ఆంధ్ర రాష్ట్రం కోసము మరణించే వరకు దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జీవితము

ఆంధ్ర రాష్ట్రం కోసము మరణించే వరకు దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జీవితము....



పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాన్ని అర్పించి అమరజీవి అయినా మహానుపురుషుడు. సత్యము, అహింస, హరిజనరోధన అని ఆశయాలకు జీవితాంతము కృషిచేసిన మహానీయుడు. 

పొట్టి శ్రీరాములు గారి జననము

పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాస్ లో గురవయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకుల ది ప్రత్యూషం ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలోని పడమటి పల్లి గ్రామములో ఉండేవారు. అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పాటు కాలేదు. కనిగిరి పడమటి పల్లె నెల్లూరు జిల్లాలో ఉంది. 

పొట్టి శ్రీరాములు గారి విద్యాభ్యాసము, ఉద్యోగము

20 ఏళ్ల వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసము మద్రాస్ లోనే సాగింది. తర్వాత బొంబాయిలో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత రైల్వేలో చేరి దాదాపు నాలుగు సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేశారు. శ్రీరాములు గారి జీతము నెలకు 250 రూపాయలు. ఆయనకి అప్పటికే వివాహము కూడా అయిపోయి ఒక బిడ్డ పుట్టి చనిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన భార్య కూడా చనిపోయారు. 25 సంవత్సరాల వయసులో శ్రీరాములు గారికి జీవిత సుఖాలపై విరక్తి చెందింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమము చేరారు. గాంధీజీ అనుచరుడిగా చేరి స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. 

పొట్టి శ్రీరాములు గారు చేసిన సత్యాగ్రహాలు

1930లో శ్రీరాములు గారు ఉప్పు సత్యాగ్రహము లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ 1941, 1942 సంవత్సరాలలో సత్యాగ్రహాలు క్విట్ ఇండియన్ ఉద్యమాలలో పాలుగొనడము వలన మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. 

1955లో ప్రచురించబడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు గారి మహాత్మా గాంధీ గారి మధ్యన అనుబంధం గురించి కూడా చాలా బాగా రాశారు. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారి సేవ చరితాత్రమైనది. ప్రేమ, వినయం, సేవ నిస్వార్థ లల్లో మూర్తివించిన స్వరూపమే శ్రీరాముల గారు. ఆయన గురువు ప్రపంచానికే గురువు. సత్యాన్ని, అహింసను ఆరాధించే ప్రేమ మూర్తి మహానుభావుడు. మహాత్మా గాంధీజీ గారు శ్రీరాములు తన కర్తవ్యం అయిన దీక్షను ఉచ్చావంగా నిర్వర్తిస్తూ ఆశ్రమంలో అందరి మెచ్చుకుంటా అలాగే గాంధీ ఆదరాన్ని కూడా పొందారు. 

పొట్టి శ్రీ రాములు గారు హరీజనుల కోసము చేసిన దీక్ష

గుజరాత్ రాష్ట్రంలోని రాజుకోర్టులోను ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోని సుబ్రహ్మణ్యం గారు నెలకొన్న గాంధీజీ ఆశ్రమంలో చేరారు. కులాలు, మతాలు పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనము చేసేవారు శ్రీరాములు గారు. 1946లో నెల్లూరు మాలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్షను చేసి సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనరోధరణ శాసనాలను ఆమోదింప చేశారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒక్కరోజైనా హరిజనరోధన కోసం కృషి చేయవలసి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరం జారీ చేసింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకతమైన అభిమానంతో పాటు అతని మంకు తనం పైన కూడా కాస్త చిరాకు కూడా ఉండేది. శ్రీరాములు లాంటి కార్యదీక్ష పరులు పదిమంది ఉంటే చాలు ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చు అని గాంధీజీ అనేవారు. 1946 నవంబర్ 25న శ్రీరాములు గారు మద్రాసులో అన్ని దేవాలయాలలో హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల్లోనే స్వతంత్రం రావచ్చని ఆశతో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సభ్యులు అందరి దృష్టి కూడా ఆ స్వతంత్ర ఉద్యమం పైనే ఉండేది. దాంతో శ్రీరాములు గారి వారి దీక్ష తక్షణం ఆపుకోవాలని వాళ్ళందరూ ఆయనకు సలహా ఇచ్చారు. అయినా కూడా శ్రీరాములు గారు వినకపోయేసరికి గాంధీజీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీజీ శ్రీరాములుకి నచ్చజెప్పి దీక్ష ఆపి వేశాడు. శ్రీరాములు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో ఉంటూ హరిజన రోజునకు కృషి చేశాడు. దీని గురించి నినాదాలు అట్టలకు రాసుకొని మెడకు వేలాడ తీసుకొని ప్రచారం చేసేవాడు. కాళ్లకు చెప్పులు తలకు గొడుగు లేకుండా మండుటెంటులో తిరుగుతూ ప్రచారం చేసే ఆయనని పిచ్చివాడు అని అనేవారు. 

పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రము కోసము చేసిన దీక్ష

అప్పట్లో మనము మద్రాస్ ఉమ్మడి రాష్ట్రములోనే ఉండేవాళ్లం. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవికి చిత్తుడు అయ్యాడు. తెలుగువారు అంటే ఆరంభ సూర్యులు మాత్రమే అని పుకారు సృష్టించారు. తమిళలో ఏలనాలు దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువాడు అని కాకుండా మద్రాస్యులు అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు ఉండేది కాదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితోనే నిండిపోయింది. కానీ, తెలుగు వారికి ప్రాధాన్యత ఉండేది కాదు. 1952 వచ్చిన ఆంధ్రావాలంటే ఎవరికి తెలియదు. మొత్తం ప్రపంచానికి మద్రాస్ వాళ్ళ గానే మనకు గుర్తింపు ఉంది. ఈ బాధను భరించలేక స్వామి సీతారామ్ అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం ఆయన శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ గారి దీక్షని భగ్నము చేసి పైగా తెలుగు వాళ్ళు ఆరంభ సూర్యులు అని మళ్లీ హేళన చేశారు. రాజాజీ ప్రభుత్వం ఈ దిగు మింగుకోలేని అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. గుడివాడలో సర్కస్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసులో దిగి బులుగు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. దాంతో రాజాజీ కోపంతో ఊగిపోయారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాలు చేశారు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్లారా వారి అంతు చూస్తాను అని అన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరి వాడైపోయారు. సుబ్రహ్మణ్యం గారు ఒకరు తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా కూడా తన దీక్షను వదిలిన పొట్టి శ్రీరాములు గారు మాత్రము వదల్లేదు. తొమ్మిదో రోజున నెహ్రు కి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులే అని తనని అనిచవేస్తానని రాజాజీ నెహ్రూ కు గొప్పలు పలికాడు. తెలుగు వాళ్ళు లక్షల మంది ఉన్న మద్రాస్ నగరములో ఆదరణ లభిస్తుంది అని అనుకుంటే ఒక్కరు కూడా శ్రీరాములు వద్దకు రాలేదు. అది తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని తెలుగువారి ఆత్మగౌరవము కోసము అని గ్రహించడము లో అందరూ రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారము తీసుకోకుండా దీక్షను చేస్తూ ఉంటే ఏ తెలుగు వారికి జాలి దయ కలగలేదు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల రూపములో వెల్లడించుకున్నారు శ్రీరాములు గారు. వారిలో ముఖ్యులు రాజు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు భాస్కరరావు పొట్టి శ్రీరాములు శారీరక పరిస్థితి నిరాహారతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకులు పెట్టేవాడు. పేగులు పుండ్లు పట్టి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు, చెవులు నుండి కూడా పురుగులు వచ్చేవి. జీర్ణ వ్యవస్థ పూర్తిగా తిరగబడి మలము కూడా నోటి నుండి వచ్చేది. వర్ణించడానికి కూడా వీలులేని అంత దారుణమైన పరిస్థితులలో శ్రీరాముల వారు నిర్జీవుడు అవ్వడానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగు వారి కోసము ఆయన పడిన బాధల గురించి చెప్పడానికి మాటలే లేవు. శ్రీరాములు గారు 58 వ రోజున మరణించారు.

శ్రీరాములు గారి మరణము తర్వాత

మరణించిన తర్వాత మరో దారుణం ఎదురయింది తెలుగువారి హీన దీన చేతకానితనము ఎటువంటిది అంటే శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయాడని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడు ఉన్న సుబ్రహ్మణ్యం గారు కనీసము మన గుడివాడ వాళ్ళనైనా సహాయము అడిగి శవాన్ని దానము చేద్దామని ఆశయాన్ని చంపుకొని వ్యక్తిగత బిచ్చగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి మన గుడివాడ నుంచి వచ్చారు గనుక మనమైనా సాగ నంపుదాము అని ఒప్పించి ఆయనను పిలిచారు. ఘంటసాల గారి వెనుక దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేను వస్తాను అని ఆయన వచ్చారు. శవాన్ని కాకులు పడకుండా తాటాకులతో కప్పిన సుబ్రహ్మణ్యం గారిని శవము ఎక్కడ అని గంటసాల గారు అడిగారు. ఒక్కొక్క తాటాకు తీస్తుంటే శవాన్ని చూస్తున్న గంటసాల గారి గుండె ఆగిపోయింది. గంటసాల గారి గుండె కరిగిపోయింది. ఎవరి కోసము చనిపోయాడు ఈ దీనుడు అంటూ కన్నీరు పెట్టుకొని వాంతిక చేసుకున్నారు. తెలుగు జాతి కోసము తన ప్రాణాలు దానము చేసిన ఈ మహానీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకు వెళ్లడము సబబు కాదని తెలుగు వారి కళ్ళు తెరిపించడానికి ఈ శవము దిక్కు కావాలని ఆవేశము తో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దుల బండిని మాట్లాడి శవాన్ని అందులో ఎక్కించారు. అప్పటికప్పుడే ఘంటసాల గారు వీర కంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషము చచ్చిందని చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసము అసుగులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి శివయాత్ర ప్రారంభించారు. గుండెల్ని పిండే ఘంటసాల మాటలు, పాటలు విని మద్రాస్ ప్రెసిడెంట్ సి కాలేజీ కుర్రాళ్ళు పౌరుషముతో అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అంటూ బండి వెంట గట్టిగా అరుస్తూ యాత్రలో పాల్గొన్నారు. అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు తెలుసుకొని వెంటనే రైలులో మద్రాస్ కు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి శవయాత్ర మద్రాస్ సెంటర్ స్టేషన్ కి చేరింది. శ్రీరాములు వారి శవాన్ని చూడగానే ప్రకాశం పంతులుగారు ఆవేశంతో తెలుగు జాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడారు. పనికిరాని తెలుగు నా కొడకా ఇప్పటికైనా రా అంటూ పెట్టిన పెడబాబులకి లక్షలాది మంది తెలుగు వారు క్షణాలలో మద్రాస్ నగరాన్ని మంటల్లో తగలపెట్టేశారు. షాపులు లూటీ చేశారు. ఆంధ్ర దేశమంతా అడ్డోడికి పోయింది. కాల్పుల్లో 8 మంది చనిపోయారు. నెహ్రు రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంతబడమని శ్రీరాములు వారి మరణం వృధా పోదని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తాను అని పార్లమెంటులో ప్రకటించడంతో తెలుగుజాతి ఊరే వెళ్ళింది. సుబ్రహ్మణ్యం గారు శ్రీరాములు వారి అంత్యక్రియలు జరిపారు. చివరికి 1952లో డిసెంబర్ 19వ తేదీన ప్రత్యేక రాష్ట్రం చేస్తూ ప్రధానమంత్రి జవలాల్ నెహ్రూ ప్రకటన చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాస్ రాజధాని పెట్టుకోవడానికి వీలు లేదని మరునాడు వెళ్ళిపోవాలని చక్రవర్తి రాజగోపాల్ చార్యులు తెగేసి చెప్పారు. దాంతో కాకతీయులు పాలించిన వరంగల్ రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ గారు సూచించారు. రాజమండ్రి కూడా మంచిదే అని విజయవాడ కమ్యూనిస్టులు కంచుకోట కాబట్టి కాంగ్రెస్ వాళ్లు ఒప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సౌకర్యాన్ని మేము వదులుకోలేమని అడిగారు. వాస్తవాలను మేము నమ్మము రాజధాని రాయలసీమలోనే పెట్టాలని లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవిని రెడ్డి తన వాళ్లు ఎదురు తిరిగారు. తర్వాత గత్యంతరం లేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్లారి, బలంపురం ఇంకొన్ని తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !