యాలి. అప్పుడు కాశి యాత్ర పూర్తి అయ్యి మంచి ఫలితాలు ఇస్తుంది. అలా అయితే కాశి క్షేత్రము ముక్తిని ప్రసాదిస్తుంది. రామేశ్వరము భోగాన్ని ముక్తిని కూడా అనుగ్రహించే పుణ్యక్షేత్రము.