కుంభకర్ణుడి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు
భారతీయులందరూ భక్తితో తలుచుకునే పవిత్రమైన గ్రంథము రామాయణము. శ్రీ రామాయణము భారత దేశ సంస్కృతికి ఆచరణ వ్యవహారాలకు ఆధారము రామాయణాన్ని చదవడము వల్ల మనిషి తన జీవితాన్ని సత్యము మరియు మానవత్వంతో ఎలా గడపాలో నేర్చుకుంటాడు. రామాయణాన్ని ఎన్నిసార్లు విన్న ప్రతిసారి ఓ కొత్త విషయము తెలుస్తుంది. రామాయణానికి సంబంధించిన కథలు ప్రేరణను మరియు ఆసక్తిని కలిగిస్తాయి. రామాయణము పేరుకున్న పాత్రలని ప్రభావంతమైనవి ప్రతి పాత్రకి సంబంధించిన కథ ప్రేరణదాయకంగా ఉంటుంది. అనేక విషయాలు రామాయణంలో అన్ని పాత్రలు లాగానే కుంభకర్ణుడి పాత్ర కూడా చాలా ఆసక్తిగా మరియు అద్భుతంగా ఉంటుంది. కుంభకర్ణుడు అనే పేరు వినగానే మనకి నిద్ర మరియు ఆకలి అనే రెండు విషయాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఈ రెండు విషయాల వల్లే ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రించి కేవలము ఒక్కరోజు మాత్రమే మెలకువతో ఉంటాడు. కుంభకర్ణుడు అధికంగా నిద్రపోతాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అలా నిద్రపోవడానికి కారణము చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. కుంభకర్ణుడు యొక్క నిద్ర వెనక అసలు కారణము మరి అతనికి ఆరు నెలలు నిద్రపోయే శాపము లాంటి వారము ఎందుకు లభించాయి. అతను తన అన్న రావణుడిని యుద్ధము ఆపమని మరియు సీతామాతను శ్రీరాముడి దగ్గరికి పంపించి క్షమాపణ కోరుకోమని ఎందుకు అన్నాడు. కుంభకర్ణుడిని జ్ఞాని మరియు ధర్మపద్ధంగా నడుచుకునే రాక్షసుడు అని చెప్పే కథను కూడా తెలుసుకోబోతున్నాము.
రావణుడికి విభీషణుడు మరియు కుంభకర్ణుడు అనే ఇద్దరు తమ్ములు ఉన్నారు. వీరిలో కుంభకర్ణుడు రావణుడి చిన్న తమ్ముడు. కుంభకర్ణుడు యొక్క తల్లి తండ్రి కైకసి విశ్రావ. తల్లి రాక్షసుల జాతికి చెందింది మరియు తండ్రి బ్రాహ్మణ జాతికి చెందిన వాడు. రావణుడు మరియు తన ఇద్దరు సోదరులు రాక్షసుల అయినప్పటికీ వారిలో బ్రాహ్మణుల గుణము ఉండడానికి వారి తండ్రి కారణము. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ చాలా తెలివైనవాడు మరియు అపర శివ భక్తుడు. కుంభకర్ణుడు కూడా చాలా జ్ఞానవంతుడు మరియు ధైర్యవంతుడు. వీరిద్దరూ తమ తల్లితో ఎక్కువసేపు సమయము గడపడము వలన వీరిలో రాక్షస గుణాలు అధికంగా ఉన్నాయి. విభీషణుడు తన తండ్రితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. అందువల్ల అతనిలో రాక్షస గుణాలు కంటే మంచి గుణాలు ఎక్కువగా ఉండేవి. అందుకే విభీషణుడు శ్రీరాముడి ఒక్క గొప్ప భక్తులలో ఒకడిగా ఉన్నారు.
కుంభకర్ణుడు పొందిన శాపము
కుంభకర్ణుడు విశాల లాంటి శరీరము, అధిక మేధస్సు మరియు పర్వతాలనైనా పడగొట్టగల శక్తిని కలిగి ఉంటాడు. ఇతని శక్తి ముందు దేవేంద్రుడు కూడా భయపడేవాడు. మొదటినుంచి కుంభకర్ణుడికి తినడము అంటే అమితమైన ఆసక్తి. విశాలమైన శరీరమును కలిగి ఉండడము వలన వేల మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తను ఒకసారికే తినేవాడు. అతని సేన ఆహారాన్ని సేకరించడంలోనే అలసిపోయేది. ఎంత ఆహారాన్ని ఆరగించిన తన ఆకలి మాత్రము తీరేది కాదు. బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి స్వర్గము యొక్క సింహాసనాన్ని వరముగా కోరాలని కుంభకర్ణుడు భావించాడు. ఎందుకంటే దానివల్ల తన జీవితాంతము అంతా సరిపోయేలా ఆహారము లభిస్తుందని అనుకున్నాడు. ఈ విధమైన ఆలోచనతో కుంభకర్ణుడు తపస్సును మొదలుపెట్టాడు. కుంభకర్ణుడితో పాటు అతని ఇద్దరూ సోదరులు అయినా రావణ, విభీషణుడు కూడా తపస్సు చేస్తారు. అలా చాలా సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసము వీళ్లు తపస్సు చేశారు. కుంభకర్ణుడు కచ్చితంగా స్వర్గ సింహాసనాన్ని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు కాదనకుండా ఇస్తాడని భయంతో దేవేంద్రుడు సరస్వతి మాత దగ్గరకు వెళ్లి తన భయాన్ని సమస్యలు విన్నవించుకున్నాడు. తన మాటలు విన్న సరస్వతి సహాయము చేస్తానని మాట ఇచ్చింది. కుంభకర్ణుడు యొక్క కఠినమైన తపస్సు మెచ్చి ముగ్గురి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము అయ్యాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. కుంభకర్ణుడు తనకి కావాల్సిన ఇంద్ర సినిమాసాన్ని కోరుకోబోతున్నాడు. అదే సమయంలో సరస్వతీ మాత కుంభకర్ణుడి నాలుక మీద ప్రత్యక్షము అయ్యి ఇంద్ర సింహాసనానికి బదులుగా నిద్రాసనము కావాలని కుంభకర్ణుడితో పలికించింది. జరిగిన విషయాన్ని కుంభకర్ణుడు తెలుసుకునేలోపే బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పాడు. ఈ విషయము అర్థము అయిన తర్వాత కుంభకర్ణుడు బ్రహ్మ దేవుడిని వరాన్ని వెనక్కి తీసుకోమని కోరాడు. ఒక్కసారి ప్రసాదించిన వరాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడము అసాధ్యము అని బ్రహ్మదేవుడు చెప్తారు. కుంభకర్ణుడు తను చేసిన తప్పు పట్ల చాలా బాధపడ్డాడు. బ్రహ్మ దేవుడి ముందు చాలా ఏడ్చాడు. దీనిని చూసిన బ్రహ్మదేవుడు నేను వరాన్ని వెనక్కి తీసుకోలేను గాని దీన్ని ఒక ప్రభావాన్ని తగ్గించగలను అని చెప్పాడు. ఎల్లప్పుడూ నువ్వు నిద్రలోనే గడపకోకుండా ఆరు నెలలు మెలకువతో మరో ఆరు నెలలు నిద్రలో గడుపుతావు అని చెప్పి మాయము అయిపోయాడు. ఈ వరము కారణంగా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రలో ఉండేవాడు. నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత కడుపునిండా ఆహారాన్ని తీసుకునేవాడు. ఈ ఆరు నెలల సమయంలో లంకలోని ఆహారము అంత కేవలము అతని ఒక్కడికే సరిపోయేది. తన ఆకలి తీరకపోతే చాలా కోపానికి వచ్చి కనబడిన ప్రతి వస్తువును తినేవాడు. రావణుడు తన తమ్ముడి ఈ ప్రవర్తన వల్ల చాలా భయపడేవాడు మరియు లంక నగరపు ప్రజల కోసము చాలా బాధపడేవాడు. రావణుడు మరోసారి బ్రహ్మ దేవుడి కోసము తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షము అయినప్పుడు కుంభకర్ణుడు యొక్క ఆరు నెలలు మేల్కొని ఉండే వరాన్ని మార్చమని కోరుతాడు. బ్రహ్మదేవుడు ఆరు నెలలు నిద్రపోయి కేవలము ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండేలా వరాన్ని ఇస్తాడు. దీనివల్ల అత్యంత శక్తివంతుడైన రాక్షసుడు కుంభకర్ణుడి జీవితమంతా నిద్రలోనే గడిచిపోయింది. ఆరు నెలలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే మేలుకునేవాడు. మేలుకున్న ఒక్కరోజులో ఇష్టము ఉన్న ఆహారాన్ని స్వీకరించి మద్యాన్ని తాగి నిద్రపోయేవాడు.
రామాయణంలో కుంభకర్ణుడి ప్రస్తావన
రామాయణంలో కుంభకర్ణుడి ప్రస్తావన సీతామాతను తీసుకురావడానికి శ్రీరాముడు వానర సైన్యంతో రావణ లంకకు వెళ్లి బీకర యుద్ధాన్ని జరుగుతున్న సమయంలో వస్తుంది. రావణ మహా సైన్యము కూడా రాముడు అతని సైన్యము ముందు నిలవలేక పోతుంది. దాంతో రావణుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు. కుంభకర్ణుడి సహాయము తీసుకొని యుద్ధంలో గెలవాలని రావణుడు భావిస్తాడు. కానీ ఆ సమయానికి కుంభకర్ణుడు నిద్రలో ఉంటాడు. నిద్రలో ఉన్న కుంభకర్ణుడికి మెలుకువ తెప్పించడం తేలికైన విషయము కాదు. కుంభకర్ణుడికి మెళుకువ తెప్పించడానికి రావణుడు తన సైన్యని నియమించాడు. రావణుడు యొక్క సైన్యము సూలాలు, బళ్లాలు మరియు ముళ్ళ కర్రలను పట్టి కుంభకర్ణుడికి మెలకువ రావడానికి అతని శరీరాన్ని పొడవడము జరిగింది. ఇంకా రకరకాల వాయిద్యాలు మొగిస్తూ అతనికి మెలకువ తెప్పించడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కుంభకర్ణుడిలో కొంచెము కూడా చరణము రాలేదు. కుంభకర్ణుడు భోజన ప్రియుడు కాబట్టి విశిష్టమైన ఆహారాన్ని తీసుకువస్తే అతను మేల్కొనే అవకాశము ఉందని సైన్యానికి అనిపించింది. ఆ ఆలోచన వచ్చినట్టుగానే సైన్యము రకరకాల రుచికరమైన ఆహారాన్ని కుంభకర్ణుడు వద్దకి తీసుకొని వచ్చారు. ఆ ఆహారాన్ని సువాసన రాగానే కుంభకర్ణుడు మేలుకుంటాడు. కడుపునిండా ఆహారాన్ని తిన్న తర్వాత తన అన్నయ్య రావణుడి వద్దకు బయలుదేరుతాడు. సీతామాతను అపహరించిన విధానాన్ని, శ్రీరాముడు తన వానర సైన్యాన్ని తీసుకొని లంక పై యుద్ధానికి వచ్చిన విషయాన్ని, తర్వాత ఆ యుద్ధంలో తన ఆప్తులు బంధుమిత్రులు మరియు అనేక సైనికులు మరణించడాన్ని రావణుడు కుంభకర్ణుడితో చెప్తాడు. నేను కూడా రాముడు చేతిలో ఓడిపోయానని అందుకు నిన్ను సమయానికన్నా ముందే నిద్ర లేపే పరిస్థితి వచ్చిందని రావణుడు అంటాడు. రావణుడిని కలిసిన తర్వాత జరిగిన విషయాలు అన్నిటి పట్ల అవగాహన వస్తుంది. శ్రీరాముడు మరియు సీతాదేవి సామాన్యమైన మానవులు కాదని శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అవతారాలు అని కుంభకర్ణుడు గ్రహించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అని ఉదారణంగా చూపించి సీతాదేవిని రాముడి వద్దకు పంపించి క్షమాపణలు కోరుకోమని కుంభకర్ణుడు రావణుడితో అంటాడు. ఒకవేళ నువ్వు నా మాట వినకుంటే రాక్షస జాతి అంతము అవడము తథ్యము అని కుంభకర్ణుడు అంటాడు. కుంభకర్ణుడి మాటలు విన్న తర్వాత రావణుడికి విపరీతమైన కోపము వస్తుంది. అతను సలహాలు ఇవ్వడము మానేసి యుద్ధానికి వెళ్ళమని ఆదేశము ఇస్తాడు. రావణుడిని మార్చడము సాధ్యమైన పని కాదని గ్రహించి కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్లి విష్ణుమూర్తి అవతారము అయినా రాముడి చేతిలో మరణించడమే మంచిది అని భావించి యుద్ధానికి వెళతాడు. తన విశాల మైన శరీరంతో వచ్చిన కుంభకర్ణుడిని చూసి వానర సైన్యము భయభ్రాంతులకు గురి అవుతుంది. కుంభకర్ణుడిని చూసి కుంభకర్ణుడితో మాట్లాడడానికి వచ్చిన విభీషణుడు ధర్మవంతుడైన శ్రీరాముడితో కలిసి ధర్మము వైపు ఉండమని అడుగుతాడు. లంకకు రాజు అయిన రావణుడి మాటను పాటించడమే నా ధర్మము అని కుంభకర్ణుడు విభీషుణుడితో అంటాడు. అంతేకాకుండా విభీషణుడు చేసిన తప్పు కాదని అతనిని తన ధర్మాన్ని పాటించమని తాను తన ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పి కుంభకర్ణుడు ముందుకు బయలుదేరుతాడు. కొద్ది సమయంలోనే కుంభకర్ణుడు యుద్ధభూమిలో చాలా నష్టాన్ని కలిగిస్తాడు. దొరికిన వారిని దొరికినట్టుగా తినేసేవాడు. లక్ష్మణుడు హనుమంతుడు మరియు అంగదుడు అలాంటి వీరులు అతని ఆపడానికి ప్రయత్నించి ఓడిపోతారు. వానర రాజు అయిన సుగ్రీవుడిని బంధించి రావణుడు దగ్గరికి తీసుకొని వెళితే రాజులేని సైన్యము భయభ్రాంతులకు గురి అయ్యి పారిపోతుందని కుంభకర్ణుడు ఆలోచిస్తాడు. ఆలోచించిన విధంగానే సుగ్రీవుడిని బంధించి రావణుడు వద్దకు తీసుకొని వెళుతుంటాడు. ఆ సమయంలో శ్రీరాముడు అతని ముందు నిలబడతాడు. తన ముందుకు నారాయణుడే వచ్చి నిలబడ్డాడు అని తన అంతము తద్యము అని కుంభకర్ణుడు భావిస్తాడు. తన చేతిలో చనిపోవడానికి అతనికి ఎటువంటి బాధ లేదు. అయినప్పటికీ పోరాడకుండా ఉండి మరణిస్తే తనకు అవమానమని భావిస్తాడు. శ్రీరాముడికి కుంభకర్ణుడికి మధ్యలో భీకరమైన యుద్ధము జరుగుతుంది. చివరికి శ్రీరాముడు ఇంద్ర అస్త్రని ఉపయోగించి కుంభకర్ణుడి యొక్క రెండు భుజాలని నరికేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ దండ అశ్రాన్ని ప్రయోగిస్తాడు. ఇంకా అంతే కుంభకర్ణుడి తల ఎగిరి సముద్రంలో పడింది. ఈ విధంగా కుంభకర్ణుడు మరణిస్తాడు. రావణుడికి కుంభకర్ణుడి మరణం గురించి తెలిసిన తర్వాత ఏడుస్తాడు. దేవేంద్రుడు అంతటివాడే తన తమ్ముడిని ఓడించలేడని అటువంటిది సామాన్య మానవుడు నా తమ్ముడిని ఏ విధంగా చంపాడని రావణుడు తనలో తానే ఆలోచిస్తాడు. ఆ సమయంలో శ్రీరాముడు సామాన్యమైన మానవుడు కాదని మహావిష్ణువు యొక్క అవతారము అని కుంభకర్ణుడు చెప్పిన మాటలు రావణుడికి గుర్తుకు వస్తాయి.