సంగమేశ్వర దేవాలయము విశేషాలు.......

సంగమేశ్వర దేవాలయము విశేషాలు.......

అద్భుతమైన సంగమేశ్వర స్వామి ఆలయము భవాని కావేరి నది తీరములో ఉన్న అందమైన పుణ్యక్షేత్రము. ఇది ఈ సంగమేశ్వర తీర్థ భవాని 1000 సంవత్సరాలు ముందు నిర్మించబడి, ప్రాచీనమైన నగరము ఆకారములోని వృత్తి వ్యాపారాలకు పేరు ఉన్న అందమైన నగరము. ఇది ఆధ్యాత్మికంగా నగరంగాను ఖ్యాతి చెందినది. ఈ క్షేత్రములో హరిహరులు ఇద్దరూ మనకు దర్శనము ఇస్తున్నారు. సంగమేశ్వరుడి పేరుని కీర్తించే అపురూపమైన క్షేత్రము ఈ ఆలయము. ఇక్కడ భవాని అందుకు కారణమైన నదులు సంగమము వలన దీనిని సంగమ తీర్థము అని కూడా అంటారు. ఈ సంగమ తీర్థము మూడు నదులు సంగమిచ్చే ప్రదేశము. భవాని, కావేరి, అమృతా నది అని ఈ మూడు నదులు సంగమిస్తూ ఈ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రముగా మార్చాయి. ఉత్తర భారత దేశములో గంగా నదితో యమునా అంతర్వాయిని అయిన సరస్వతి సంగమించిన ప్రాంతము. త్రివేణి సంగముగా పేరుగాంచింది. దక్షిణ భారతదేశంలో కావేరితో భవాని అమృతా నదులు సంగమిస్తూ ఉన్నది. ఈ అమృతా నది కంటికి కనిపించకుండా అంతర్వాయినిగా ఉండిపోయింది. ఈ విధంగా మూడు నదులు సంగమించడము వలన ఈ సంగమ తీర్థాన్ని దక్షిణ త్రివేణి సంగముగా పిలుస్తారు. అందువల్లనే స్వామి వారిని కూడా సంగమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ సంగమేశ్వరుడు స్వయంభు లింగముగా వెలిసిన వారు. పవిత్రమైన ఈ త్రివేణి సంగమములో సానము చేస్తే పాపాలు తొలగి పుణ్యాన్ని సంపాదించుకుని ఆనందిస్తున్నారు. భక్తులు ఈ ఊరిలో జన్మించిన, జీవించిన, మరణించిన పుణ్యమే అని పురాణాలు చెబుతున్నాయి. 

ఇక్కడ భవాని సంగమ తీర్థము నుండి మరో పవిత్రమైన ప్రాంతము అయిన వేదగిరి పర్వతాల వరకు అడుగుకు 1000 లింగాలు ఉన్నాయి అనేది పురాణ కాలము నమ్మకము. అంతేకాదు గొప్ప పరిహార ప్రాంతంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. భవానీ మాత ఇక్కడి తీర్థములో సానము చేసి స్థల వినాయకుడు, సంగమేశ్వరుడిని పూజించి ఇక్కడ ఉన్న  రేగి పండ్లను తింటే సంతాన భాగ్యము కలుగుతుందని చెప్తారు. భవాని, కావేరి ఇరువైపులను ప్రవహిస్తూ ఉండగా చుట్టూ నీటితో ఉన్న ఈ ప్రాంతములో ఆలయము నిర్మించబడింది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణములో ఉన్న పెద్ద ఆలయము ఇది. ఆలయానికి రెండు ద్వారాలు ఉండడము విశేషము. ఆలయము ప్రధాన ఒక గోపురము అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయానికి ఉత్తర దిక్కున ఏడు కలశాలు, ఐదు అంతస్తులు, రాజగోపురము అందంగా కనిపిస్తాయి. వేదగిరి, మంగళగిరి, నాదగిరి, సంగమగిరి అనే నాలుగు గిరిల మధ్య అందమైన తామర మొగ్గలాగా కనిపిస్తున్నది ఈ భవాని క్షేత్రము. ప్రాచీన కాలములో పురాతనగిరి అని పేరుతో పిలువబడే నదులు సంఘమించే ప్రాంతములో నిర్మించబడిన ఆలయాలు అత్యంత మహిమాంతంగా చెప్పబడతాయి. ఈ అయిదు అంతస్తుల రాజగోపురము పై చెక్కబడిన శిల్పాలు ఎంత దూరము నుండి చూసినా అందంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శిల్పాల అందము మన మనసులని పులకరించేటట్టు చేస్తాయి. పై నుండి చూసినప్పుడు ఆలయము ఒక్క విస్తీర్ణత చక్కగా కనిపిస్తుంది. ఇక రెండు వేరు వేరు ఆలయాలుగా నిర్మించబడి ఉండడము కూడా మనము చూడవచ్చు. ఇటు రంగు పెంకులతో కప్పబడే పై భాగము పై నుండి చూసినప్పుడు ఆలయము ఎరుపు రంగులో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. 

ఇక్కడ అమ్మవారికి నదికి క్షేత్రానికి అన్నిటికి ఒకటే పేరు ఉంటుంది. భవాని అని పిలుస్తారు. భవాని అనేది పార్వతి దేవి దివ్య నామాలలో ఒకటి. అందుకని ఇక్కడికి వచ్చి సానము చేసి ఈశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఏ కీడు జరగకుండా అమ్మవారు కూడా వారిని కాపాడుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. ఇక్కడ స్వామి వారు ఆది కేశవ స్వామి అనే దివ్య నామముతో, సౌందర్యవల్లి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఈ ఆలయములో వినాయకుడిని సంగమ వినాయకుడు అనే పేరుతో పూజిస్తున్నారు. అకాల మృత్యువాతన పడిన వారి కోసము ఈ క్షేత్రములో నారాయణ బలి పూజ జరిపిస్తారు. అలా చేయడము వల్ల వారి ఆత్మకు శాంతి జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకము. ఇక్కడ గోపురమే లింగముగా పూజించబడుతుంది. అందుకే గోపురము ఎదుట నంది విగ్రహము కూడా ఉంది. ఇక్కడ నందికి ఉన్న మండపము కూడా బాగా ఎత్తులో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. గోపురము తర్వాత ఉన్న ముఖ మండపము పైన ఉమాదేవి సమీతుడు మనకు అందంగా దర్శనము ఇస్తారు. వారికి ఇరువైపులా కుమారులు ఇరువురు కనిపిస్తారు. ఒకవైపు వినాయకుడు మరోవైపు వల్లి దేవసేన సమీతుడైన సుబ్రమణ్యస్వామి శిలా విగ్రహాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎత్తుగా కనిపించే ముఖద్వారము, నాలుగు స్తంభాల మండపము, సన్నిధి విమానము ఇలా అన్నిటిని చూసి భక్తులు మురిసిపోతూ ఉంటారు. ఇక్కడ నవగ్రహాల సన్నిధి కొంచెము ప్రత్యేకంగా గుండ్రంగా మైన ఆకారముతో పెద్ద విమానముతో విడిగా కనిపిస్తుంది. భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలుగా విశాలమైన మండపముతో నిర్మించాబడారు స్వామి వారు. అమ్మవారు అందంగా కొలువుతీరి ఉండగా వినాయకుడు, పార్వతీ దేవి, చండికేశ్వరుడు ఇలా పంచమూర్తుల విగ్రహాలను ఊరేగిస్తారు. వల్లి దేవసేన సమీతుడైన సుబ్రమణ్యుడు శూల ఆయుధాన్ని ధరించి తాను కూడా ఊరేగింపు చేస్తారు. ఇక్కడ దర్బాలయము ఎదుటగా ఉన్న గజ స్థంభము అందంగా ఉంటుంది. ఉత్సవ సమయములో కావడము చేత పతఆవిష్కరణ జరుగుతుంది. దానికి నమస్కరించి భక్తులు లోపలికి వెళ్తారు. గజ స్తంభాన్ని దాటి కొంచెము ముందుకు వెళితే చిన్న చిన్న సన్నిధానాలు విడివిడిగా విమానము లాంటి ఆకారముతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శివుడికి ఉమాదేవికి నడుమ కుమారస్వామి ప్రత్యేకమైన సన్నిధిలో దర్శనము ఇస్తారు. ఇలా శివపార్వతులను నడుమ సుబ్రహ్మణ్యుడు కూర్చొని ఉంటే విశిష్టతను పొందగలిగింది. ఈ సుబ్రమణ్యేశ్వరుడిని ఎందరో భక్తులు కవులు పాటలతో కీర్తించి పరవశించి పోవడము జరిగింది. 

భవానికి తిరునగ అని మరో పేరు కూడా ఉంది. కావేరి భవాని నదులు ఏకము అయ్యి సంగమిస్తూ ఈ క్షేత్రములో వెలసిన మహాదేవుడు సంగమేశ్వరుడు అనే పేరుతో ఆరాధించబడుతున్నారు. ఇక్కడ అమ్మవారు వేదనాయకి, వేదాంబిక దివ్య నామాలతో కొలువు తీరారు. ఎందరో మహాత్ములు, మహానుభావులు ఈ క్షేత్రాన్ని, ఈ స్వామిని దర్శించుకుని తరించారని స్థల పురాణము ద్వారా తెలుస్తుంది. సంగమేశ్వరుడు వేదనాయకి అమ్మవార్ల సన్నిధి లాగానే ఆది కేశవ స్వామి కి సౌందర్యవల్లి అమ్మవారికి ప్రత్యేకమైన సన్నిధి ఉండడము అనేది ఇక్కడి విశిష్టత. ఈ సన్నిధి ముఖమండపము పైన రెండు వైపులా గరుత్మంతుడు సింహాల శిల్పాలు ఉండగా మధ్యగా రాముడు పట్టాభిషేక దృశ్యాన్ని ఇక్కడ ఉండడము విశేషము. పైన నుండి చూస్తున్నప్పుడు ప్రతి సన్నిధి వేరు వేరు భవనాలు అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ఆవరణకు ఇరువైపులా కావేరి విస్తీర్ణలని అందాన్ని భవాని సొగసులను మనకు తెలియజేస్తున్నాయి. తూర్పు ముఖంగా ఉన్నటువంటి వేదనాయికి అమ్మవారి సన్నిధి ఉంటుంది. అమ్మవారి సన్నిధికి కుడివైపున సుబ్రమణ్యస్వామి సన్నిధానము ఉంది. ఆ సన్నిధి దాటి ముందుకి వెళితే మూల విరాట్ ఉన్న సంగమేశ్వరుడి సన్నిధి అందంగా దర్శనము ఇస్తుంది. స్వామి స్వయంభు లింగ రూపములో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయములో దక్షిణము వైపున పొడవుగా ఉన్న ప్రాంగణములో 63 నయన్నారు విగ్రహాలను అందంగా ప్రతిష్టించబడి ఉన్నాయి. ఒక ప్రత్యేకతమైన మందిరములో ఇక్కడ శనీశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి నడుమ యోగ లక్ష్మీ నరసింహుడు సమీతుడు అయ్యి శాంత స్వరూపుడుగా దర్శనము ఇస్తున్నారు. 

శైవము, వైష్ణవము రెండు మతాల అది దేవుళ్లకు ఆలయాలు ఉన్నప్పటికీ రెండు సన్నిధానములకు కలిపి ఒక్కటే రాజగోపురమే నిర్మించబడి ఉంది. ఇక్కడ ఉత్సవాలకు ఊరంతా ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారు. అందరూ సకల సౌభాగ్యాలను పొంది సుఖంగా జీవించాలని ఉద్దేశంతోనే జరుపుతారు. ఈ 63 మందికి ఈ ఉత్సవము ప్రజలు చూసేందుకు వచ్చే ఉత్సవము శివ భక్తులైన నయన్నారులు భక్తులను చూడడానికి ఉత్సాహంతో ఊరేగింపుతో వచ్చే ఉత్సవము. ఇక్కడ పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా పోటీ పడుతూ శివ భక్తులు పల్లకీలను మోయడానికి ఉబిలతో ముందుకు వస్తారు. భక్తులతో శైవ మతాన్ని తమ భుజాల మీద మోసిన నయన్నారులను తమ భుజాల మీద మూసుకొని వెళ్లడానికి భక్తితో భక్తులందరూ ఈ ఉత్సవములో పాలుపంచుకుంటున్నారు. భవానీలోని సంగమేశ్వరుడి ఆలయము చైత్రమాసములో జరిగే ఉత్సవము సందర్భంగా 63 శివ భక్తుల ఉత్సవము కూడా జరుగుతుంది. ఉత్సవములోని ఒక భాగముగ 63 లోహపు విగ్రహాలను ఒక మండపములో వరుసగా ఉంచడము జరుగుతుంది. అంతేకాదు ప్రవజన కారులు ఈ 63 శివ భక్తుల గురించి ఒక్కొక్కరి జీవిత విశేషాలు భక్తి వారిపట్ల స్వామి వారికి ఉన్న అన్నిటి గురించి వివరించి చెబుతుంటే వినేవారు. కళ్ల వెంట ఆ దృశ్యాలు కనిపించడమే కాకుండా వారి మనసులో అవి అన్ని ముద్రించుకొని పోవడము జరుగుతుంది. ఆ ఆనందములో అందరూ తమను తామే మర్చిపోయి భక్తి పరవాసములో మునిగిపోతారు. అదే ఇక్కడ విశేషము అని చెప్పాలి. ఆ తర్వాత విగ్రహాలను అన్నిటిని వరుసగా పెట్టి సుగంద్ర ద్రవ్యాలు, పసుపు నీరు ఇవన్నీ తీసుకొని వచ్చి అన్ని విగ్రహాలకు ఆరాధించే కార్యక్రమము జరుగుతుంది. 63 విగ్రహాలకు భక్తులందరూ దర్శిస్తూ ఉండగా అభిషేకాన్ని జరిపిస్తూ ఉంటారు. 63 శివ భక్తులు ఉత్సాహంగా ఊరేగడానికి పల్లకీలు సిద్ధము చేస్తారు. అందంగా అలంకరించబడి కన్నులకు ముదుగా గావిస్తున్న పల్లకీలల్లో ఊరంతా ఊరేగుతూ భక్తులందరికీ దర్శనము ఇచ్చి వారిని తరింప చేయడానికి 63 నయన్నారులు సిద్ధమైనట్టు మనకు కనిపిస్తున్న అపూర్వమైన దృశ్యము. అలాగే పల్లకీలు వచ్చే మార్గాలలో భక్తులు పూలు చల్లుకుంటూ వెళ్తూ ఉంటారు. పంచమూర్తులు అయిన వేదనాయికి అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు, చండీకేశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, వల్లీ, దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రమణ్యేశ్వరుడు వీరితోపాటు శ్రీదేవి, భూదేవి సమేతుడైన ఆ కేశవ స్వామి కూడా పుష్ప అలంకారాలతో భక్తులకు అనుగ్రహించడానికి ఒంటరిగా ఊరిగుతారు. నయన్నారుల ఊరేగింపు సాగిపోతూ ఉంటుంది. ఊరేగింపు ముగించుకొని మళ్ళీ తిరిగి ఆలయానికి చేరుకుంటారు. సంగమేశ్వరుడికి జరిపించే ఉత్సవాలలో తమిళనాడు వారు మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా దర్శించుకుంటారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !