విజయవాడ కనకదుర్గమ్మ మహిమలు
ఒకప్పుడు బెజవాడపై వెలసిన చింతామణి కాళీ ని చూడడానికి భక్తులు వణికి పోయేవారు. 18 బాహువులతో, ఎర్రటి పెద్ద కళ్ళతో, నాలుకతో, ఓ చేత్తో మొండము నుండి వేరు చేసిన తలని పట్టుకొని మెడలో కపాలాలని ధరించి అతి భయంకరంగా ఉండేది అమ్మవారు. ఒకప్పుడు అమ్మవారి బలి కోరేది. అందుకే ఒంటరిగా భక్తులు కాళీమాత వెలసిన ప్రదేశానికి వెళ్లే ధైర్యము, సాహసము చేసేవాళ్లు కాదు. అంతటి ఉగ్రరూపాన్ని ఎలా శాంతింప చేశారు? ఆ భయంకరమైన రూపాన్ని కనకదుర్గ అమ్మవారిగా ఎలా మార్చారు? అనేది ఇక్కడ తెలుసుకుందాము.
5, 6 శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతి బండపై భయంకరమైన చింతామణి ఖాళీగా వెలసిది. ఆ ఉగ్రరూపాన్ని చూసే ధైర్యము సామాన్యమైన భక్తులకి ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు బలి కోరేది. సాయంత్రము అయితే చాలు ఉపాసనకు వచ్చేదంట అమ్మవారు. గలగల గజ్జలు శబ్దాలతో చీకట్లో తిరిగేదంట అమ్మవారు. సాయంత్రము 6 దాటాక ఎవరు కూడా వారి తలుపులు తెరిచే వారు కాదు.
అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవారు. అతనికి అమ్మవారు అంటే ఎనలేని భక్తితో ఉండేవారు. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మపదంగా పరిపాలించేవారు. అతనికి సంతానము లేకపోవడంతో రోజు అమ్మవారి చెంతకు చేరుకొని పూజలు చేసేవారు. అమ్మవారు కనికరించడంతో రాజుకు ఒక పుత్రుడు జన్మించారు. ఇదంతా ఆ కాళీమాత అనుగ్రహమే అని అతను అమ్మవారికి మొట్టమొదటిగా ఆలయము నిర్మించారు. కాలక్రమేన ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతూ ఎంతో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చారు.
ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకొని సవారికి ఇంద్రకీలాద్రి వైపుకి వెళ్తాడు. అలా సవారి చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతుంది. అదే సమయము లో కొండమీదగా ఒక స్త్రీ తన ఇంట్లో వాళ్లకి ఆకలి తీర్చడానికి చింత చెట్టు కోస్తూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారి సంచారానికి వస్తుందని భయంతో ఆమె తన పిల్లాడిని తీసుకొని గుబ గుబ అక్కడి నుండి కొండ దిగుతూ వస్తుంది. యువరాజు కూడా అమ్మవారు ఉపాసనకు వచ్చేవేళ అవుతున్నది కదా అని రథాని వేగాము పెంచారు. అసలే సంధ్య వేళ పైగా ఆ కొత్త గుర్రము దూకుడికి దారంతా దుమ్ములేస్తూ వచ్చింది. అంతలో ఆ పిల్లాడు ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథము వైపుకు వెళతాడు. యువరాజు సరిగ్గా చూడక పోవడంతో ఆ రధము ఆ పిల్లవాడి శరీరము మీదికి ఎక్కి దూసుకుపోతుంది. అంతలో ఆ బిడ్డ తల్లి గట్టిగా కేక వేసింది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లవాడి ఒళ్లంతా రక్తము. తల్లి చేతిలోనే ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లవాడికి కళేబరాన్ని తన రెండు చేతులపై ఎత్తుకొని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన మాధవ వర్మ కోట దగ్గరికి వరకు చేరుకుంటుంది. అక్కడున్న ధర్మ గంటను మోగిస్తుంది. ఎవరికో ఆపద వచ్చిందని మాధవ వర్మ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. ఆ తల్లి పడుతున్న యాతనను ఆ రాజు చూడలేకపోయారు. తల్లి జరిగిన విషయము తెలిసింది. నీ బిడ్డ ప్రాణాలు తీసిన అతను ఎవడైనా సరే రేపు సంధ్యా వేలకు వాడి తల తెగి పడుతుందని ఆమెకు మాట ఇస్తారు. కానీ ఆ రాజుకి తెలియని విషయము ఏంటంటే తెలియకుండా ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది యువరాజు అని బటులను పంపించి విషయాన్ని తెలుసుకోవగా మొత్తము బయటపడుతుంది. ధర్మపరుడైన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానము అయిన శిక్ష పడాల్సిందే అని అనుకుంటారు. అందుకు ఆ యువరాజు కూడా తన తండ్రితో మహారాజా నేను తెలియక చేసిన తెలిసి చేసిన తప్పు తప్పే. మీరు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తారు. మంత్రులు, రాజు కుటుంబీకులు ఎంత వాదించినా వారు వినలేదు. ఆ పిల్లవాడు ఏ చోట అయితే చనిపోయాడో అదే చోటికి ఆ యువరాజును తీసుకొని వెళతారు. జనాలు అందరు గుంపు గుడారు. రాజు ఆదేశించిన సైనికులకు ఆ యువరాజుని చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవ వర్మే తన సొంత చేతులతో కత్తి పట్టుకొని ఆ యువరాజుని తన సొంత చేతులతో నరికేశారు. ఒక్కసారిగా వాతావరణము నిశ్శబ్దముగా మారింది. చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరము కూడా రక్తము మడుగులో పడి ఉంది. అక్కడున్న వాళ్ళకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని మబ్బులు గర్జిస్తున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశము నుంచి కనక వర్షము కురిపించింది. చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణ్యాలు వాన చినుకులు గా పడుతూ ఉంటే జనాలు వాటిని పోగేసుకున్నారు. ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కళ్ళల్లో ఒకసారిగా వచ్చాయి. ఆ కారు మేఘాల వైపు చూశారు. అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్టు అనిపించింది. తల్లి నీ వరప్రసాదముగా పుట్టిన నా కుమారుడిని నీవే బలి కోరావు. అందుకని అతని పుట్టించడము ఎందుకు తల్లి అని విలపించాడు. దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లు ఉరుములు ఉరిమాయి. అమ్మలను కన్నా అమ్మ దుర్గమ్మ మహిమలతో చనిపోయిన యువరాజు, ఆ పిల్లవాడు ఇద్దరు ప్రాణాలతో తిరిగి వచ్చారు. చనిపోయి తిరిగి బతికిన ఆ పిల్లవాడు తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని అంటూ అక్కున చేరాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యువరాజుని పట్టుకొని రాజు గట్టిగా ఏడిచారు. నన్ను క్షమించు బాబు అని యువరాజుని గట్టిగా కౌగిలించుకున్నారు.