బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు.......
అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాలో పాడేరులో 1897లో జులై 6న జన్మించారు. కానీ వీరు పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలో. అల్లూరి సీతారామరాజు తండ్రి వెంకట రామరాజు. వీరు ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూ ఉండేవారు. తల్లి సూర్యనారాయణమ్మ. అల్లూరి కుటుంబము సాధారణమైన మధ్య తరగతి కుటుంబము. అల్లూరికి సీతమ్మ అనే చెల్లి, సత్యనారాయణ రాజు అనే తమ్ముడు ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు బాల్యము
అల్లూరి తల్లి గారు పెద్దగా చదువుకోకపోయినా ఇంట్లోనే ఉంటూ పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదివి రామరాజుకి బోధిస్తూ ఉండేది. ఇక అల్లూరి వారి తండ్రి గారు ఫోటోగ్రాఫర్ కావడంతో తన వృత్తి చేసుకోవడము కోసము రకరకాల ప్రాంతాలలో తిరిగేవారు. దాంతో కుటుంబము అంతా ఊరూరా తిరగవలసి వచ్చేది. అందువల్ల అల్లూరి చిన్నతనంలోనే వివిధ ప్రాంతాలకి తిరిగేవాడు. ఏకతాటిగా ఒకే చోట ఉండడము కుదరకపోవడంతో అల్లూరి గోదావరి జిల్లాలో పరిధిలో ఉన్న నరసాపురం, రామచంద్రపురం ఇంకా పలుచోట్ల ఆయన విద్యా భాష్యము కొంచెం కొంచెం సాగుతూ వచ్చింది. ఇక మన అల్లూరిని బాల్యంలో అందరూ ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. అయితే చిట్టిబాబు చిన్నతనంలో ఒక రోజున తన తండ్రితో కలిసి గోదావరిన గట్టు పైన నడుస్తూ ఉండగా గుర్రంపై ఒక బ్రిటిష్ అధికారుడు వెళుతూ ఉంటే అందరూ వంగి వంగి దండాలు పెడుతూ ఉన్నారు. అల్లూరి కూడా అలాగే దండాలు పెట్టపోయాడు. కానీ తన తండ్రి వద్దంటూ చెప్పాడు. వీళ్లు మన దేశంపై పడి దోచుకుంటూ మన వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. వారికి మనము ఎందుకు బానిసలుగా ఉంటూ ఈ దగా కోరలు అయిన బ్రిటిష్ వాళ్లకి దండాలు పెట్టాలి అంటూ వాదించాడు. ఆరోజు జరిగిన ఆ సంఘటన తర్వాత నుంచి ఇక అల్లూరికి తన తండ్రి మన దేశ పరిస్థితుల గురించి చెప్తూ ఉండేవారు. దాంతో అలా తండ్రి దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటూ అల్లూరి తో పాటు కుటుంబం మొత్తం ఎంతో సంతోషం ఉన్న సమయంలో అల్లూరికి 11 సంవత్సరాలు వయసులో ఆరో తరగతి చదువుతున్నప్పుడు రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఊరంతా కలరా వ్యాధి సోకింది. ఆ కలరా వ్యాధి వచ్చి 1908లో అల్లూరి తండ్రి గారు చనిపోయారు. దాంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో అల్లూరి కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడింది. అల్లూరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కేవలం 11 ఏళ్ల అంత చిన్న వయసులో తండ్రిని కోల్పోవడంతో అల్లూరి ఎంతో కృంగిపోయాడు. ఆ సమయంలో వాళ్ళ చిన్నాన్న రామకృష్ణ రాజు ఆర్థికంగా అల్లూరి కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ విధంగా 1909లో అల్లూరి కుటుంబం భీమవరంలోకి నివాసం మార్చారు. భీమవరం లో ఉన్నత పాఠశాలలో అల్లూరి చేరి రోజు ఇంటి నుండి పాఠశాల వరకు నడిచి వెళ్లేవారు. నాన్న చనిపోయారు అని దుఃఖంలో పాఠశాలకు వెళ్లిన సరిగ్గా చదువుకోకపోవడంతో ఆ సంవత్సరం పరీక్ష తప్పారు. దాంతో చదువు మీద ఆసక్తి లేదు కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలని అని ఆలోచనలతో గుర్రపు స్వారి నేర్చుకున్నాడు. ఇక 1911లో వాళ్ల చిన్నాన్నకు రాజమహేంద్రపురం ట్రాన్స్ఫర్ అవ్వడం వలన అక్కడే ఆరో తరగతి చదువు పూర్తి చేశారు. ఆపై 1912లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో ఏడవ తరగతి పాస్ అయ్యాడు. మళ్లీ 1912లో వాళ్ల చిన్నాన్నకు కాకినాడకు ట్రాన్స్ఫర్ అయింది. దాంతో అల్లూరి తో పాటు అతని కుటుంబము అంతా కాకినాడకి తీసుకొని వెళ్లారు. అల్లూరిని కాకినాడలోనే పిఠాపురం రాజా పాఠశాలలో చేర్చారు. అక్కడే ప్రముఖ కాంగ్రెస్ నేత దేశభక్తుడైన మాధురిఅనుకూరయ్య, మధురి అన్నపూర్ణయ్య కూడా చదివారు. ఇద్దరు కలిసి పాఠాలకు కంటే కూడా దేశం కోసము పోరాడిన వారి చరిత్రలోనే ఎక్కువగా చదివే వారంట. అలా అల్లూరి కాకినాడలో చదువుతున్నప్పుడే జాజి చక్రవర్తి వార్షికోత్సవాలలో 1912లో శశిరేఖ పరిణయం నాటకంలో అల్లూరి శశిరేఖ అలాగే నారాదుదిగా రెండు పాత్రలు వేశారు. అలా కాకినాడలో చదువుతున్నప్పుడే ఒకసారి బ్రిటిష్ విద్యార్థితో గొడవ కావడంతో ఇక అల్లూరి అక్కడ కాలేజీ మానేసి కుటుంబంతో సహా పాయకరావుపేటకు వచ్చేశారు. ఆ తర్వాత అల్లూరి 14 సంవత్సరాలు వచ్చేసరికి ఉపనయనం జరిగింది. ఉపనయనం అంటే పంచలు కట్టడము. ఆ తర్వాత వాళ్ల చిన్నాన్న కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడము వలన అల్లూరిని మరల విశాఖపట్టణానికి తీసుకొని వెళ్లి మరో విద్యాసాలలో చేర్పించారు. దాంతో అల్లూరి వాళ్ళ అమ్మా, చెల్లి, తమ్ముడు మాత్రము తమ తాత గారి ఊరికి వచ్చేసారు. దాంతో అల్లూరి విశాఖపట్నంలో ఒక్కడే ఉండి చదువుకోవడము వలన స్వేచ్ఛ పెరిగి పైగా కలరా వ్యాధి రావడంతో ఆ సంవత్సరం మళ్ళీ పరీక్ష తప్పడు. తర్వాత సంవత్సరం నర్సాపురంలో మళ్లీ పాఠశాలలో చేరాడు. అక్కడ కూడా సరిగ్గా చదవడం లేదని వాళ్ళ చిన్నాన్న తనని తిట్టడంతో తన తల్లి ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇంకా అక్కడ తునిలో పాఠశాలలో చేరాడు. కానీ అక్కడ కూడా సరిగ్గా చదవకపోవడం వలన స్కూల్ టీచర్ కొట్టడంతో తను పూర్తిగా ఏకంగా చదివే ఆపేశాడు. ఇంకా చదువు అయితే అవ్వలేదు. దాంతో ఒకరి దగ్గర జ్యోతిష్యం, వాస్తు యోగం, కవిత్వం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక శాస్త్రి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. ఇలా 1918 వ వరకు అంటే అల్లూరికి 21 సంవత్సరాలు వచ్చేంతవరకు వారి కుటుంబం తునిలోనే ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు చేసిన యాత్రలు
అల్లూరి తుని చుట్టుపక్కల కొండలు అడవుల్లో తిరుగుతూ గిరి జనులు ఎలా బతుకుతున్నారో అని గమనించేవారు. పేద ప్రజల బాధలు, కష్టజీవుల కష్టాలు చూసి అతని హృదయం ఎంతో చలించిపోయింది. ధనికుల సంపదనలన్నీ పేద ప్రజల శ్రమ ఫలితమే అని తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో తాను ఆంగ్లయులని ఎలా అయినా ఎదిరించాలని తన దేశాన్ని బానిసత్వం నుంచి కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా రామరాజుకి చదువు మీద కన్నా దేశంలో ఉన్న బానిసత్వని నిర్మూలించాలని దానికోసం బాగా కృషి చేయాలని ఆలోచనతోని కుర్ర వయసులో ఉండేవాడు. చిన్నప్పటినుండే సీతారామరాజుకి దైవభక్తి నాయకత్వం లక్షణాలు దానగుణం ఉండేది. ప్రతిరోజు దేవుడికి పూజ చేసేవాడు. అలాగే గోపాలపట్నంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు తపస్సు చేసేవాడు. అలాగే భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఉజ్జయిని, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం ఇంకా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. ఈ క్రమంలో ఎన్నో భాషలు, విద్యలు నేర్చుకొని సన్యాసి దీక్ష తీసుకొని యోగిగా తిరిగి వచ్చాడు. గృహ వైద్యం లాంటి గ్రంథాలు ఎన్నో రాశాడు. ఆ తర్వాత మరల రెండు సంవత్సరాలు తర్వాత 1918లో మళ్లీ యాత్రకు బయలుదేరి బొంబాయి, మైసూర్ మరి ఇంకొన్ని ప్రదేశాలు తిరిగి మళ్లీ కృష్ణదేవి పేట కి చేరాడు. అలా తిరుగుతూ పంజాబ్ కి వెళ్లి అక్కడ గద్దర్ వీరులని కలిశాడు. అలాగే బెంగాల్ కి వెళ్లి విప్లవకారులని కూడా కలిశారు. అలా సీతారామరాజు రెండుసార్లు చేసిన ఉత్తర భారత యాత్రలో తెల్ల దొరల పాలనలో ప్రజలు పడుతున్న బాధలు గమనించారు. దాంతో బానిసత్వం ఆయనని కదిలించింది. ఆయన కి విప్లవాన్ని రగిలించింది. ప్రాణానికి ప్రాణమే అని ప్రామాణికం అనే నమ్మి విప్లవ వాదాన్ని నేర్చుకొని తిరిగి ఆంధ్ర దేశానికి వచ్చి కృష్ణదేవి పేటలో కొంతకాలం ఉన్నారు. అక్కడ పండ్లు, తేనె మాత్రమే తిని బ్రతికేవారు. అక్కడ ఉన్న ప్రజలు అల్లూరికి పవిత్ర శక్తులు ఉన్నాయని నమ్మేవారు.
అల్లూరి సీతారామరాజు చేసిన తిరుగుబాటు
అక్కడ మన్యంలో క్రైస్తవులు అయిన బ్రిటిష్ వాళ్ళు గిరిజనులకు బలవంతంగా మత మార్పిడి చేయించేవారు. బ్రిటిష్ వాళ్ళు చేసే ఆమానుషమైన పనులు భరించలేక ఆ గ్రామాల ప్రజలందరినీ ఏకము చేసి గిరిజనులని అగ్ని పోరాట వీరులగా తీర్చిదిద్ది యుద్ధానికి తయారు చేశాడు. దాంతో అల్లూరిని తమ వైపు తిప్పుకోవడానికి బ్రిటిష్ వాళ్లు 60 ఎకరాల సాగు భూమిని అల్లూరికి ఇస్తామని అన్నారు. కానీ అల్లూరి అందుకు ఒప్పుకోలేదు. ఇక అల్లూరి అసలైన తిరుగుబాటు అనేవి ఇక్కడి నుండే మొదలైయాయి. ఇంకా ఆ తర్వాత అల్లూరి ఉంటున్న ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాలు క్రమంగా పెరిగిపోవా సాగాయి. గిరిజనులని వారి భూములలో వ్యవసాయాన్ని చెయ్యకుండా నిషేధించారు. దాంతో వ్యవసాయం లేక తినడానికి తిండి దొరక్కుండా ఆకలితో గిరిజనులు బాధపడేవారు. అంతేకాక మన్యం ప్రజలన్నీ అమాయకులను చేసి ఎన్నో రకాలుగా పనులు చేయిస్తూ బ్రిటిష్ వాళ్ళు శ్రమ దోపిడీ చేసేవారు. అలాగే గిరిజనుల నుండి వాళ్ల ఆస్తులని కూడా లాక్కున్నారు. దాంతో చేసేది ఏమీ లేక మన్యం ప్రజలు రోజు కూలి పనులకు వెళ్లావలసి వచ్చేది. అయితే చివరికి అక్కడ కూడా కాంట్రాక్టర్లు వాళ్ల పనికి కూలీగా ఆరు అణాలు ఇవ్వాల్సింది అని చెప్తే బ్రిటిష్ సైనికులు కేవలం ఒక్క ఆనం మాత్రమే ఇచ్చేవారు. ఇలా ఒకటే కాకుండా ఎన్నెన్నో దౌర్జన్యాలు గిరిజనుల పై బ్రిటిష్ వాళ్లు చేస్తూ ఉండడంతో ఇక అల్లూరి బ్రిటిష్ వాళ్లతో పోరాడాలి అని నిర్ణయం తీసుకున్నారు. దాంతో అల్లూరి మన్యం ప్రజలందరినీ ఏకం చేసి విల్లు, బాణం, ఈటులు లాంటి ఆయుధాలతో బ్రిటిష్ వాళ్లతో ఒక రోజున పోరాటానికి దిగాడు. కానీ బ్రిటిష్ వాళ్ళ ఆయుధాల ముందు ఈ మన్యం ప్రజల ఆయుధాలు పనికి రాలేదు. దాంతో ఇలా కాదు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళ ఆయుధాలను ఎత్తుకెళ్లాలని అల్లూరి నిర్ణయించుకున్నాడు. ఈ పథకం భాగంలోనే 1922లో ఆగస్టు నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లో అల్లూరి తన సైన్యంతో దాడులు చేశారు. దాదాపు 44 తుపాకీలు, 5 కత్తులు, 4500 తుపాకీ గుండ్లు, స్టేషన్ లో ఉన్న రికార్డులని ధ్వంసం చేశారు. ఈ దోపిడీలో పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీస్ కి కూడా ఎటువంటి హాని చేయలేదు. పైగా ఏ స్టేషన్లో ఎటువంటి వస్తువులు తీసుకున్నారు కూడా ఒక పత్రంలో లెక్క రాసి అల్లూరి సంతకం చేసి మరి వెళ్లే వారంట. అలా అల్లూరి తెల్లవారిని గడగడలాడించి నిద్ర లేకుండా చేశారు. అంతేకాదు అల్లూరిని ఎదిరించడానికి పంపిన బ్రిటిష్ అధికారులన్నీ అందర్నీ సైతం అల్లూరి తన సైన్యంతో తోక ముడిచేలా చేశారు. ఇలా వరుసగా ఎన్నో నెలలపాటు మన్యం ప్రాంతము నుండి ఎన్నో యుద్ధాలు చేసి ఎవరికి దొరక్కుండా అడవుల్లో ఉంటూ అతిపెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని వచ్చిన తెల్లదొరలకు సైతం చెమటలు పట్టించారు.
అల్లూరి సీతారామరాజు మరణము
అల్లూరిని ఏమీ చేయలేక చివరకు సీతారామరాజుని ఎలాగైనా పట్టుకొని మట్టి కల్పించాలని బ్రిటీష్ గవర్నమెంట్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇలా అల్లూరిని చంపే ప్రయత్నం భాగంగా ఏప్రిల్ 17న 1924లో అక్కడ మన్యానికి కలెక్టర్గా స్పెషల్ కమిషనర్ గా రూతేర్ఫార్డ్ అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. అతను బ్రిటిష్ వాళ్ళ పాలనలో విప్లవాలని అణిచివేయడంలో చాలా పేరు కలిగిన వ్యక్తి. ఇక మన అల్లూరి సీతారామరాజు తనపాటుతో ఉన్న విప్లవ వీరులలో అగ్గిరాజు, అది శాసమంతుడు అని పేరు సంపాదించుకున్నాడు. ఆరోజు ప్రభుత్వ అధికారులని పోలీసులని ముక్కుతిప్పలు పెట్టడంలో ఇతను ముందుండేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవాన్ని చెడు చేసే ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. 1924 మే 16వ తేదీన జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలికి భయంకరమైన గాయం అయింది. అప్పుడు అగ్గిరాజు బ్రిటిష్ వాళ్లకి దొరక్కుండా ఒక బావి లోకి వెళ్లడానికి ఎవ్వరికి కనపడకుండా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు బ్రిటిష్ సైనికులు చూసి పట్టుకొని అప్పట్లోనే ఎంతో క్రూరంగా శిక్షలు విధించారు. అండమాన్ జైలులో అతని వేశారు. తర్వాత అదే జైల్లో ఎన్నో భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ అతను చనిపోయారు. ఆరోజు రాత్రి జరిగిన యుద్ధంలో అల్లూరి కూడా ఉన్నారు. ఆ యుద్ధంలో సైనికుల నుండి తప్పించుకొని పంప అనే గ్రామానికి ఆయన చేరారు. అంతకుముందు బ్రిటిష్ అధికారైన రూతేర్ఫార్డ్ ఆ కృష్ణదేవపేటలో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో గ్రామంలో నుంచి ఒక వ్యక్తి మునసవ పాల్గొని అంతా విన్నాడు. ఆ సభలో రూతేర్ఫార్డ్ ఏం చెప్పాడంటే "వారం రోజుల్లో అల్లూరి దలాన్ని, విప్లవ వీరుడు ఆచుకుని మాకు తెలపకపోతే ఈ గ్రామంలో ఉండే ప్రజలందరినీ చంపేస్తామని" చాలా భయంకరంగా హెచ్చరించి వెళ్లిపోయాడు. దాంతో కృష్ణదేవపేటలో జరిగిన ఆ సభలో రూతేర్ఫార్డ్ ఏం చెప్పాడో తెలుసుకోవాలని రాత్రిపూట ఎవరు చూడకుండా అల్లూరి మునసవ ఇంటికి వెళ్లారు. ఆ సభలో జరిగింది తెలుసుకొని తన వల్ల ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఆలోచనతో బ్రిటిష్ వాళ్లకి తానే లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సభలో అల్లూరిని పట్టించిన వారికి పదివేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. దాంతో అల్లూరి నన్ను బ్రిటిష్ గవర్నమెంట్ కు పట్టించమని ఇచ్చిన డబ్బుతో గ్రామానికి ఏమైనా చెయ్యమని మునసవకు చెప్పాడు. కానీ ప్రజల కోసం ఎంతో పోరాడుతున్న అల్లూరిని బ్రిటిష్ వారికి పట్టించడానికి ఆ మునసవ ఒప్పుకోలేదు. అంతటి నీచమైన పనినీ చెయ్యనని కావాలంటే ఆ యుద్ధంలో నేను చనిపోతాను అని మునిసవ చెప్పాడు. ఆ తర్వాత అల్లూరి బ్రిటిష్ వారికి ఎన్ని సార్లు లొంగిపోవాలని చూసినా కూడా ఆ గ్రామ ప్రజలు ఒప్పుకోలేదు. దాంతో 1924 మే 7న కోయ్యూరు గ్రామంలోని ఓ ఏటి వద్ద అల్లూరి సీతారామరాజు కూర్చొని అక్కడే ఉండే ఒక పశువుల కాపరి ద్వారా తనుండే చోటు బ్రిటిష్ వారికి తెలియచేశాడంట. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ పోలీసులు సీతారామరాజుని పట్టుకోవడానికి బయలుదేరారు. దాంతో సీతారామరాజు ఆ ఏట్లో స్నానం చేస్తూ ఉండగా ఆయనని బ్రిటిష్ పోలీసులు బంధించి బందీగా ఉన్న సీతారామరాజుని కనీసం విచారించకుండా ఒక చెట్టుకు కట్టేసి ఆ బ్రిటిష్ మేజర్ కాల్చి చంపాడు. కనీసము తన మరణం వార్త కూడా తన తల్లికి చెప్పలేదు. 1924 మే 8న బ్రిటిష్ వాళ్లపై అధికారులకు రామరాజు చనిపోయాడని తెలిపేందుకు అల్లూరిని ఫోటో తీసి ఆపై ఆయన దేహాన్ని కాల్చి ఆయన చిత్త బస్వాన్ని వారాహి నదిలో కలిపారంట. ఇలా కేవలం 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలతో కలిసి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి మన దేశం కోసము అమర వీరుడు అయ్యాడు. అందుకే ఆయనను "మన్యం వీరుడు" అని అంటారు. సీతారామరాజు మరణం గురించి తెలుసుకున్న కొంతమంది విప్లవ వీరులు ప్రాణాలకు తెగించి విప్లవాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొందరు పోరాటాలలో మరణించి, మరికొందరు పట్టు పడ్డారు. 1922 ఆగస్టు 22న మొదలైన ఈ పోరాట వీరుడి గాధ 1924 జులై మొదటి వారంలో ముగిసింది అని చెప్పుకోవచ్చు.
అల్లూరి సీతారామరాజు పేరు
అల్లూరికి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు అల్లూరి శ్రీ రామరాజు. అయితే వీరికి సీతారామరాజు అని ఈ పేరు రావడానికి కారణము ఆయనను సీత అను ఒక స్త్రీ ని ప్రేమించారు. కానీ రామరాజుకు ఉన్న దేశభక్తికి వల్ల వారిద్దరూ కలవలేదని అందుకే తన పేరులో సీత అని పేరుని కలుపుకున్నారని కొందరు అంటుంటారు. మరికొందరు అదంతా నిజం కాదని తెలుగు వారు ఎవరైనా శ్రీ తో ఉన్న రామున్ని కాకోకుండా సీతమ్మతో ఉన్న రామ శబ్దాన్ని వినడానికి అలవాటు పడడం వలన అలా ఈ జనాల్లో శ్రీ రామరాజు ని సీతారామరాజు ల మారి ఉండొచ్చు అని అంటుంటారు. ఈ రెండిటిలో ఏది అసలు కారణం అని స్పష్టత దొరకలేదు.