టంగుటూరి ప్రకాశం బయోగ్రఫీ:
ఎందరో భారత మహానుభావులు అందులో ఒకరు ప్రకాశం పంతులు గారు. తెలుగు నాట పుట్టిన భారత స్వాతంత్ర యోధులలో మొదటిగా చెప్పుకోవాల్సిన వస్తే ప్రకాశం పంతులు గారి గురించే చెప్పుకోవాలి. బ్రిటిష్ సైన్యానికి రొమ్ము విరిచి ఎదురుగా నిలబడి దమ్ముంటే గుండెలపైన కాల్చండి అంటూ సవాలు చేశారు.
ప్రకాశం పంతులు భాల్యము, విద్యాబ్యాసము
ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ అయినా ఒంగోలు సమీపన గల వినోద రాయుడుపాలెం గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు 1872లో ఆగస్టు 23 న జన్మించాడు. వీరికి ఆరుగురు పిల్లల్లో ఈయన ఒకరు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో ప్రకాశం కుటుంబంలో పనిచేసుకుంటూ ఉండేవారు. 11 ఏళ్ల వయసులో ప్రకాశం గారి తన తండ్రి చనిపోవడంతో ఇక బతుకు తిరుగు నిమిత్తం తన కుటుంబంతో కలిసి ప్రకాశం గారు ఒంగోలు కి వచ్చారు. అక్కడ ప్రకాశం గారి తల్లి భోజనశాల నడిపిస్తూ ఉండేవారు. అయినా కూడా బతకడానికి తల్లి సంపాదన సరిపోవకపోవడంతో ఇక అంత చిన్న వయసులోనే ప్రకాశం గారు కూడా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వారాలకు కుదిరాడు. చిన్నప్పుడు నాటకాలు కూడా వేసేవాడు. అలా వారాలు ఇళ్ల పనులు చేసుకుంటూ వరిలో ప్రాథమిక విద్యను చదివాడు. ఆ తర్వాత మిషన్ స్కూల్ టీచర్ హనుమంతు నాయుడు చరవతో ఉచితంగా మెట్రిక్ చదివాడు. ఆ తర్వాత రాజమండ్రిలో ఎఫ్.ఎ అక్కడ నుండి మద్రాసులో పట్టుదలతో మరొక చదువు చదివాడు. ఆ రోజుల్లో తన కుటుంబ పరిస్థితులకు గాను ప్రకాశం గారు లాయర్ చదవడం మామూలు విషయం కాదు. అలాంటిది ప్రకాశం గారు ఎంతో పట్టుదలతో లాయర్ చదువుని పూర్తి చేశారు. దాంతో చదువు అనంతరం కొంతకాలం ఒంగోలు రాజమండ్రిలో లాయర్ గా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే రాజమండ్రిలో పురపాలక సంఘము అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ప్రకాశం పంతులు బారిష్టర్ చదువు
1890లో తన అక్క కూతురైన హనుమయ్యమ్మను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రకాశం గారు హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానంలో వాదించాలంటే బారిష్టర్ లాంటి అర్హతలు ఉండాలి. అందుకే పెళ్లి అనంతరం కూడా ఇంగ్లాండ్ కి వెళ్లి బారిష్టర్ చదవాలని అనుకున్నారు. దాంతో 1904లో ఇంగ్లాండ్ కి వెళ్లే ముందు మహాత్మా గాంధీ గారి లాగానే మద్యం, మాంసం, పొగాకు లాంటివి ముట్టనని తన తల్లికి మాట ఇచ్చి బారిష్టర్ చదవడానికి వెళ్లారు. అలా అక్కడికి వెళ్ళాక అక్కడ చదువుతున్న సమయంలోనే అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి నౌరోజి బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికి అవ్వడానికి తగినంత ప్రచారం చేశారు. ఈ సమయంలోనే ప్రకాశం గారు జాతీయ భావాలు, సాంకేత కార్యకలాపాలపై ఆసక్తి పెరిగింది. ఇక తన చదువు బారిష్టర్ పూర్తి చేసుకున్న తర్వాత 1907లో ఇండియాకి తిరిగి వచ్చి మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రాక్టిక్స్ మొదలుపెట్టారు. ఆ సమయంలో బారిష్టర్ లో అందరూ ఇంగ్లీష్, తమిళం వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు. తెలుగు వారు చాలా కొద్ది మందే ఉండేవారు. ఇక తన వృత్తి కాలంలో కొంతమందికే తక్కువ శిక్ష పడేటట్టు చేశారు.
