సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైన ఆలయము తిరుత్తణి

సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైన ఆలయము తిరుత్తణి


తిరుత్తణి తమిళనాడులో గల సుపరిశిద్ధ ప్రదేశము. ఇక్కడే కొలువైన దైవము సుబ్రమణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయము చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి, వల్లి, దేవసేన అమ్మవార్ల సమేతంగా కొలువై ఉన్నారు. సుబ్రమణ్య స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రము. తమిళలకి అందరికీ ఎంతో ఆరాధ్యమైన ఇష్టమైన దైవముగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామి వారు వెలసిన కొండకు ఇరుపక్కల అందు పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తర వైపు పర్వతము తెల్లగా ఉండడము వలన దీన్ని బియ్యపు కొండ అని పిలుస్తారు. దక్షిణము వైపు గల కొండా గాలిగాపిండి కొండగా పిలవడము జరుగుతుంది.

తిరుత్తణి చరిత్ర

ఇక సుబ్రమణ్య స్వామి దేవతల మునుల బాధలు పోగొట్టడానికి సురుపద్మన్ యుద్ధము చేసిన అనంతము వల్లి దేవసేనలను వివాహము చేసుకోవడానికి బోయవుల రాజుతో చేసిన యుద్ధము అనంతము శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు అని స్థల పురాణము ప్రకారము తెలుస్తున్నది. ఇక స్వామి శాంతించి ఇక్కడ కొలువైనాడు కనుక ఈ క్షేత్రానికి తణిగా లేదా శాంతి పూరి అని పేరు వచ్చింది. తణిగా అన్న పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థము. ఇక్కడ స్వామి వారు భక్తుల తప్పులను పాపాలను మన్నించి కరుణించి కటాషిస్తారు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు రావడము జరిగింది. ఈ సుబ్రమణ్య స్వామి వారి ఆలయము అతి పురాతమైనది. 1600 సంవత్సరాల పూర్వము నుంచే ఇక్కడ ఈ ఆలయము ఉన్నట్టు శాసనాల ద్వారా అర్థము అవుతున్నది. 

సుబ్రమణ్య స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుడిని పూజింప తలచి తిరుత్తణి కొండపై తన నివాసాన్ని ఈశాన్యము బాగాన శివలింగ ప్రతిష్ఠ చేసి సేవించారు. కుమారస్వామి యొక్క పితృభక్తికి మెచ్చిన ఆ పరమశివుడు సంతోషించి సుబ్రహ్మణ్య స్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించారు. ఈ కారణము చేత స్వామికి జ్ఞానశక్తి దరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అని పేరు రావడము జరిగింది. కుమారస్వామి శివుడిని అర్షించడానికి సృష్టించిన తీర్థమే కుమార తీర్థము. దీని శర్వాన తీర్థంహము అని కూడా అంటారు. 

స్థలంపురాణము

స్థలపురానము పరిశీలిస్తే త్రేతా యుగములో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహరము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ నుండి శ్రీరాముడు ఈ తిరుత్తణి క్షేత్రాని కూడా దర్శించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి మనశ్శాంతి కలిగింది. ద్వాపర యుగములో మహావీరుడు అయిన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనికేషన్ స్వామిని కొలిచారు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోనే సుబ్రమణ్య స్వామిని పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంకు చక్రాలను తిరిగి పొందారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ్ అర్థము చెప్పలేక పోవడము చేత ముద్దులొలికే సుబ్రమణ్య చేత బంధింపబడి ఆయన సృష్టిని చేసే సామర్థ్యము కోల్పోతారు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థములో కార్తికేయూని పూజించి ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందారు. దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్ర తీర్థములలో కరణ్ కువెల్ అని అరుదైన మొక్కని నాటి రోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పాలతో ఇక్కడ షణ్ముఖని పూజించేవారు. ఆ తర్వాతనే ఇంద్రుడు రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న మర్రి చింతామణిని దేవలోక ఐశ్వర్యాన్ని తిరిగి పొందారు. 

ఇక్కడ స్వామి వారు ఆకుపచ్చ రంగులో ఉండే షక్కోనా పథకము ధరించి మెల్ల మెల్లగా మెరిసిపోతూ ఉంటారు. బంగారు బిలువ పత్రమాలల మాలతో స్వామి వారిని అలంకరిస్తారు. 

చెన్నై నుండి 84 కిలోమీటర్ల దూరములో ఉంటుంది. తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరములో ఉంటుంది. ఇక కాణిపాకము నుండి ఈ ఆలయము కేవలము 13 కిలోమీటర్ల దూరములోనే ఉంటుంది. ఈ క్షేత్రము ఈ ప్రదేశాలు అన్నిటికి బస్సు సౌకర్యము ఉంటుంది. ఇక ఆర్టీసీ వారు తిరుపతి నుండి అనేక బస్సులు ఈ క్షేత్రానికి నడపడము జరుగుతుంది. ఈ కొండపైకి మనము మెట్ల మార్గము ద్వారాను మరియు బస్సు ద్వారా వెళ్ళవచ్చు. ఇక్కడ మొత్తము 365 మెట్లు ఉంటాయి. ఈ మెట్లని సంవత్సరానికి 365 రోజులకు ప్రతీకగా చెప్తారు. వీటికి పసుపు, కుంకుమలను అలంకరించినట్లయితే మనము ఆ స్వామిని మనము 365 రోజులు సేవించిన పుణ్యఫలము వస్తుందని అంటారు. ఇక్కడ మరీ ముఖ్యంగా సుబ్రమణ్య స్వామిని సంతానము భాగ్యము లేనివారు, ఆ స్వామిని ఆరాధించడము ద్వారా సంతాన భాగ్యము అనేది కలుగుతుంది. అంతేకాకుండా మరి ప్రత్యేకంగా ఇక్కడ చిన్నపిల్లలని మరియు అనారోగ్యముతో బాధపడే పిల్లలని ఈ ఆలయానికి తీసుకొని వచ్చి స్వామివారిని దర్శనము చేయిస్తారు. తెలివి తక్కువ తేటలు, అనారోగ్యాలు తొలగిపోతాయని ఎంతోమంది తమ పిల్లలకు ఈ ఆలయానికి తీసుకొని వచ్చి సుబ్రమణ్య స్వామి సన్నిధిలో ప్రత్యేకతవమైన పూజలు చేయించుకుంటూ ఉంటారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !