వైష్ణోదేవి ఆలయ చరిత్ర

వైష్ణోదేవి ఆలయ చరిత్ర



కోరిన కోరికలు తీర్చే వైష్ణోదేవి ముగ్గురు అమ్మలను మూర్తిభవించిన దేవిగా తనని దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే జగత్ జననిగా జమ్మూ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్థము భక్తులు ఎక్కడి ఎక్కడి నుంచో వస్తు ఉంటారు. సంవత్సరము పొడవునా అశేష సంఖ్యలో దేవిని దర్శించుకుంటారు. వైష్ణోదేవి మహిమకు నిదర్శనము ఆ దేవిని దర్శించిన వారు ఎవరు తమ న్యాయమైన కోరికలు తీరకుండా ఒట్టి చేతులతో వెనక్కి తిరగి వెళ్లారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గృహలో వెలిసిన వైష్ణోదేవి భక్తులు కోరుకున్న న్యాయమైన కోరికలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయము ఎన్ని ఏళ్ల కాలము నాటిదో ఆధారాలు లేవు. కానీ, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారము ఈ ఆలయము ఉన్న గృహ ఒక బిలియన్ సంవత్సరాల పూర్వము నుంచి ఉన్నదని కనుక్కున్నారు. ప్రధానంగా పాండవుల కాలంలోనే శక్తి పూజలు ప్రారంభము అయ్యాయి. వారు ఈ ప్రాంతంలో దేవి ఆలయాని నిర్మించారని కొన్ని పురాణాలలో ఉన్నాయి. ఉత్తరాన వారి కొంగు బంగారము అయ్యి వెలిసే ఈ దేవి దక్షిణాదిలో అంత ఎక్కువగా కనపడదని చెప్పాలి. అందుకే ఇక్కడి వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపము అని కొందరు పార్వతీ స్వరూపము అని మరికొందరు చెప్తారు. నిజానికి మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ఈ ముగ్గురి తేజోమయమైన స్వరూపమే ఈ తల్లి.

వైష్ణోదేవి కథ

పూర్వము జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్వి నుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్బ చేయాలని అనుకున్నారు. వారి సంకల్పము చేత అక్కడ ఓ అందమైన యువతి ప్రత్యక్షము అయింది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణ కోసము రత్నాకర్ సాగర్ అనే ఆయనకు పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మ కార్యాలు చేయమని ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యము చెందుతావని చెప్తారు. ఆ మహా శక్తులు ఆదేశము ప్రకారంగా రత్నాకర్ సాగర్ ఇంటిలో జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణము చేయడము జరిగింది. వైష్ణవి చిన్నతనము నుంచే జ్ఞానము ఉపాధ్యాయంలో లీనము అయ్యింది. ఏ గురువులు ఆమె జ్ఞాన ప్రశ్నను తీర్చలేక పోయారు. జ్ఞానము ఉపాధ్యాయంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపనతో వైష్ణవి అంతర్ముఖి అయ్యి చేసిన అన్వేషణలో జ్ఞానము విలువ తెలుస్తుంది. తపస్సుతో జీవన మార్గాన్ని సాధించగలను అని అనుకోని ఇల్లు వదిలి అడవులకు వెళ్లి తపస్సు చేయ సాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చారు. వైష్ణవి శ్రీరామచంద్రుడిని ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో ఐక్యము చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి ఇది తగిన సమయము కాదని తన అరణ్యవాసము తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరికి వస్తాను అని ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యము చేసుకుంటానని తెలిపారు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసములో రావణుడిని వధించిన తర్వాత అయోధ్యకి తిరిగి వెళుతూ ఆమె దగ్గరకు బుద్ధుడి రూపములో వచ్చారు. కానీ, ఆ సమయములో వైష్ణవి ఆయనను గుర్తించలేక పోతుంది. అందుకని భగవంతుడి లో ఐక్యము అయ్యే ఆమె కోరిక బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యము అవ్వడానికి తగిన సమయము ఇంకా రాలేదని కలియుగంలో తాను కల్కి అవతారము ధరిస్తాను అని అప్పుడు ఆమె కోరిక నెరావేరుతుందని ధైర్యము చెప్పారు. తర్వాత వైష్ణోదేవి త్రికూట పర్వత స్థానలలో ఆశ్రమము నెలకొల్పుకొని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అవరోరించమని ప్రజల మను ఇష్టాలను నెవేర్చమని పేద బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించారు. శ్రీరామచంద్రుడి ఆజ్ఞ అనుసారము వైష్ణవి త్రికూట పర్వత స్థానంలో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తన తపస్సుని కొనసాగించింది. అనంతకాలంలోనే ఆవిడ శక్తి గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసము రాసాగారు. కొంతకాలము తర్వాత కోరక్ నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరాముడు ఆదేశించిన ప్రకారము ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అదిరోదించిందో లేదో తెలుసుకోవాలని కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్ధుడు అయినా శిష్యుడు బైరవ నాథుడిని పంపారు. భైరవనాధుడు చాటుగా వైష్ణవిని గమనించారు. తపస్విని అయినా వైష్ణవిని ఎల్లప్పుడూ ధనుర్ బాణాలు ధరించి ఉండడము ఆవిడకి రక్షణగా ఒక భయంకర సింహము ఉండడము గమనించాడు భైరవనాజుడు. వైష్ణవి అందానికి ముద్దాడయ్యి తనని వివాహము చేసుకోమని ఆమెని విసిగించసాగారు. వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒక్కసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరక్ నాథ్ ని భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులు అందరిని భోజనానికి ఆహ్వానించారు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రయత్నించారు. వైష్ణవి మందలిచ్చిన వినలేదు. వివాదము పెద్దది చేసి భైరవుడిని శిక్షించడము ఇష్టము లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్ళిపోతుంది. తన తపస్సుని కొనసాగించడానికి భైరవుడు ఆమని వదలకుండా వెంటాడుతాడు. బానగంగ చరణపాదుక అదెక్ వారి అని ప్రత్యూషము పిలవబడుతున్న ప్రదేశాలలో త్రికూట పర్వతంలోని ఈ పవిత్రమైన గృహలోకి వెళుతుంది. వైష్ణవి అప్పటికి విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గృహ బయట ఒక్క వేటితో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెము దూరంలో ఒక పర్వతము శిఖరము మీద పడింది. అప్పుడు తన తప్పును తెలుసుకున్న భైరవుడు వైష్ణవి దేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటి మాత దయతలచి తన భక్తులు అంతా తన దర్శనము తర్వాత భైరవుడిని దర్శిస్తారని అప్పుడే వారి యాత్ర సంపూర్ణము అవుతుందని వారము ఇస్తుంది. ఆ తర్వాత వైష్ణవి తన కోరిక నెరవేర్చుకోవడానికి అత్యున్నత తపస్సుతో శ్రీమహావిష్ణువులో ఐక్యము అయ్యే అర్హత సంపాదించుకోవడానికి అలాగే తనని సృష్టించిన త్రీ మతలు మరియు శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారము ప్రజల కోరికలు తీర్చడానికి త్రికూట పర్వతము గృహలో మూడు తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతి రూపము ధరించింది. వైష్ణవ దేవి గృహ ఆలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు. ఆ మాతల తలలే వాటిని మహాకాళి, వైష్ణవ దేవి, మహా సరస్వతి దేవిగా చెప్తారు అక్కడి పండితులు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !