సింహాచలము ఆలయ విశేషాలు.....

సింహాచలము ఆలయ విశేషాలు.....



శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్నంనికి 11 కిలోమీటర్ల దూరములో తూర్పు కనుమల పర్వతము పై ఉన్న పెను హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రము విశాఖ పరిశారాల ప్రాంతాలలోని ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతము పై ఉంది. ఇది దక్షిణ భారతదేశములోనే ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయము కలిగిన దేవాలయము. ఈ దేవాలయానికి సంవత్సరానికి 52 కోట్ల రూపాయల వరకు ఆదాయము వస్తుంది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుడి నిజరూప దర్శనము భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయము లో ఈ విగ్రహానికి చందనముతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవము అని అంటారు. ఇది ప్రతి సంవత్సరము వైశాఖ మాసము శుద్ధ తదియనాడు వస్తుంది. అంటే మే నెలలో వస్తుంది. సింహాచలము చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దము వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారంగా ఇది ఇంకా పురాత కాలము నాటిది అయ్యి ఉండవచ్చు. సింహాచలము అంటే సింహము యొక్క పర్వతము అని అర్థము. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలల్లో నాలుగవ అవతారము అయ్యిన లక్ష్మీ నరసింహ స్వామి మూర్తిగా వెలిశారు. 

ప్రహ్లాదుడుడి కథ

ఇతిహాసము ప్రకారము రాక్షస రాజు అయ్యిన హిరణ్య కసుడు విష్ణుకు పెద్ద శత్రువు. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణువు భక్తుడు. ఎన్నో విధాలుగా ప్రయత్నించిన కూడా తన కుమారుడిని విష్ణు విముక్తిడిగా చేయలేక పోయి చివరకు చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ, ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిపోయిన హిరణ్య కసుడు "విష్ణువు సర్వ వ్యాప్తము అని చెప్తున్నావు కదా! ఏది ఈ స్తంభములో ఉన్నాడా? చూపించు" అని ఆ స్తంభాన్ని పగలకొడుతాడు. అప్పుడు విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య కసుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తారు. స్థల పురాణము ప్రకారము ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ఆరాధించారు. 

వరాహ నరసింహ స్వామికి చందనము పూత

చంద్ర వంశానికి చెందిన పురావరుడు విమానములో వెళ్తువుండగా కిందికి ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించారు. విగ్రహాన్ని సంవత్సరము కాలము పాటు చందనముతో కప్పి ఉంచి వైష్ణవ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనము లేకుండా నిజరూప దర్శనము కలిగేటట్టు చెయ్యమని ఆకాశవాణి పురావరుడికి చెప్తుంది. ఆకాశవాణి పలికిన పలుకుల వరకు పురావరుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయము నిర్మించారు. ఈ సాంప్రదాయము ఇప్పటికీ పాటింపబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనముతో పూత పూస్తూ ఉంటారు. వరాహ నరసింహ రూపము కలిగిన ఈ నరసింహుడి అవతారము త్రిబంగ ముద్రలో వరాహ తల సింహము తోక కలిగిన మనిషి శరీరముతో ఉంటుంది. మిగిలిన సమయము లో చందనముతో కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపము ఉంటుంది. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనము తీసివేసి నిజరూప దర్శనము ఇస్తారు. 
వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామి వారి విగ్రహము మీద చందనాన్ని తీసివేస్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడు పగటిపూట నిజరూప దర్శనము, చందనోత్సవముతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. తదియ నాటి రాత్రి చందన సమర్పణ జరుగుతుంది. ఆ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడడము వలన ఎండ వేడితో సెగలు ఉంటుందని అంటారు. అక్షయ తృతీయ నాటికి లక్షల మంది జనాలు వస్తారు. ఆనాడు నరసింహస్వామికి పూసిన గంధాన్ని తొలగించి నిజరూప దర్శనము చూపిస్తారు. అందుకే ఆరోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. వైశాఖ పూర్ణమి రోజున స్వామివారికి రెండవ సారీ చందనము సమర్పణ చేస్తారు. పూర్ణమి రోజున స్వామివారికి మూడవ సారీ చందనము సమర్పణ చేస్తారు. అలాగే ఆషాడ పున్నమి రోజున స్వామివారికి నాలుగవసారిన చందనము సమర్పణ చేస్తారు. 

సింహాచలము ఆలయములోని శాసనాలు

1087 శాసనము లో సింహగిరి నరసింహ స్వామి దేవరగా ప్రఖ్యాతి పొందారు. స్వామి వారి ప్రెస్యూనాల కోసము తిరునంతనవనము కలిగించే శాసనము ఇది. అప్పటినుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీ వైష్ణవ సాంప్రదాయము కనపడుతుంది. 1266 శాసనము లో గంగా నరసింహ చత్రపతిగా సంకీర్తనము కోసము 100 మంది స్త్రీలను స్వామివారికి సమర్పించారు. 1968 శాసనము ఈనాటికి వ్యవహారంలో ఉన్న అడవి వనాన్ని నెలకొంది అక్షయ తృతీయ నాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ ఆనాడే పాయసము అప్పలాలు మొదలైన వన్యా ఆహారాల కోసము 1993 శాసనములో తెలపడుతుంది. 1942లో స్వామివారికి మహారాణి అయినటువంటి అనంతలక్ష్మి దేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపు మాల, సంపంగి మాల ఉన్నాయి. 1438లో శ్రీకృష్ణదేవరాయలు వారు చిన్నాదేవి, తిరుమల దేవి వారు ఇక్కడికి వచ్చి స్వామికి అనేక అలంకారములు కల్పించారు. అనేక గ్రామాలను 1441లో దార పోశారు. గజపతులు పతనము అయిన తర్వాత కూతుబ్ షా వంశకులు ఈ ప్రదేశము పై దండెత్తి దేవాలయము సంపదను దోచుకున్నారు. ఇంకా ఇవే కాక ఇంకా దాదాపు 500 శిలా శాసనాలు ఉన్నాయి. గత రెండు శతాబ్దాలగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపార్యము ధర్మకర్తలగా నిర్వర్తిస్తున్నారు. 

సింహాచలము దేవాలయము అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమట వైపు ముఖము కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖ ద్వారము ఐశ్వర్యము కలిగిస్తే పడమట ముఖము ద్వారము విజయాన్ని అందిస్తుందని హిందువుల నమ్మకము. కొండపైన నుండి గాలి గోపురము మీదగా ఆలయానికి చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. 

సింహాచలము ఆలయములోని కప్పస్తంభము

దేవాలయానికి ధర్మ గుడికి ఎదురుగా ఉన్న ప్రకారంలో కప్పస్తంభము ఉంది. ఈ స్తంభము సంతాన గోపాల యంత్రము పై ప్రతిష్ట అయి ఉంటుంది. ఇది అత్యంత శక్తివాంతమైనది అని భక్తుల నమ్మకము. సంతానము లేని వాళ్ళు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్ను చెల్లించేవారు. అందుకే దీనిని కప్పపు స్తంభము అని అంటారు. కాలక్రమేణ కప్పస్తంభము అయింది.

సింహాచలము కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసముద్రము గా ప్రాంతము కొండలపై సహజసిద్ధమైన జల ధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగాధర, ఆకాశధార, చక్రధార, మాధవధార భక్తులు ఈ ధారలలో స్నానము చేసి దైవదర్శనము చేసి ధరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలో ఉన్న గంగాధరలో సానము చేసి దైవ దర్శనానికి వెళ్తారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణము తర్వాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తారు. ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహము ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది. భైరవ వాహ అడవివరము మార్గంలో మెట్లు వద్ద భైరవద్వారము ఉంది. ఇక్కడ భైరవ స్వామి విగ్రహము ఉంది. ఈ విగ్రహము ఎటువంటి పూజలు అందుకోదు. 13, 16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతము భైరవపురముగా ప్రాముఖ్యము పొందింది. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరము గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒక మారు తిప్పోత్సవము ఇక్కడికి తీసుకొని వచ్చి నౌక విహారము చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపము ఉంది. ఇక్కడ మాధవ స్వామి దేవాలయము ఉంది. గిరిప్రదక్షణము సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. సంవత్సరము పొడవునా సింహాచలేశ్వరుడికి ఉత్సవాలు, పండుగలు జరుగుతూనే ఉంటాయి, వాటిలో కొన్ని చైత్ర శుద్ధ పాధ్యమి రోజు పెళ్ళికొడుకుని చేయడము ముహూర్తరాక చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర మొదలు పాధ్యమి వరకు కళ్యాణ మహోత్సవాలు చైత్ర శుద్ధ ఏకాదశి నాడు రథోత్సవము జరుగుతుంది.

సింహాచలము గిరి ప్రదర్శన

ఆషాడ శుద్ధ చతుర్థి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టు ప్రదక్షిణము చేసి కొండపైన స్వామి వారిని దర్శించుకుంటారు. దీనినే గిరిప్రదక్షిణ అని అంటారు. ఆషాడ పూర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న భక్తులు గిరి ప్రదక్షణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యము కలిగిన అప్పన్న చుట్టూ భక్తులు ప్రదక్షణము చేస్తారు. గిరి ప్రదక్షిణము చేసిన భక్తులు మర్నాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షణ చేస్తారు. గిరి ప్రదక్షణ చేసిన రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షణ బాటలో ఉన్న గ్రామాల వాళ్లు స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. సింహాచలము అప్పన్న గిరి ప్రదక్షిణము సందర్భంగా గోపాలము పరిశారాలలో ప్రత్యేకతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. సింహాచలంలో సాయంత్రము అప్పన్న రధము ప్రారంభము నుంచి ఉదయము వరకు ప్రదక్షణము చేసి భక్తులకు రక్షణ కలిగించి అవసరమయ్యే సహాయము కలిగేలా సిబ్బందిని నియమిస్తారు. కంచరపాలెము నుంచి సింహాచలము వరకు 15 పాయింట్లు ఉంటాయి. ప్రతి పాయింట్ వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది బహార కాస్తూ ఉంటారు. అత్యధికంగా మహిళలు గిరి ప్రదక్షిణలల్లో పాల్గొంటున్న అందుకు భద్రతను పెంచారు. ఎన్ఏడి గోపాల్ పట్నము వరకు 50 మంది ప్రత్యేకత్వమైన పోలీసులు పనిచేస్తారు. మరో రెండు మొబైల్ బృందాలు ప్రతిక్షణము తిరుగుతూ ఉంటారు. సాయంత్రము 4 గంటల నుంచి 12 గంటల వరకు సింహాచలము నుంచి హనుమంత వాగు వరకు ఒక బృందము ఉంటుంది. హనుమంత వాగు నుంచి కంచరపాలెము మాధవరము ఎన్ఏడి మీదగా గోపాలపట్నము సింహాచలము వరకు మరొక బృందము ప్రతిక్షణము తిరుగుతా ఉంటారు. 

భక్తులు సింహాచలము అలాగే ఇక్కడికి చేరుకోవడానికి విశాఖపట్నము నుంచి బస్సు, రైళ్లు విమాన మార్గాలలో కూడా రావచ్చు. అక్కడి నుండి సింహాచలము కొండలు కిందకి సుమారు 15 కిలోమీటర్ల దూరము ఉంటుంది. అక్కడికి సిటీ బస్సు, ఆటో, టాక్సీ లలో అక్కడికి చేరుకోవచ్చు. సింహాచలము కొండ నుండి పైకి చేరుకోవడానికి సుమారు 1000 మెట్లు ఉంటాయి. అలాగే దేవస్థానము ఘాట్ రోడ్డు మీదగా గాని దేవస్థానము బస్సులో గాని టాక్సీ లో గాని చేరుకోవచ్చు. సింహాచలము నరసింహస్వామి మాత్రమే కాకుండా ఆండాలు సన్నిధి సింహ వల్లి తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపుర అంధకార స్వామి ఆలయము, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము, శ్రీ సీతారామస్వామి ఆలయము, గంగాధర సన్నిధి కూడా ఉన్నాయి. అడవివరము గ్రామము నుంచి మూడు కిలోమీటర్ల దూరము లో భైరవ స్వామి సన్నిధి కొండ దిగున వరాహ పుష్కరిణి కొండ మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి ఆలయము సింహాచలానికి 8 కిలోమీటర్ల శ్రీ మాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికి వచ్చే భక్తులను పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !