వినాయక చవితి కథ
మన సంస్కృతిలో మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. విరిలో ఎవరిని పూజించాలి అన్న మనము ముందుగా పూజించేది విజ్ఞ నాయకుడు వినాయకుడు. శుభ కార్యకుడైన విగ్నేశ్వరుడు పుట్టగానే కన్నతండ్రి తన శిరస్సుని ఖండిస్తే ఏనుగు తలతో జీవితాన్ని నిచ్చలంగా గడుపుతూ తల్లితండ్రులని దైవంగా భావించి గణాధిపతిగా ప్రథమ పూజ్యుడిగా పూజలు అందుకుంటున్న వినాయకుడి జీవితం మనకు ఆదర్శప్రాయము. వినాయక చవితి రోజు సమంతకమని కథను వినడము ద్వారా మనకు మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి కష్ట సమయాలలో కూడా ధైర్యంగా ఎలా ఉండాలో తెలుస్తుంది.
వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి మధ్య పోటీ
పూర్వము ఒకనాడు కైలాసగిరిలో శివపార్వతుల పుత్రుడైన వినాయకుడు మరియు కార్తికేయలలో గణాధిపత్యము ఎవరికి చెందుతుందానీ ప్రశ్నను దేవతలు సందేహము వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అలాగే సమస్త గణాలకు అధిపతిని నిర్ణయించడానికి పరమశివుడు దేవతలు అందరి సమక్షంలో పుత్రుల వైపు చూస్తూ కుమారుల్లారా మీలో ఎవరైతే ఈ సమస్త విశ్వాన్ని మూడుసార్లు చుట్టి మధ్యలో కనపడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానము ఆచరించి ముందుగా ఇక్కడికి తిరిగి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్పారు. తండ్రి చెప్పి చెప్పగానే కార్తికేయుడు తన వాహనము అయిన నెమలి మీదికి ఎక్కి నెమలి వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయారు. కానీ వినాయకుడు మాత్రము ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా వెనక్కి తిరిగి తన తల్లిదండ్రులైన శివపార్వతుల వద్దకు వచ్చి చేతులు జోడించి వారికి నమస్కరించారు. అది చూసి ఆశ్చర్యపోయిన దేవతలు ఏమిటి ఇది గణేశా ఒకపక్క నీ తమ్ముడు పోటీకి సిద్ధపడి వేగంతో లోకాన్ని చుట్టి వస్తుంటే నీవు ఈ సమయంలో ఇలా చెయ్యడం ఏమిటి అని వాపోయారు. అప్పుడు వినాయకుడు వారితో ఎవరైతే తన తల్లిదండ్రులను దైవంగా భావిస్తారు వారికి ఈ సమస్థ సృష్టి వారి తల్లిదండ్రులలోనే కనిపిస్తుంది. ఇక వారి చుట్టూ చేసే ప్రదక్షిణలు ఈ విశ్వంలో అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చే ఫలితానికి తక్కువ ఏమి కాదు అని చెప్పాడు. శివపార్వతుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేస్తూ కైలాసం లోనే ఉండిపోయాడు. అయితే మరోవైపు కార్తికేయుడు విశ్వానంత చ్చుడుతూ 3 కోట్ల 50 వేల నదులను సందర్శించాడు. అయితే ఏ నది దగ్గరికి వెళ్లిన వినాయకుడు అంతకుముందే ఆ నదిలో స్నానము చేసి ఎదురు వస్తున్నట్టుగా కనిపించాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు కార్తికేయుడు. అయినా సరే తన పట్టు విడవకుండా అత్యంత వేగంగా విశ్వాన్ని మూడుసార్లు చుట్టి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. కానీ కార్తికేయుడు తిరిగి వచ్చేలోపే కైలాసగిరి అంతా పండుగ వాతావరణంగా మారింది. వినాయకుడిని విజేతగా గుర్తించి ఆయనకు గణాధిపత్యం అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయుడికి వినాయకుడు తల్లిదండ్రుల పట్ల భక్తి విధేయతని విజయానికి కారణమని తెలుసుకొని తన అహంకారానికి చిందించి తన అన్న వినాయకుడు గణాధిపత్యం దక్కినందుకు ఆనందపడ్డాడు. అయితే తమపై వినాయకుడు చూపిన భక్తిశ్రద్ధలకు పరవశించి పోయిన బోలా శంకరుడు వినాయకుడు వైపు చూస్తూ పుత్ర ఇప్పటినుండి జనులు ఏ పూజ చేసినా ఏ వ్రతము నోచిన అందులో ప్రధమ పూజ నీకే దక్కుతుంది. మొదట నిన్ను పూజించి మొదలుపెట్టిన కార్యములోని సకల విజ్ఞాలు తొలగి ఆ కార్యము సంపూర్ణము అవుతుంది అని ఆశీర్వదించారు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు విగ్నేశ్వరుడు అయ్యాడు.
భాద్రపద రోజు చంద్రునికి కలిగిన శాపము
భాద్రపద రోజు అన్ని దేశాలలో భక్తులందరూ విగ్నేశ్వరుడికి అనేక రకాలు అయినా పిండి వంటకాలు, కుడుములు, పాలు, అరటి పండ్లు ఇలా అనేక రకాల వంటకాలను సమర్పించారు. వినాయకుడు ఆహార పదార్థాలను కడుపునిండా ఆరగించి తన వాహనమైన మూషికముకు పెట్టి చీకటి పడే వేళకు కైలాసానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలాగే తల్లిదండ్రుల చరణాలకు నమస్కరిస్తామని కిందికి వంగారు. కానీ అది తన వల్ల కాలేదు. ఎంత ప్రయత్నించినా పొట్ట వంగడం లేదు. చేతులు నేలని తాకడము లేదు. అలా విగ్నేశ్వరుడు పడుతున్న అవస్థను చూసి శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు పక్క పక్క నవ్వాడు. చంద్రుడు చూపుకు వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న ఆహారము అంతా బయటపడింది. అది చూసిన పార్వతీదేవి త్రివ దుఃఖానికి లోనయ్యి దీనికి కారణమైన చంద్రుడి వైపు చూస్తూ ఓరి పాపాత్ముడా నీ చూపు సోకి నా కొడుకు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్లు పాపాత్ములు అయ్యి నీలాప నిందలు పొందుతారు అని శపించింది. అయితే సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి ఈ విషయం తెలుసుకొని వెంటనే తాను అక్కడ ప్రత్యక్షము అవుతారు. వినాయకుడిని తిరిగి బ్రతికించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అంతలో దేవతలు అందరూ పరుగు పరుగున అక్కడికి చేరుకొని పార్వతి దేవిని వేడుకునారు. అమ్మ నీవిచ్చిన శాపము ఈ లోకానికి ముప్పు. దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని ప్రాదాయపడ్డారు. దానితో పార్వతీదేవి శాంతించి ఏ రోజు అయితే చంద్రుడు చూసి నవ్వాడు ఆ ఒక్కరోజు మాత్రము ఈ శాపము ఫలిస్తుంది అని శాప విముక్తిని కలిగించింది.
శ్రీ కృష్ణుడి పైన పడిన నీలాప నిందలు
భాద్రపద శుద్ధ చతుర్థి అలా కాలము గడిచి ద్వాపర యుగము వచ్చింది. నారదుడు లోకాలన్నీ సంచరిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చంద్రుడి శాపము విషయము గురించి చెప్పి తెలియజేసి ఆ శాపము పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను త్వరగా వెళ్లాలి అంటూ తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అది విన్న శ్రీకృష్ణుడు ఈరోజు చంద్రుడిని చూడొద్దని ప్రజలందరికీ ప్రచారము చేశాడు. అయితే కృష్ణుడికి పాలు మీద ఉన్న ఇష్టంతో అంతపురము నుంచి బయటకి వచ్చి చంద్రుడిని చూడకుండా ఆవు దగ్గరికి చేరుకొని స్వయంగా తానే పాలు పితుకుతూ ఉండగా ఆ పాలల్లో చంద్రుడి ప్రతిబింబము కనపడింది. అది చూసిన శ్రీకృష్ణుడు అయ్యో నేనేమీ నీలాపనిందలు పడాలో కదా అని చిందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్ శ్రీకృష్ణుడు దర్శనార్థమై వచ్చాడు. అతడు సూర్య భగవానుడి కోసము తపస్సు చేసి సమంతకమణిని విలువైన మణిని వరంగా పొందాడు. ఆ మణి ఉన్నచోట ఎటువంటి కరువు గాని రోగాలు గాని ఉండవు. అయితే ఆ సమంతకమణి ని చూసి ముచ్చట పడిన శ్రీకృష్ణుడు ఆ మణి ని తనకు ఇవ్వమని సత్రాజిత్ ని అడుగుతారు. మణి ని ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు. దానికి శ్రీకృష్ణుడు ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఓ రోజు సత్రాజిత్ తమ్ముడైన ప్రేసేనుడు ఆ మణి నీ తన మెడలో వేసుకొని వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహము ఆ మణి ని చూసి మాంసము అనుకొని అతన్ని చంపి మణి ని తీసుకొని పోతుండగా జాంబవంతుడు అనే ఒక బలుకము ఆ సింహాన్ని చంపి సమంతకమణి ని తన గృహకి తీసుకుపోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. అయితే ఈ విషయము తెలిసిన సత్రాజీత్ నన్ను మణి అడుగితే ఇవ్వలేదని శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి సమంతకమణి ని దొంగతనము చేశాడు అని లోకమంతా చాటింపు వేశాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తాను భయపడినట్లుగానే తన మీద నీలోపనిందలు పడడంతో వాటిని ఎలాగైనా రూపుమాపుకోవాలని భావించి సపరి వారి సమేతంగా అడవికి వెళ్లి వెతకడము సాగించారు. అక్కడ తన కంటికి ప్రేసేనుడి శవము, సింహము, ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి. ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్లిన శ్రీకృష్ణుడు ఒక గృహ వద్ద చేరుకున్నాడు. ఆ గృహలో లోకి వెళ్లిన కృష్ణుడు కంటికి ఉయ్యాలకు కట్టబడి ఉన్న సమంతకమణి కనిపించింది. దానితో వెంటనే ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఆ మణి ని తీసుకొని తిరిగి వస్తున్న శ్రీకృష్ణుడిని చూసి ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది. ఆ కేకలు విన్న జాంబవంతుడు కోపంగా అక్కడికి వచ్చి కృష్ణుడితో యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులపాటు రాత్రి, పగలు యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడము మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమయింది తాను యుద్ధం చేస్తున్నది ఎవరితోనో కాదు త్రేతా యుగంలో రావణాసురుని అంతం చేసిన తన ప్రభు శ్రీరాముడితో అని తెలుసుకొని వెంటనే తన చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించి దేవాది దేవా నా తప్పును మన్నించండి. ఆ జన్మలో మీరు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను అహంకారంతో మీతో యుద్ధము చేయాలని కోరుకున్నాను. మీరు అది ముందు ముందు తీరుతుందని చెప్పారు. అప్పటినుండి మీ నామస్మరణము చేస్తూ ఎన్నో యుగాలుగా మీ కోసము ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా ఇంటికి వచ్చి నా కోరిక నెవేర్చారు. నా శక్తి క్షీనిస్తుంది మరణము దగ్గరికి వస్తుంది. నా తప్పు నీ క్షమించి నన్ను కాపాడండి ప్రభు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరము అంత తన చేతితో నిమిరి అతని అలసటను మటుమాయము చేశాడు. ఆ తర్వాత జాంబవంతుడు సమంతకమణి దొంగతనము చేశానని నా మీద నింద పడింది. ఆ నింద పోగొట్టుకోవాలంటే నాకు ఈ మణి కావాలి కాబట్టి నువ్వు ఈ మణి ని ఇస్తే నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు. అది విన్న జాంబవంతుడు సంతోషించి సమంతకమణి ని అలాగే తన కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని సమంతకమణి ని తీసుకొని బంధుమిత్ర సైన్యంతో సత్రాజిత్ దగ్గరికి వెళ్లి అందరి సమక్షంలో జరిగిన విషయం వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు పక్షతము చెంది కృష్ణుడిపై లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణలు చెప్పి తను చేసిన తప్పుకు పర్యాయంగా తన కుమార్తె సత్యభామను భార్యగా స్వీకరించమని చెప్పి సమంతకమణిని కూడా కానుకగా శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు. అయితే కృష్ణుడు సత్యభామను స్వీకరించి సమంతకమణిని తిరక్కరించారు. ఆ తరువాత ఒక శుభ ముహూర్తమున శ్రీకృష్ణుడు సత్యభామణి, జాంబవతిని వివాహము చేసుకున్నాడు. అప్పుడు చాలామంది దేవతలు, మునులు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడితో స్వామి మీరు సమర్థులు గనుక నీలాప నిందలు తొలగించుకున్నారు. కానీ మాలాంటి సామాన్య వాళ్ళ పరిస్థితులు ఏమిటి మీరే మాకు తగిన మార్గము చూపాలి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి పైన దయచూపి భాద్రపధ శుద్ధ చవతి నాడు ప్రమాదపుశాత్తు చంద్రుడిని చూసిన ఆరోజు ఉదయము గణపతిని యధావిధిగా పూజించి సమంతకమణి కథను విని పూజ అక్షతలు తలపై వేసుకుంటే ఎటువంటి అపనిందలు కలగవు అని అనుగ్రహించారు. కృష్ణుడి మాటలు విని దేవతలు సంతోషించి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అని అన్నారు.