పళని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయము చరిత్ర....
శ్రీ సుబ్రమణ్య స్వామి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో పళని నాలుగోవది ఈ క్షేత్రము. ఈ క్షేత్రము తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామివారికి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మరియు మహా మహిమనవిత క్షేత్రాల్లో పళని ముందు వరుసలో ఉంటుంది.
ఈ ఆలయాన్ని కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండి రాజుల కాలములో ఈ మందిరము బాగా అభివృద్ధి చెందింది.
సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహని ఉన్న ఔషధ గుణాలు
భారతదేశములో ఏ దేవాలయము గుడిలో అయినా గర్భగుడిలోని మూల విరాట్ రాయి లోహము లేదా చెక్కతో చేయబడి ఉంటుంది. అయితే ప్రపంచములో ఒకే ఒక విగ్రహము మాత్రము నవ పాషాణాలు అంటే 9 విష పదార్థాలతో తయారు చేశారు. అయితే ఈ పదాతరాలల్లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు చెప్తారు. అందుకు నిదర్శనంగా కొన్ని సంఘటనలు ఇక్కడ పూజారిలు మనకు వివరిస్తారు. అది ఏంటంటే ఈ ఆలయములో స్వామివారి విగ్రహము తొడ భాగము నుంచి విభూదిని తీసి భక్తులకి ఇచ్చేవారు. ముఖ్యంగా కుష్టి రోగులు ఈ విభూతిని ప్రసాదంగా తీసుకోవడముతో పాటు పుండ్లపై విభూతిని రాసుకుంటే కుష్టి రోగము నయము అయ్యేదని చెప్తారు. ఆ విభూతి తీసి ఆ ప్రాంతములో విగ్రహము అరిగిపోయిన విషయము కూడా మనము గమనించవచ్చు. ఇది ఇలాగే జరిగితే విగ్రహము పూర్తిగా నశించిపోతుందని భావించిన పెద్దలు విగ్రహము నుంచి విభూదిని తీసి ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేశారు.
పళని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయము చరిత్ర
స్థల పురాణము ప్రకారము ప్రధమ గణాలకు అధిపతిగా వినాయకుడు విజయము అయినాక సుబ్రమణ్య స్వామి ప్రధమ గణాలకు అధిపతిగా జరిగిన పందెములో ఓడిపోయాను అని తెలుసుకొని కొంత అలక వేయించారు. సుబ్రమణ్యము స్వామి అలిగి ఇప్పుడు ఉన్న పళని క్షేత్ర పర్వత శిఖరము పైకి చేరుకొని ఒంటరిగా కూర్చొని ఉండిపోతారు. దీంతో ఆయన తల్లిదండ్రులు అయినా పార్వతీ పరమేశ్వరులు అక్కడికి చేరుకొని కుమారస్వామిని బుజ్జగించడము మొదలుపెడతారు. ఈ క్రమములో ఈ విశ్వములోని అన్ని జ్ఞానాలకు నీవే అధిపతివి అని చెప్తూ జ్ఞాన పళని అందచేస్తారు. అందువల్లే ఈ ప్రదేశము పళని అయింది. తమిళనాడులో ఫలం అంటే ఫలము, నీ అంటే నీవు అని అర్థము. ఈ రెండిటి కలబోతతో ఆ ప్రదేశానికి పళని అని పేరు వచ్చినట్లు చెప్తారు. అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జ్ఞానము పెరుగుతుందని కూడా శివుడు వరము ప్రసాదిస్తారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.
కావడి సాంప్రదాయము
ఇక సుబ్రమణ్య క్షేత్రాల్లో జరిగే కావడి ఉత్సవము ఇక్కడే మొదలైంది అని కూడా స్థల పురాణము చెబుతుంది. ఇందుకు కథనాలు ఏంటంటే దేవతలు, రాక్షసులకు జరిగిన యుద్ధములో చాలామంది రాక్షస రాజులు ప్రాణాలు కోల్పోతారు. ఈ క్రమములో ఇడుంబుడు అని ఓ రాక్షసుడు తన ప్రాణాలను కాపాడమని అగస్థ మహర్షి మహాముని కాళ్లు పట్టుకుంటాడు. సేరను వేడిన వారిని చంపడము భావ్యము కాదని భావించిన అగస్థ మహర్షి విషయాన్ని తన గురువైన సుబ్రమణ్య స్వామికి తెలుపుతారు. శరణు కోరిన వారిని చంపడము సరి కాదు. అదే సమయములో రాక్షస గుణాలు ఉన్న ఇతన్ని సంహారంచకుండా వదిలిపెట్టడము కూడా మంచిది కాదని భావిస్తారు. సుబ్రమణ్య స్వామి చివరకు ఇతనిలో ఉన్న రాక్షస గుణాలు తీసివేయాలని భావించి అగస్థ మహామునికి ఒక కిటుకు చెప్తారు. దీని ప్రకారము ఇడుంబుడు కైలాసానికి వెళ్లి శివగిరి, శక్తిగిరి అని రెండు పర్వతాలు కావడిలో భూమి మీదికి తీసుకొని వస్తారు. మార్గ మధ్యలో పళని ఉన్నచోటికి రావగానే బరువు ఎక్కువయ్యి కావడి కింద పెడతాడు. ఈ విషయాన్ని అక్కడే బాలుడి రూపములో ఉన్న కుమారస్వామి చూసి నవ్వుతారు. దీంతో ఆగ్రహము చెందినా ఇడుంబుడు ఆ కావడిని ముందు తిరిగి తన భుజాల మీద పెట్టుకొని ముందుకు కదలాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా కావడిలో ఒకవైపు ఎక్కువ బరువుగా మరొకవైపు తేలికగా మారిపోతూ ఉంటుంది. కుమారస్వామి మళ్లీ పక్కపక్క అంటూ నవ్వుతాడు. దీంతో కోపగించుకున్న ఆ రాక్షస రాజు పిల్లవాడిని చంపడానికి వెనక ముందు చూడకుండా ఆ పర్వత శిఖరము పైకి పరిగెడతాడు. అప్పుడు వారిద్దరికీ యుద్ధము జరుగుతుంది. చివరికి కుమారస్వామి దెబ్బకు ఆ రాక్షసుడు ప్రాణము పోగొట్టుకునే స్థితికి వస్తాడు. దీంతో తాను పోరాడేది మామూలు పిల్లవాడితో కాదు. సాక్షాత్తు అగస్థ మహామునికి గురువైన కుమారస్వామితో అని తెలుసుకొని బాధపడ్డమే కాకుండా తన తప్పుని మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు కుమారస్వామి చిన్నపిల్లవాడు నవ్వితే నవ్వాడు అని భావించి నీవు ముందుకు వెళ్లిపోయి ఉంటే నీకు క్షమాపణ గుణము ఉన్నట్టు. అలా కాకుండా బాలుడని కూడా చూడకుండా ఏకంగా చంపడానికి ప్రయత్నించావు అదే రాక్షస గుణము అని చెప్తారు. దీంతో బుద్ధి తెచ్చుకున్న ఆ రాక్షసుడు తన తప్పును మన్నించమని పడి పడి విధాలుగా వేడుకుంటాడు. దీంతో కుమారస్వామి ఇడుంబుడిని క్షమిస్తారు. స్వామి అంతేకాకుండా ఆ ఇడుంబుడి కోరికపై కావడితో నడుచుకుంటూ ఈ పర్వతము పైకి ఎక్కి ఎవరైతే నన్ను దర్శించుకుంటారో వారికి 1000 యజ్ఞయాగాలు చేసిన ఫలితము దక్కుతుందని వరము ఇస్తారు. అంతేకాకుండా, నీ వల్లనే కావడి సంప్రదాయము మొదలవుతున్నది కాబట్టి ఇకపై తాను కొలువై ఉన్న అన్ని క్షేత్రాలలో కూడా ఇడుంబుడికి కూడా స్థానము కల్పిస్తాను అని చెప్తారు. నా భక్తులు మొదట నిన్ను దర్శనము చేసుకున్న తర్వాతనే నన్ను పూజిస్తారు అని కూడా వరము ఇస్తారు. అప్పటినుంచి సుబ్రమణ్యస్వామి కొలువై ఉన్న అన్ని క్షేత్రాల్లో కావడి సాంప్రదాయము మొదలయ్యింది.