మహాకాళేశ్వర ఆలయము గురించి ఆసక్తికరమైన విషయాలు....
మన భూమి మీద అత్యంత శక్తివంతమైన 12 లింగాలు ఉన్నాయి. మనకు ఈ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలని తెలుసు. ఈ 12 జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతి లింగమే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగము. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఉజ్జయినిలో ఉంది. సాధారణంగా కాలానికి రెండు అర్ధాలు ఉంటాయి. ఒకటి సమయము, రెండవది మృత్యు. కాలాన్ని మహాకాల్ అని కూడా అంటారు. ఎందుకంటే కాలాన్ని బట్టి విశ్వాన్ని నిర్దారించవచ్చు. అందుకని జ్యోతిర్లింగాన్ని మహాకాళేశ్వరుడు అని అంటారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయినప్పటికీ మిగతా అన్ని జ్యోతిర్లింగాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది.
ఈ మహాకాళేశ్వర జ్యోతి లింగము ఎంతో అంతు చిక్కని రహస్యాలతో మరియు ఆశ్చర్యపరిచే విషయాలతో కలిగి ఉంటుంది. ఇక్కడ శివలింగానికి ఆరోజు చనిపోయి దహన సంస్కారాలు జరిగిన ఒక మనిషి ఒక చిత్త బాస్మముతో అభిషేకము చేస్తారు. ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఇక్కడ ఎన్నో ఆశ్చర్యపరిచే ఘటనలు చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రజలు మరియు భక్తులు ప్రాచీన భారతదేశంలో ఉజ్జయిని అవంతిక లేదా అవంతి అని పిలిచేవారు. ఇక్కడ స్వామి వారు మహాకాళేశ్వరుడిగా మరియు అమ్మవారు మహంకాళిగా ఆవిర్భవించారు. ఈ ఉజ్జయిని క్షేత్రము ద్వాదశ జ్యోతి లింగాలలో ఒకటిగానే కాకుండా ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది సప్త మోక్ష నగరాలలో ఒకటి. ఇక్కడ ఆలయములో ఉన్న పరమేశ్వరుడు స్వయంభుగా వెలిశారు.
స్వయంభువుగా వెలసిన మహాకాళేశ్వరుడు
పూర్వము రాజా చంద్రసేనుడు ఉజ్జయిని పరిపాలించేవారు. చంద్రసేనుడు శివుని భక్తుడు. ఒకసారి ఉజ్జయిని శత్రు రాజ్యాలు దూషణ్ అనే రాక్షసుడితో కలిసి ఉజ్జయిని పై యుద్ధానికి దిగాయి. దూషణుడికి బ్రహ్మ ద్వారా ఒక వరము పొందారు. అది ఏమిటంటే దూషణుడు దాడి చేసేటప్పుడు ఎవ్వరికీ కనిపించాడు. ఇక్కడ దూషణుడిని ఎవరు ఓడించలేకపోతున్నారు. సైనికులు అందరూ దూషణుడిని చేతిలో చనిపోతున్నారు. చంద్రసేనుడు కూడా గెలవలేక పోతున్నారు. ఇక చివరికి చంద్రసేనుడు మరియు ప్రజలందరూ శివుడిని ప్రార్థించాక శివుడు మహాకాళేశ్వరుడి రూపములో వచ్చి దూషణుడిని సంహరించి దూషణుడిని బూడిదను ఒంటిపైన పూసుకున్నారు. చివరికి భక్తులు శివుడిని ప్రార్థించగా శివుడు అక్కడే మహాకాళేశ్వరుడిగా వెలిశాడని అందరూ చెప్తూ ఉంటారు.
మహాకాళేశ్వర ఆలయములో ఉన్న మూడు అంతస్తులు
ఇక్కడ మహాకాళేశ్వర ఆలయము మూడు అంతస్తులుగా ఉంటుంది. ఈ మూడు అంతస్తులో మనకు మూడు లింగాలు దర్శనము ఇస్తాయి. మొదటి అంతస్తులు మహాకాళేశ్వర లింగము, రెండవ అంతస్తులు ఓంకార లింగము, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగము ఉంటుంది. వీటిలో నాగచంద్రేశ్వర ఆలయాన్ని సంవత్సరానికి ఒకసారి అంటే నాగ పంచమి నాడు మాత్రమే తెరుస్తారు. ఇక్కడ నాగరాజు తక్షకుడుగా ఇక్కడే ఉంటారని పురాణ కథనాలు చెప్తున్నాయి.
ఈ ఆలయములో ఆశ్చర్యపరిచే విషయము ఏమిటంటే అని జ్యోతిర్లింగాలలో కేవలము ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మాత్రమే దక్షిణము వైపు ఉంటుంది. అందుకే మహాకాళేశ్వర మూర్తిని దక్షిణ మూర్తి అని కూడా పిలుస్తారు.
దేవాలయము గర్భగుడిలో గణపతి, పార్వతి మరియు కార్తికేయ విగ్రహాలు పశ్చిమ ఉత్తరాన మరియు తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగములో నంది విగ్రహము ఉంటుంది.
ఈ ఆలయములో ఉన్న మరో విశేషము ఏమిటంటే ప్రసాదము సాధారణంగా ఎక్కడైనా దేవుడికి పెట్టిన ప్రసాదము మరో దేవుడికి పెట్టరు. కానీ, ఈ ఆలయములోని ప్రసాదము ఏ దేవుడికైనా పెట్టవచ్చు.
ఈ ఆలయము లోని మహాకాళేశ్వర లింగము కింద శంఖ యంత్రము అని ఒక ఆశ్చర్యపరిచే యంత్రము ఉందని మరియు ఆ యంత్రము లో అంతులేని శక్తి దాగి ఉందని ఇక్కడి వారు అంటూ ఉంటారు. అందుకే శివ అర్చన సమయము లో శంఖాన్ని ఊదుతూ ఉంటారు.
ఇంకా చరిత్రలో నిలిచిన మహారాజు ఒక గొప్ప వ్యక్తి అయ్యిన విక్రమ్ ఆదిత్య, మహాకవి కాళిదాసు వంటి గొప్ప మహానుభావులు ఇక్కడ నుంచి వచ్చిన వారే. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సన్నీ మహర్షి ఆశ్రమము కూడా ఇక్కడనే ఉంది.
సిప్రా నది
ఇంకా సిప్రా నది కూడా ఇక్కడే ఉంది. సిప్రా నది ఇది అమృతము తో సమానము. క్షీరసాగరము మదన సమయములో దేవతలు, అసురులు అమృతము కలశము కోసము పోటీ పడగా నాలుగు అమృత బృందాలు నేల మీద పడ్డాయి. వాటిలో ఒక బృంద పడిన ప్రదేశమే ఈ సిప్రా నది. అలా ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. ఈ మహా కుంభమేళ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు.
ఉన్నత అధికారులు వంటి వారు ఎవరైనా ఉజ్జయినికి వస్తే ఆరోజు రాత్రి ఇక్కడ బస చెయ్యరు
ఇక్కడ ఉజ్జయినికి క్షేత్రానికి మహాకాళేశ్వరుడు కేవలము దైవము మాత్రమే కాదు మహారాజు కూడా. అందుకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఉన్నత అధికారులు వంటి వారు ఎవరైనా ఉజ్జయినికి వస్తే ఆరోజు రాత్రి ఇక్కడ బస చెయ్యరు. ఎంతటి వారు అయినా కూడా వచ్చిన వారు వచ్చినట్లు దర్శనము చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ వారు రాత్రి నిద్రపోవాలిసి వస్తే వారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఒకసారి మన దేశ నాలుగవ ప్రధాని ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత రాత్రి ఇక్కడే ఉన్నారు. కానీ, తర్వాత రోజు వారి ప్రభుత్వము పడిపోయింది. అలాగే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉజ్జయినికి వచ్చినప్పుడు రాత్రి ఇక్కడే ఉండిపోయారు. కానీ, తర్వాత మూడు రోజుల్లో కొన్ని కారణాలవల్ల తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొంతమంది దీనిని అనుకోకుండా ఆలా జరిగాయి అని అంటారు. కానీ, మరి కొంతమంది మాత్రము ఉజ్జయినికి మహాకాళేశ్వరుడే రాజు అని మరియు ఆయన తప్ప ఇంక ఏ రాజు, మంత్రులు ఇక్కడ ఉండకూడదని అంటారు.
మహా కాలేశ్వరునికి ఇచ్చే భస్మహారతి:
ఈ ఆలయములో ఒక విచిత్రమైన మందిరము ఉంది. అది భస్మ మందిరము. ఇందులోనే భస్మముతో హారతి ఇస్తారు. ఇక్కడ జరిగే భస్మహారతి కార్యక్రమము చాలా ప్రత్యేకత్వమైనది. ఉజ్జయినిలో ఆరోజు చనిపోయి దహన సంస్కారాలు జరిగే ఒక హిందు యొక్క చితా బస్మాని అభిషేకము కోసము సేకరిస్తారు. ఆ రాత్రి చితా భస్మని మూటలో కట్టుకొని స్మశానము నుండి తెల్లవారుజామున ఒక అగోర బాబా మహాకాళేశ్వర కోవెలకు తీసుకొని వస్తారు. అగోర బాబా చిత బస్వాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు అని అంటారు. ఆలయానికి సంబంధించిన ఏడుగురు పూజారిలు చిత్త భస్వాముతో శివలింగానికి అభిషేకము చేస్తారు. ఆ చిత్త బస్మాని ఒక గుడ్డ మూటలో ఉంచి దాని నుంచి ధూళిగా రాలుతున్న ఆ బూడిదతో శివుడికి అభిషేకము చేస్తారు. ఈ అభిషేకాన్ని మగవాళ్లు దూరము నుండి చూడవచ్చు. మహిళలు ఆ సమయము లో ఆ గంటల శబ్దాలను, మంత్రాలను వినచ్చు. కానీ, భస్మ హరతిని మాత్రము చూడకూడదు అని అంటారు. వెనకాల గంటలు మొగుతున్న శబ్దాలు, మంత్రాలు చదువుతున్న స్వరాలతో కలగలిసి వినిపిస్తాయి. ఆ వాతావరణము అంతా అగస్మాత్తుగా మారిపోతాది. మనసులో శివనామము మారు మోగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న భస్మాధూళి అక్కడ అంతా పరుచుకొని గర్భగుడి మొత్తము ధూళితో నిండిపోతుంది. గంటల శబ్దాలు, మంత్ర ఘోష దట్టంగా పరుచుకున్న భస్మాధూళి ఎదురుగా పరమశివుడు సాక్షాత్తు కైలాసములో ఉన్నామా అని అనుభూతి కలుగుతుంది. అందుకే భస్మ హారతి ఈ భూ ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదు. ఈ భస్మ హరతి అక్కడ ప్రతిరోజు చేస్తారు. కానీ, ఒకప్పుడు స్మశానములో ఏ శేవము లేకపోవడము కారణము వలన పూజారి తన సొంత కొడుకుని బలి ఇచ్చి అతని చితా భస్వాముతో హారతి ఇచ్చారు. అప్పుడు మహా కాలేశ్వరుడు చాలా సంతోషించి తన కొడుకుకి మళ్ళీ ప్రాణదానము చేసి ఏం చెప్పాడంటే ఇప్పటినుంచి ఆవు పేడను పిడకలుగా చేసి వాటిని కాల్చగా వచ్చిన భస్వాముతో నా హారతి జరుగుతుందని చెప్పారు. ఇంకా అప్పటినుంచి ఆవు పేడలను పిడకలుగా చేసి వాటిని కాల్చగా వచ్చిన భస్వాముతో హారతి ఇస్తున్నారు.