శ్రీ గండి వీరాంజనేయ క్షేత్రము చరిత్ర....
రాముడు గోటితో గీసిన ఆంజనేయుల స్వామి వారు ఎక్కడ ఉన్నారు అంటే త్రేతా యుగములో దశరథ నందుడైన శ్రీరామచంద్రమూర్తి వనవాస కాలములో తన సొంత చేతులతో తన బాణపు కొనతో గీసిన ఆంజనేయ స్వామియే నేడు గండి ఆంజనేయుడిగా పూజలు అందుకుంటున్నారు. కడప జిల్లాలోని రాయచోటి వేంపల్లి మార్గమధ్యలో పాపగ్ని నది తీరాన గండి క్షేత్రము వెలసింది. పాపగ్ని నది ఇక్కడ శేషాచలము కొండలను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఆంజనేయ స్వామి పవిత్ర క్షేత్రాలు చాలా ఉన్నయి. వాటిలో గండి క్షేత్రము అత్యంత పురాణ ఆలయము అయినది. భక్తుల పాపాలను అరించి వేసే పాపగ్ని నది సమీపంలో ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారి కోరికలు వెంటనే నెవేరుతాయని భక్తుల విశ్వాసము.
పాపగ్ని నది పురాణ కథ
పాపగ్ని నదికి పురాణ కథ ఒకటి ప్రచారములో ఉంది. పూర్వము వేటకు వచ్చిన ఒక రాజు యొక్క బాణానికి చెంచు తెగకు చెందిన ఒక వ్యక్తి మరణించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని నానుడి నిర్ణయము ప్రకారము ఆ రాజు కుష్టి రోగి అయ్యారు. ఆ రోగము నుంచి విముక్తి కోసము ఆ రాజు ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అయినప్పటికీ అతను రోగ విముక్తిడిగా కాలేదు. అతడి అంతరాత్మ చెప్పినట్టు గండి క్షేత్రానికి వచ్చి పాపగ్ని నదిలోకి వచ్చి స్నానము చేయగానే అతడు రోగ విముక్తుడు అయ్యారు. పాపగ్ని నది కొండల్లో పుట్టి కడప చిత్తూరు అనంతపురం జిల్లాల మీదగా ప్రవహించి రాయచోటి తాలూకాలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ నది పెన్నాగ్నిలో కలుస్తుంది. పెన్నాగ్నిని ఇప్పుడు పెన్నా నదిగా పిలుస్తున్నారు. పాపగ్ని నది కుడి ఒడ్డున వీర ఆంజనేయ స్వామి ప్రతిష్టుడు అయ్యి ఉన్నారు.
శ్రీ రాముడు చెక్కిన ఆంజనేయ స్వామీవారి విగ్రహము
రామాయణ కాలములో వాయు దేవుడు ఇక్కడ తపస్సు చేశారు. శ్రీరాముడు సీత కోసము వెతుకుతు ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయనకు వాయు దేవుడు ప్రణమిల్లి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరారు. సీత ను తీసుకొని అయోధ్యకి తిరిగి వెళ్లేటప్పుడు వస్తాను అని శ్రీరాముడు వాయుదేవుడికి మాట ఇచ్చారు. శ్రీరాముడు తన పరివారముతో తిరిగి వస్తున్నాడు అన్న వార్తని భరతుడికి తెలియచేయడము కోసము ఆంజనేయుడు వెళ్లారు. లంకలో రావణ సంహారము అనంతరము శ్రీరాముడి వానర సేనతో కలిసి ఇచ్చిన మాట ప్రకారము ఈ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్న వాయుదేవుడు రెండుగా చీల్చి నదికి దారిని ఇస్తూ ఆకాశము అంత ఎత్తున కనిపిస్తున్న దివ్య కాంతులు వెదజల్లుతున్న కొండ శిఖరాలను చూసి నానా రత్నము మణిఘనకచితము దివ్యమైన స్వర్ణ తోరణము రెండు కొండల శిఖరాలను కలుపుతూ శ్రీరామ పరివారానికి స్వాగత సూచనంగా కట్టారు. ధర్మ స్వరూపుడు, సత్య వాక్కు పరిపాలక దక్షుడు, రావణ కుంభకర్ణ దుష్ట రాక్షస నిర్మూలన దురంద్రుడు, మహావీరుడు, దశరథ తనయుడు అయిన రాముడు ఈ గండి ప్రాంతము లో బస చేశారు. ఆ సమయములో హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపై ఆంజనేయుడి ఆకారాన్ని తన బాణముతో గీశారు అంట. తిరిగి వెళ్లే హడావిడిలో శ్రీరాముడు ఆంజనేయుడి రూపాన్ని అంతా గీసిన ఎడమ చేయి చిటికెన వేలుని మాత్రము గీయకపోవడంతో అది అసంపూర్తిగా మిగిలిపోయింది. మరల ప్రయత్నించిన అప్పుడు రక్తము రావడము జరిగింది. ఈ ఒక్క సంఘటన వాయు పురాణము అందున గమనించవచ్చు. దీనిని బట్టి స్వామివారు సజీవ మూర్తిగా కొలువైనట్టు తెలుస్తున్నది. అలా పరమ పురుషుడైన శ్రీ రాముడి చేతితో చిత్రింపబడి ప్రకృతి స్వరూపము అయిన సీతమ్మ చేతితో జీవము పొయ్యబడిన హనుమన్ రూపము శ్రీ వీర ఆంజనేయ స్వామిగా గండి క్షేత్రము లో నెలకొని నేటికీ భక్తులతో పూజలు అందుకుంటున్నారు.
గండి ఆంజనేయ స్వామివారి దర్శనముతో మాత్రమే సమస్త దోషాలు తొలగి సర్వ శుభాలు కలుగుతాయని అని అంటారు. ఆంజనేయ స్వామి పాదాలను అభిషేకిస్తూ ప్రజల పాపాలను పోగొట్టే పాపాన్ని హరించి వేసే పాపగ్ని అని సాధక నామధేయముతో అ నదీమ తల్లి గౌరవించబడుతున్నది.
వాయుదేవుడు నిర్మించిన తోరణము
సీత శ్రీరామచంద్రులకు లక్ష్మణ, సుగ్రీవ, వానర సైనికుల వీరులకు స్వాగతము పలుకుతూ వాయుదేవుడు నిర్మించిన ఆకాశ తోరణము అదృశ్య రూపము లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని తపోదనుడు జీవన్ముక్తులు అయిన మహా జ్ఞానులకు భక్తితో కొలిచిన వారికి మాత్రమే ఆ తోరణము కనిపిస్తుంది అని ఆ తోరణాన్ని దర్శించిన వారు జన్మంతరంలో శాశ్వత విష్ణు సాహిత్యము పొందుతారని సీతా రాముడు దీవించారు. ఇలా సీతారాముడి చేత గండి క్షేత్రము లో చిత్ర హనుమాన్ ఉభవము సర్వ మంగళంగా జరిగింది. రెండు కొండల మధ్య ఉన్న ఆ తోరణము 1914లో అప్పటి కడప జిల్లా కలెక్టర్ సార్ థామస్ కి కనిపించినట్టు కడప జిల్లా గురించి మద్రాసు ప్రభుత్వము ప్రచురించిన గ్రాజెట్ పేరు కొనింది.
వసంతాచార్యులు గండి ఆంజనేయులు స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. వసంతాచార్యుల పట్ల గౌరవ సూచనగా కడప మద్వా సంఘము వాళ్లు గండి ఆలయంలోని ప్రధాన హాలులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయములో ఆంజనేయ స్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని వసంత చార్యుల వారికి కూడా నివేదన చేయడము ఇప్పటికీ సంప్రదాయంగా సాగుతున్నది.
గండి ఆంజనేయ స్వామివారి మూర్తి తేజోమయము అయింది. సూర్య భగవానుడి సదృశ్యంగా ఆయన నేత్రాలు అత్యంత ప్రకాశవంతంగా ధార్మిక కిరణాలు సోకిన చందంగా ఉంటాయి. ఇక్కడ ఆంజనేయుడి రూపము అభయ హస్తముతో ఉంటుంది. తనని భక్తితో కొలిచిన వారికి అభయము ఇవ్వడమే కాకుండా ఆయన వారిని రుజుమార్గములో నడిపిస్తారని తరతరాలుగా భక్తుల నమ్మకము. ఆంజనేయుల స్వామివారి ఆలయము కడప జిల్లా చక్రాయు పేట మండలములో నెలకొని ఉంది. ఈ ఆలయము నెలకొన్న గ్రామము వీరన్న గట్టుపల్లి అయినప్పటికీ గండి క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది.