అయోధ్య పూర్తి కథ......

అయోధ్య పూర్తి కథ......

జై శ్రీరామ్ ఇది కేవలము ఒక పేరు కాదు. ప్రతి హిందువుని నడిపించే పవిత్ర మంత్రము. భారతదేశము అంటే రాముడు పుట్టిన పుణ్య ప్రదేశముగా మనము ఎన్నో పురాణాలు చదివాము. ఎన్నో కథల్లో రాముడి గొప్పతనము గురించి విన్నాము. రాముడు ఎదుర్కొన్న కష్టాలు గురించి విన్నాము. రాముడి జీవితమంతా కష్టాలే. తనదైన రాజ్యాన్ని వదులుకున్నారు. 14 ఏళ్ల పాటు వనవాసంలో ఎన్నో కష్టాన్ని ఎదుర్కొన్నారు. తన భార్య కోసము ధర్మ యుద్ధాన్ని చేసి, ధర్మాన్ని గెలిపించారు. ఆఖరికి తన కొడుకుల చేతిలో అవమానాలు పడ్డారు. ఇన్ని కష్టాలని ఎదుర్కొన్న శ్రీరాముడు ఎందుకు గొప్ప అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తన విలువలని, తన విధేయతని,తన వినయాన్ని కోల్పోలేదు. కాబట్టి ధర్మాన్ని కాపాడడము కోసము ఎంతటి కష్టాన్ని అయిన ఎదురుకున్నారు కాబట్టి తండ్రి మాటని శిరసా వహించాడు. తమ్ముడికి మార్గదర్శకంగా నిలిచారు. భార్య పట్ల అమితమైన ప్రేమ చూపించారు. స్నేహము కోసము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ధర్మో రక్షిత రక్షితహ అనే పదానికి నిలువెత్తు నిదర్శము. మన రామాయణము మరి అలాంటిది మన రాముడి చరిత్రని యుగయుగాలకి తెలిసేలా మన చరిత్రని దేశ దేశాల్లో గర్వంగా చెప్పుకునేలా నిర్మించే దేవాలయమే అయోధ్య రామ మందిరము. 

రాముడు పుట్టిన ఈ అఖండ భారతదేశములో అతనికి గుడి కట్టడానికి అది కూడా కేవలము 2.77 ఎకరాల స్థలము కోసము ఒక పెద్ద యుద్ధమే జరిగింది అని చెప్పుకోవచ్చు. సుమారుగా 500 సంవత్సరాలు పోరాటము, 73 ఉద్యమాలు, కోట్లాదిమంది హిందువుల చిరకాలి కోరిక ఈ అయోధ్య రామ మందిరము. 

అయోధ్య స్థలము కోసము గొడవలు

ఉత్తరప్రదేశ్ లో అయోధ్య అనే ప్రాంతాములో ఉంది. దీన్ని సాకేతపురము అని కూడా చెప్తారు. సాక్షాత్తు శ్రీరాముడి వారి పుట్టిన ప్రదేశము ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని కూడా దీన్ని దశరథ మహారాజు గారు పరిపాలించేవారు. అప్పుడు దశరథ మహారాజు పరిపాలనలో స్వర్ణ యుగముగా చెప్పుకునే ఈ ప్రదేశము కేవలము 2.77 ఎకరాలకు స్థలము కోసము మూడు వర్గాల మధ్య ఒక యుద్ధము జరిగింది. ఇది నిన్న, మనో జరిగింది కాదు. దాదాపుగా 500 ఏళ్లుగా జరుగుతూనే వచ్చింది. కానీ, స్వతంత్రము వచ్చిన తర్వాత ఇది మరింత ముదిరింది. ముందుగా ఈ 2.77 ఎకరాల స్థలములో ఒక మసీదు ఉంది. దాన్ని బాబ్రీ మసీదు అని కూడా అంటారు. మసీదు ఎదురుగా లెఫ్ట్ కార్నర్ లో ఒక్క ఎత్తుగా ప్లాట్ఫారము లాగా ఉంటుంది. దీని పేరు రామ్ చెబుత్ర. ఇక్కడే శ్రీరాముల వారికి పూజలు జరిగేవి. అసలు ఏమి జరిగిందో తెలుసుకునే ముందు ఈ ల్యాండ్ కోసము ఎవరెవరు గొడవ పడ్డారో తెలుసుకోవాలి. కొందరు చెప్పేది ఏంటంటే 2.77 ఎకరాల స్థలములో ఒక మసీదు ఉంది. దాన్ని బాబ్రీత్ మసీదు అని కూడా అనేవారు. 1528లో అప్పటి మొగల్ రాజు అయినా బాబర్ ఇక్కడ మసీదు కట్టించారు. ఇప్పటికీ ఈ స్థానము వాళ్ల సొంతము అనేవారు. మరికొందరు ఏమి చెప్పేవారంటే విశ్వహిందూ పరిషత్ కి ఈ సంస్థ వాళ్లు, వీళ్ళు చెప్పేది ఏంటంటే రామాయణము ప్రకారము రాముడు అయోధ్యలో జన్మించారు. మరి పూర్వీకులైన ఆయుధూ అనే రాజు ఒకప్పుడు ఈ నగరాన్ని పరిపాలించారు. కాబట్టి దీనికి అయోధ్య అని పేరు వచ్చింది. రాముడు వారి జన్మభూమి అయిన అయోధ్యలో బాబ్రీ మసీదు కింద రాముల వారి గుడి ఉందని మొగళ్ళు మనల్ని పరిపాలించిన సమయములో గుడిని పగలగొట్టి ఇక్కడ మసీదుని కట్టారని, ఇది ఒక్క అక్రమ కట్టడము అని ఈ ల్యాండ్ మాకే సొంతమని ప్రశ్నించేవారు. మరి కొందరు ఇలా అనేవారు వీళ్ళ కథనము ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు శ్రీరాముడికి పూజలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ఏళ్ల నుండి ఇక్కడే బతుకుతున్నారు. శ్రీరాముడికి గుడి కట్టి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్లకి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అది 1528 మొగల్ రాజు బాబర్ మసీదు కట్టమన్నాడు. కాబట్టి దీనికి బాబ్రీ అని పేరు వచ్చింది. ఇదే ప్రభుత్వము పత్రాల్లో కూడా ఉంది. అయితే రాముల వారి గుడి పగలగొట్టి మసీదు కట్టినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కానీ, అప్పట్లో మొగల్ రాజులు చాలా హిందువుల మందిరాలను పడగొట్టి మసీదులు కట్టించారని సంగతి మన అందరికీ తెలిసినదే. ఈ మసీదు కూడా అలానే కట్టారని చుట్టుపక్కల ప్రజలు అనుకునేవారు. అది 1717 అప్పుడు హిందువు రాజు ఆయన జై సింగ్ 2.77 ల్యాండ్ ని కొనేసి శ్రీరాముల వారి పేరుమీద ఈ రిజిస్ట్రేషన్ చేయించారు. చుట్టూ ఉన్నవాళ్లు అది రాముల వారి జన్మస్థలము అని నమ్మడముతో అక్కడ పూజలు చేయడము మొదలుపెట్టారు. ఇలా అప్పటినుంచి పది మార్లు ముస్లిమ్లు, హిందువులు గొడవలు జరగడము మొదలయ్యాయి. హిందువులు ఈ ల్యాండ్ తమకే సొంతమని అక్కడ రామ మందిరము కట్టాలని ప్రభుత్వాన్ని కలిసారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము దానికి ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ఈ గొడవలు రాకూడదని ఉద్దేశ్యముతో ఈ స్థలము చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందులోనే ఒక చెక్క ప్లాట్ఫారము పెట్టారు. ఇదే మనము ముందు చెప్పుకున్న రామ్ చెబుత్ర. అప్పటినుంచి ఇక్కడ రాములవారికి పూజలు జరిగేవి. అది 1949 చాలామంది హిందువులు మసీదులోకి వెళ్లి సీతారాముల విగ్రహాలను పెట్టారు. అంతే కాకుండా అవి అక్కడ విగ్రహాలు వెలిసాయని నమ్మించి ప్రయత్నము చేశారు. అవి నిజము కాదని అవి ఎవరో పెట్టిన విగ్రహాలు అని పరిశోధనలో తేలింది. అప్పటినుంచి ముస్లిమ్స్, హిందువులు వారిద్దరి గొడవల మధ్య ఆ స్థలని మూసివేశారు. అప్పటినుంచి ఇక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. దాంతో సీతారాముల విగ్రహాలు మసీదులోనే ఉండిపోయాయి. అప్పటినుంచి ఈ ల్యాండ్ ఓనర్ షిప్ కోసము మూడు వగ్రాల వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. 1980 నుంచి విశ్వహిందూ పరిషత్ వాళ్లు ఇక్కడ రాముడి గుడి కట్టాలని ఆందోళన చేపట్టారు. దానికి బిజెపి అండగా నిలిచింది. 1986లో ఇదే విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కోర్టులోకి వెళ్లి గుడిలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కేసు వేశారు. దానికి కోర్టు ఒప్పుకునింది. దాదాపుగా 36 సంవత్సరాలు తర్వాత అక్కడ ప్రార్ధనలు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడ గుడి కట్టాలని ఆందోళన దేశవ్యాప్తంగా తీసుకొని వెళ్లాలని బిజెపి నిర్ణయము తీసుకునింది. దీనికోసము రథయాత్ర చేపట్టారు. ఇందులో కీలక పాత్ర వహించింది అద్వానీ గారు. దేశవ్యాప్తంగా ర్యాలీలని నిర్వహించి హిందువులని అందరినీ ఐక్యము చేశారు. అది 1992 డిసెంబర్ 6వ తేదీన ఈ 2.77 ఎకరాల స్థలము దగ్గర అద్వానీ గారు ఒక భారీ సభ నిర్వర్తించారు. సభ అనంతరము అక్కడికి చేరిన హిందువులు అందరూ కలిసి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ బాబ్రీ మసీదుని కూల్చివేత చేశారు. అక్కడ రాముల వారి విగ్రహాన్ని పెట్టారు. ఆఖరికి ఆ జన సమూహాన్ని చూసిన పోలీసులు కూడా ఏమి చేయలేక ఉండిపోయారు. ఈ చర్య వల్ల దేశ నలుమూలలలో ముస్లిమ్లు మరియు హిందువులు మధ్య గొడవలు జరిగాయి. దాదాపు ఎన్నో వేల మంది గొడవలలో మరణించారు. ముస్లిమ్లకి హిందూవులకు మధ్య దేశవ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వచ్చాయి. అది 2002 ఇది స్థలము ఎవరిది అని తేల్చేందుకు మూడు వర్గాల వాళ్లు హైకోర్టులో వారి వాదనలు వినిపించడము మొదలుపెట్టారు. దాంతో ఈ స్థలములో మసీద్ కి ముందు నుంచి రాముడు వారి ఆనవాళ్లు ఉన్నాయా లేదా అని తేల్చేందుకు ఒక కమిటీని వేశారు. పురాతన పరిశోధకులు సర్వే నిర్వర్తించగా తెలిసింది ఏంటంటే ఇక్కడ రాములు వారి ఆలయ ఆనవాళ్లు కనిపించాయి. మసీదు కట్టడానికి ఉపయోగించిన పిల్లర్లు దాదాపు 12 పిల్లర్స్ 11, 12 సెంచరీస్ లో పిల్లర్స్ గా తేలింది. దాంతో 2010లో అలహబాదులో  హైకోర్టు ముగ్గురికి సమాన హక్కు ఉందని తీర్పుని ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ నచ్చని మూడు వర్గాల వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ ఎవరిదో తేల్చేందుకు పురాతక సర్వే చేసే వాళ్ళని రంగంలోకి దింపింది. సర్వేలో క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఇది రాముల వారి మందిరము పైనే కట్టారు. అంతేకాదు ల్యాండ్ పేపర్స్ శ్రీరాములు వారి పేరు మీద రిజిస్టర్ అయినట్లు పేపర్స్ ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు 2019 నవంబర్ 6వ తేదీన ఈ 2.77 ఎకరాల స్థలములో రాముల వారి గుడి కట్టేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునే మసీదును అన్యాయంగా భావించిన సుప్రీంకోర్టు అయోధ్యలో వేరే చోట వీళ్ళకి 5 ఎకరాల స్థలము కేటాయించాలని గవర్నమెంట్ కి ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ తీర్పుని మూడు వర్గాల వాళ్ళు అంగీకరించారు. అలా ఈ 2.77 ఎకరాల స్థలము కోసము జరిగిన ఈ యుద్ధములో శ్రీరామచంద్రుడికి న్యాయము జరిగింది. చివరికి అతను నమ్మిన ధర్మమే అతన్ని గెలిపించింది. రామాలయము ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ గుడి కట్టేందుకు మరో 100 ఎకరాలు స్థలము కొన్నారు. అలా 2020 ఆగస్టు 5వ తేదీన మన ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని కోట్ల మంది హిందువుల చిరకాల కోరిక అయినా అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !