పరశురాముడి చరిత్ర
కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాల మధ్య రక్తపు మడుగులలో అడుగులు వేస్తూ నడుముకి పులి చర్మాన్ని కట్టుకొని రాక్షస వీరుల రక్తంతో అభిషేకించిన గండ్ర గొడ్డలిని చేతితో పట్టుకొని చింత నిప్పులాంటి కళ్ళతో వజ్రం లాంటి శరీరంతో వేట ముగించుకొని వస్తున్న మృగరాజుల ఒక వ్యక్తి చీకటి లోకం నుంచి వెలుగుల్లోకి అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. అతను ఎవరో కాదు మహావీరుడు. సాక్షాత్తు పరమశివుడి సప్త చిరంజీవులలో ఒకడు. పితృ వాక్ పరిపాలకుడు పరశురాముడు. శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలల్లోకి అత్యంత ఉగ్రమైన అవతారం పరశురామ అవతారము.
పరశురాముడి జననము
పూర్వము కన్యాకుప్చ నగరాన్ని గాది అనే రాజు పరిపాలించేవాడు. అతని కుమార్తె పేరు సత్యవతి. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెను వివాహం ఆడాలని ఎంతో మంది రాజులు కోరుకునేవారు. అయితే భృగు మహర్షి ఒక్క కుమారుడైన రుచికుడు అనే బ్రాహ్మణుడు కూడా సత్యవతిని చూసి ప్రేమించేవాడు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలని భావించి ఆమె తండ్రి అయిన గాది వద్దకు వెళ్లి తనకు అతని కూతురు సత్యవతి తో వివాహం జరిపించమని కోరాడు. అప్పుడు గాది రుచికూడినితో మునివర్యా ఎవరైతే కన్యాశులకం కింద ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే వెయ్యి గుర్రాలను కానుకగా ఇస్తారో అతడికి మాత్రమే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. అది విన్న రుచ్చికుడు వెంటనే గంగా నదికి వెళ్లి వరుణ దేవుడు కోసమై ఘోర తపస్సు ఆచరించాడు. రుచికుడి తపస్సుకి ప్రసన్నుడు అయినా వరుణ దేవుడు గంగా నదిలో నుంచి ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగిన 1000 గుర్రాలను పుట్టించాడు. దీనికి కారణం గానే గంగా నదికి అశ్వతీర్థము అనే పేరు కూడా వచ్చింది. ఆ తరువాత రుచికుడు అశ్వాలను తీసుకొని వెళ్లి గాదికి ఇచ్చారు. దాంతో సంతోషించిన గాది రుచికుడికి సత్యవతికి అత్యంత వైభవముగా వివాహం జరిపించారు. అలా కొంతకాలం గడిచింది. అయితే గాది దంపతులకు మగసంతానం లేదు. ఒక్కగానోక కూతురిని కూడా రుచికుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. దాంతో ఆ రాజ్యానికి వారసుడు లేకుండా పోయింది. ఈ విషయం గురించి చింతిస్తూ తమకు మగసంతానం కలగాలని ఆ దంపతులు ఎన్నో యజ్ఞ యాగాలు చేసిన ఫలితం లేదు. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి ఒకరోజు రుచికునితో నాద పుత్రులు లేక నా తల్లితండ్రులు, కాబోయే రాజు లెక్క ఈ రాజ్యం తల్లడిల్లిపోతుంది కాబట్టి నాకు నా తల్లికి పుత్రులు కలిగేలా అనుగ్రహించండి అని కోరింది. భార్య మాట కాదనలేక రుచీకుడు ఒక మహాయాగం నిర్వహించి యాగము ఫలితంగా వచ్చిన అవిషును పానీయ రూపంలో రెండు పాత్రలలో నింపి ఆ పాత్రలను తన భార్యకి ఇచ్చారు. సత్యవతి ఈ పాత్రలోను నీరు తాగితే మహావీరుడు తేజోశక్తిసంపన్నుడు క్షత్రియ లక్షణాలు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. కాబట్టి దీనిని మీ తల్లికి ఇవ్వు. ఈ పాత్రలోను నీరు తాగితే మహా జ్ఞాని తప్పో ధనుడు వేద వేదాంగ పారాంఘతుడు అయిన బ్రాహ్మణ ఉత్తముడు జన్మిస్తాడు కాబట్టి ఇది నువ్వు తాగు అని చెప్పి రుచికుడు స్థానానికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అయితే రుచికుడు చెప్పిన విషయం మరిచిన సత్యవతి పొరపాటున తన తల్లికి ఇవ్వవలసిన పాత్రలోని నీరు తను త్రాగి తన పాత్రను తన తల్లికి ఇచ్చింది. స్నానం ముగించుకొని వచ్చిన రుచికుడు దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. తన భార్య వైపు చూస్తూ సత్యవతి నేను నిన్ను తాగమని ఇచ్చిన పాత్రను నీ తల్లికి ఇచ్చి నీ తల్లి పాత్రలో నీటిని నువ్వు తాగావు దీని ఫలితంగా నీ గర్భాన అత్యంత పరక్రమవంతుడు క్రూరస్వభావము కలిగే వాడు, సమస్త క్షత్రియ వంశాల నాశరానికి కారణమయ్యే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. చేసిన తప్పు తెలుసుకొని దూకితురాలైనా సత్యవతి భర్తను శరణు వేడుతూ నాద నాకు అసలు పుత్రుడే లేకపోయినా పర్వాలేదు. కానీ ఇతరులని హతమార్చే కుమారుడు మాత్రం వద్దు అంటూ మొరపెట్టుకునింది. భార్య ఆవేదనను అర్థం చేసుకున్న రుచికుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నీ కుమారుడికి బదులుగా నీ మనవడు క్రోధ స్వభావంతో జన్మిస్తాడు. దుర్మార్గులైన క్షత్రియులు అయిన అందరిని వధించి చిరంజీవిగా కీర్తిని గడిస్తాడు అని అనుగ్రహించాడు. దాంతో సత్యవతి మనస్సు కొంత కుదుటపడింది. ఆ తరువాత కొంతకాలానికి సత్యవతి గర్భము ధరించింది. ఆమె గర్భాన మహా జ్ఞాని తపోశక్తి సంపన్నుడు అయినా జమదగ్ని జన్మించాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్ని ప్రెస్ సేనచీత్తుడు అనే రాజు ఒక కుమార్తె అయిన రేణుక అనే కన్యను వివాహం చేసుకున్నారు. వారికి రమన్ మంతుడు, సుశైనుడు, వసుడు, విశ్వావసుడు అనే నలుగురు పుత్రులు జన్మించారు. ఆ తరువాత వారందరిలోకి చిన్నవాడిగా జమదగ్ని 5వ కుమారుడిగా క్షత్రియ గుణాలతో పరశురాముడు జన్మించాడు. పరశురాముడినే భార్గవ రాముడు అని కూడా అంటారు.
పరశురాముడు రాక్షసుల తో చేసిన యుద్ధము
పరశురాముడి అన్నయ్యలు అందరూ సకల వేదాలను శాస్త్రాలను అభ్యసించారు కానీ పరశురాముడికి మాత్రం వేదజ్ఞానం కంటే యుద్ధ విద్యలలో, ఆయుధాశిక్షణలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ మక్కువతోనే సంపూర్వ ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అయితే అతనికి తృప్తి కలగలేదు. ఇంకా తను పొందాల్సింది ఏదో ఉందని భావించి ఈ సృష్టిలోని సమస్త జ్ఞానానికి సర్వశక్తులకు ఆద్యుడు అయిన ఆ పరమేశ్వరుడిని మెప్పించి ఆయన వద్దే విద్య బ్యాషము చేయాలని శంకల్పముతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి ప్రత్యక్షమై పరమశివుడు పరశురాముడు వైపు చూస్తూ నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా పరశురాముడు స్వామి నన్ను శిష్యుడిగా స్వీకరించి తమరి వదనే ఉన్న దివ్యాస్త్రలకు సంపదనను ప్రసాదించండి అని కోరాడు. దానికి మహా శివుడు రామా నేను ప్రసాదించే దివ్యాస్త్రలను తట్టుకోనే శక్తి ప్రస్తుతం నీకు లేదు. ఈ అక్షరాలను పొందాలంటే మనసు అలాగే శరీరం రెండు ఎంతో దృఢంగా నిష్కల్మషంగా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ దివ్యాస్త్రలను వారి ఆధీనంలో ఉంచుకోగలరు. అలా కాని పక్షంలో అదే వారిని దాహించి వేస్తాయి. కాబట్టి మొదట నీ మనసు, నీ ఇంద్రియాలను అదుపు చేయడం నేర్చుకో. ఆ తర్వాత దివ్యాస్త్రలను నీకు లభిస్తాయి అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు మహాశివ దివ్యాస్త్రలను పొందడానికి నేను ఎప్పుడూ అర్హుడిని అని మీరు భావిస్తారో అప్పుడే వాటిని నాకు ప్రసాదించండి. అప్పటివరకు మీ సేవా భాగ్యం కల్పించండి ప్రభు అని కోరాడు. దానికి శివుడు తధాస్తు అని ఆశీర్వదించాడు. అప్పటినుంచి పరశురాముడు అత్యంత నిష్టతో పరమశివుడిని సేవిస్తూ ఇంద్రియాలను మనసును నిగ్రహించడం నేర్చుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది ఒకరోజు పరమేశ్వరుడు తన భార్య పార్వతికి పరశురాముడిని చూపిస్తూ దేవి ఇతడు రాముడు నాకు ప్రియ భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తున్నాడు అని చెప్తుండగా ఇంతలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి పరమశివుడికి నమస్కరించి మహాదేవ రోజు రోజుకి రక్షసుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. వారు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. మీరే ఎలాగైనా వారి భారీ నుంచి మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడే ఉన్న పరశురాముడి వైపు చూస్తూ రామ నువ్వు దివ్యాస్త్రలను పొందడానికి సరైన సమయం ఆశనము అయ్యింది. కానీ నువ్వు దేవతల ఇతం కోసం ఒక కార్యం నీవేర్చాల్సింది ఉంది అని అన్నాడు. అది విన్న పరుశురాముడు ప్రభు మీరు ఆదేశించడమే ఆలస్యం అది ఎంత కఠినమైన కార్యం అయినా సాధించుకొని వస్తాను అని అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు తన వద్దన ఉన్న దివ్యాస్త్రలను మహా శక్తివంతమైన ఆయుధాలను పరశురాముడికి ప్రసాదించి రామ వీటి సహాయంతో నీవు రాక్షసులను నిర్జించి వారి అక్రమాలను అరికట్టాలి అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు అలాగే ప్రభు అని చెప్పి చేతిలో ధనస్సును పట్టుకొని వీపుకు రెండు వైపులా రెండు బళ్లాలని తొడుక్కొని వాటి మధ్యలో గధ జోడించి నడుముకి కరవాలాన్ని కట్టుకొని సకల దేవతల ఆశీస్సులు తీసుకొని పరశురాముడు రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అసుర సైన్యానికి పరశురాముడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కారు చీకట్లను పోలిన రూపంతో పర్వతాలను తలపించే భారీ ఆకారాలతో ఒక్కసారిగా తన మీదకు దూకిన రాక్షసులను చూసి ఏ మాత్రం చలించక గధ, కత్తి, బల్లెం ఇలా వివిధ రకాల ఆయుధాలను ఒక్కొక్కటిగా ప్రయోగిస్తూ తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్లే చంపుతున్నాడు పరశురాముడు. అసలు అతడు బాణాలు వేసే వేగానికి రాక్షసుల గుండెలు అదురుతున్నాయి. అతడు ఎప్పుడు బాణాలు తీస్తున్నాడు ఎప్పుడు వేస్తున్నాడు ఎవరికి అర్థం కావడం లేదు. క్షణానికి ఒక శవం నేలకూలుతాంది. కానీ పరశురాముడు ఎంత కొడుతున్నా అంతకు రెట్టింపు సంకెల్లో రాక్షసులు అతడి మీదికి ఉరికి వస్తున్నారు. దాంతో వీరిపై దయ చూపి ప్రయోజనం లేదని భావించిన పరుశురాముడు అప్పటివరకు తను చంపిన రాక్షసుల శవాలను పడి ఉంటే ఆ శవాల మీదకు దూకి తన చెయ్యి పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఓ పరశువా ఆ పరమేశ్వరుడి ఆదేశాన్ని శిరసా వహించి నన్ను అనుగ్రహించు అని పిలిచాడు. వెంటనే ఆకాశంలో మెరుపులన్నీ ఒక్కటయ్యి అతడి చేతిలోకి చేతిలో ఒక గొడ్డలి ప్రత్యక్షం అయింది. అప్పుడు పరశురాముడు ఆ గొడ్డలిని రాక్షసుల మీదకు విసరగానే అది అత్యంత వేగంగా గాలిలోకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్న రాక్షసుల అందరిని చంపి తిరిగి మళ్లీ పరశురాముడు చేతిలోకి వచ్చి చిక్కుకుంది. ఆ విధంగా అత్యంత పరాక్రమంతో పరశురాముడు సమస్త రాక్షసులను నిర్జించి ఒంటినిండా గాయాలతో, రక్తపు మడుగులో మునిగి తేలినట్టుగా శరీరం అంత రక్తాన్ని పులుక్కొని రాక్షసుల నెత్తుటిని ధారలతో అభిషేకించిన గొడ్డలిని చేతో పట్టుకొని రాక్షస లోకం నుంచి తిరిగి కైలాసానికి వచ్చి మీరు అప్పగించిన కార్యము పూర్తి అయింది ప్రభు అంటూ పరశురాముడు మహా శివుడి వద్దకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు తన చేతులతో పరశురాముడి శరీరమంతా తడిమేడు. వెంటనే పరశురాముడి శరీరంలోని గాయాలన్నీ మాని అతని దేహం వజ్రంలా ప్రకాశించింది. అప్పుడు పరమేశ్వరుడు పరశురాముడి వైపు చూస్తూ నా స్పర్శ వలన నీ శరీరం వజ్ర సమానం అయింది. ఇకనుంచి ఎటువంటి అస్త్రశాస్త్రాలు, ఆయుధాలు నిన్ను గాయపరచలేవు అని చెప్పి పరశురాముడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ఆ విధంగా పరమేశ్వరుడి వద్ద ఎన్నో దివ్యాస్త్రాలను పొంది పరశురాముడు తిరిగి తన తండ్రి ఆశ్రమానికి వచ్చాడు.
పరశురాముడిని చిరంజీవిగా వరన్ని ప్రశదించడము
పరశురాముడు వచ్చేసరికి జమదగ్ని ఒక మహాయాగం నిర్వర్తిస్తున్నారు. అయితే ఒకరోజు ఆ యాగానికి కావాల్సిన నీటిని తీసుకురావడము కోసము రేణుక ఒక సరసు వర్దకు వెళ్ళింది. ఆ సరస్సులోని నీటిని తీసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా అదే సరస్సులో చిత్రార్థుడు అనే రాజు తన రాణులతో జలకాలాడడం చూసింది. అది చూసిన రేణుక మనసు చెల్లించింది. ఆమె చేతిలోని నీటి కుండా చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియని ఆమె ఒట్టి చేతులతో ఆశ్రమానికి వచ్చింది. అయితే భార్యను చూసిన జమదగ్ని దివ్య దృష్టితో జరిగిన విషయము తెలుసుకున్నాడు. అతడికి కోపము కట్టలు తెంచుకుంది. చింత నిప్పులాంటి కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఒక పవిత్ర కార్యసాధన కోసమని నిన్ను పంపితే అది మరచి కామ వాంఛలకు లోనయ్యి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఈ మహా యజ్ఞాన్ని నాశనం చేశావు అని పలికి పక్కనే ఉన్న తన నలుగురు పుత్రుల వైపు చూస్తూ తన భార్యను చంపమని ఆదేశించాడు. కానీ తల్లిని చంపడము మహా పాపమని తాము అలా చేయలేమని జమదగ్ని చెప్పిన పనికి నిరాకరించారు. దాంతో మరింత ఆగ్రహించిన జమదగ్ని తన నలుగురు పుత్రులను అడవుల్లో క్రూర మృగాలుగా తిరగమని శపించారు. ఆ తరువాత భార్గవ అని గట్టిగా అరిచాడు. అది విన్న పరశురాముడు వెంటనే గృహంలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు జమదగ్ని భార్గవ నీ తల్లిని చంపు అని తన మాటను పూర్తిచేసేలోపే అది గ్రహించిన పరుశురాముడు మారు మాట్లాడక తన చేతిలో ఉన్న గొడ్డలిని రేణుక మీదకు విసిరాడు. ఆ గొడ్డలి అత్యంత వేగంగా వెళ్లి తన తల్లి తలను తెగ నరికింది. అది చూసిన జమదగ్ని పరశురాముడి పితృభక్తికి సంతోషించి అతని ఏదైనా వరము కోరుకోమని అని అన్నాడు. అప్పుడు పరశురాముడు తండ్రి ముందు నా తల్లిని బ్రతికించి, నా అన్నలను మామూలు మనుషులు చేయండి. అలాగే వారికి జరిగిన విషయాలు ఏవి గుర్తుకు లేకుండా వరన్ని ప్రసాదించండి అని కోరారు. దాంతో వెంటనే జమదగ్ని తన భార్యను మరియు కుమారులను బ్రతికించి పరశురాముడి వైపు చూస్తూ పుత్ర నీ పితృభక్తికి బుద్ధి కుసతలకు ప్రసన్నుడిని అయ్యాను. నీకు మృత్యువు అనేది లేకుండా చిరంజీవి తత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని పరశురాముడిని ఆశీర్వదించాడు.