ప్రకాశం పంతులు గారు కాంగ్రస్ పార్టీ లో చేసిన సేవలు
ఇక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా ఆయన తరచుగా హాజరు అవ్వడం కావడం ప్రారంభించారు. 1921లో అక్టోబర్ లో సత్యాగ్రహం ప్రజలపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆ రోజుల్లోనే ఆయనకు లక్షల్లో సంపాదన వస్తున్న సరే తన న్యాయవాద వృత్తిని వదిలేసి దేశం కోసం స్వాతంత్ర సమరంలో అడుగు పెట్టారు. ఈ క్రమంలోనె వృత్తిపరంగా తను సంపాదించిన మొత్తము ఆస్తిని దేశ ప్రజాసేవకు ఖర్చు చేశారు. ఒక జాతీయ పాఠశాల నడిపారు. 1921లో డిసెంబర్ లో జరిగిన అహ్మదాబాద్ సదస్సులో జరిగిన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏదైనా అలజడి లేదా కల్లోలం లాంటిది జరిగినప్పుడు ప్రజలను ఓదార్చించే దానికి పర్యటించేవారు. ముస్లిమ్స్, హిందువుల ఘర్షణలు అణిచివేత చేయడానికి ఎంతో కృషి చేశారు. ఇక 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా గుంటూరులో 30 వేల మంది ఒక ప్రదర్శన నిర్వర్తించారు. అంతే కాదు లాయర్ గా ఎంతోమందిని జైలు నుంచి బయటికి తెచ్చిన ఆయన ప్రజల కోసం తను జైలు శిక్ష అనుభవించారు. గాంధీజీ ఆశయాలను ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించారు. గాంధీజీ నిజమైన అనుచరుడిగా ఆయన మెప్పులు పొందారు. ఇక 1926లో కేంద్ర శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దాంతో ఇలా ఈయన రాజకీయ రంగ ప్రవేశంతో అంతవరకు ముందు వరుసలో ఉన్న కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు లాంటి ప్రభుత్వలు వెనక వరుసకు వెళ్లారు.
ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి పేరు
1928లో ఫిబ్రవరి 3న సైమమ్ కమిషన్ మద్రాస్ కు వచ్చినప్పుడు సైమమ్ గో బ్యాక్ ను పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. అప్పుడు పోలీసులు ఉద్యమాలకు ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో మద్రాస్ హైకోర్టు వద్ద ఎక్కువ సంఖ్యలో గుంపులుగా వచ్చి ప్రదర్శకులని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు చేశారు. పార్థసారథి అనే యువకుడు చనిపోయాడు. అప్పుడు ఉగ్రుడు అయిన ప్రకాశం గారు చొక్కా చించుకొని చాతి చూపిస్తూ తనని కాల్చమని ఆ బ్రిటిష్ పోలీసులని సవాలు చేశారు. దాంతో ఆ సమయంలో ఆయన వెనక ఉన్న అశేషమైన జనవాయువుని చూసి పోలీసులే వెనక్కి తగ్గారు. ఆ సంఘటనతోనే ఆయనకు ఆంధ్రకేసరి అని పేరు వచ్చింది.
ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రి
ఇక 1937లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాస్ ప్రెసిడెంట్ గా కూడా అధికత తెచ్చుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం గారు ముందున్నప్పటికీ క్రియా షీలా రాజకీయాలకు తిరుగు వచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనవుగా కాంగ్రెస్ అధిష్టానం వర్గం కోరిక మేరకు ప్రకాశం గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తప్పుకున్నారు. దాంతో రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం గారు రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా జమీందారీ వ్యవస్థలో ఉన్న వ్యవసాయక రంగంలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించి ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రకాశం గారు అధ్యక్షుడిగా వహించడం జరిగింది. ఇక 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం గారు మొదటి వారు. 1942లో క్విట్ ఇండియన్ ఉద్యమాలలో పాలుకొన్నందుకు ప్రకాశం గారిని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. దాంతో మూడేళ్ల తర్వాత విడుదల అయ్యాక కూడా మళ్లీ నిర్దేశ రాజకీయాల్లో తన పాత్రను పోషించారు. దాంతో 1946లో కాంగ్రెస్ తిరిగి మద్రాస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. ఈసారి 1946వ సంవత్సరం ఏప్రిల్ 30న ప్రకాశం గారు అప్పటి మద్రాస్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే పార్టీలో వివిధ వర్గాలు విభీనా అభిప్రాయాలు తగ్గట్టుగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం 11 నెలలే ఉండగలిగింది. సామాన్య ప్రజలు సంక్షేమత్వము కోసం ప్రకాశం గారు తన వ్యక్తిగతంగా భద్రతను జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరిక లెక్కచేయకుండా 1948లోని నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించారు. నిజాం ఒక సహాయ సహకారాలతో సామాన్య ప్రజలని భయ బ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల రజికార్ల నాయకుడిని కలిసి రిస్వికి హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం గారు చూపిన ధైర్యానికి మెచ్చుకోగా రజికారులు గౌరవాన్ని సమర్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న తరుణంలో కాస్త అభిప్రాయ భేదాలు వ్యతిరేకత రావడంతో 1952లో ప్రకాశం గారి సొంతంగా ప్రజా పార్టీని స్థాపించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మిత్రులందరికీ ఎన్నికలలో ఓడిపోయేటట్టు చేశారు. అయినా కూడా ప్రజా పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే మద్దతు లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయావలిసి వచ్చింది. అయితే బల నిరూపణకు ముందే సంకీర్ణ కూలిపోయింది. 1952లో డిసెంబర్లో పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేకమైన ఆంధ్ర సాధన కోసం మరణించడం వల్ల శ్రీరాములు వారి ఉద్యమం మరింత తీవ్రతంగా మారింది. దాంతో ఆ ఉద్యమం ఫలితంగా 1953లో అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం గారి నియమితులు అయ్యారు. ఇక కొత్త రాష్ట్రానికి ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటారు.
ముఖ్యమంత్రి అయ్యాక ప్రకాశం గారు చేసిన సేవలు
పాలనా కాలంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఖైదీలను అందరిని ఆయన విడుదల చేశారు. కేవలం 13 నెలలు తన ప్రభుత్వం కాలంలో ఆ రోజుల్లోనే ఆయన 14 నీటి ప్రాజెక్టులను స్థాపించారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర విద్యాలయము తెలుగువారి కోసం హైకోర్టు స్థాపించారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తనకు కావాల్సిన మార్పులకు శేషణ పద్ధతులును కలిపించారు. సహకార రంగంలో తెలుగు స్థానాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజ్ రిపేర్ చేయడానికి ఇవ్వమని చెబితే రాష్ట్ర నిధులన్నీ మళ్లించి యుద్ధప్రాతిప్రకారణ బ్యారేజ్ ను బాగు చేసి నిలబెట్టారు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వెయ్యక్కోకుండా ఆ లోటన్ని సరిదిద్దారు. అందుకే ప్రజలందరూ బ్యారేజ్ ని ఆయన పేరుతో ప్రకాశం బ్యారేజ్ అని పీల్చుకుంటున్నారు. ఇప్పటికీ విజయవాడకి పురాణ అద్భుత కట్టడం గా ప్రకాశం బ్యారేజ్ నిలిచింది. తర్వాత ప్రభుత్వాలు సైతం నేటికీ ఈ బ్యారేజ్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. సీఎంగా పనిచేస్తున్న ఆ సమయంలోనే వారు చేసిన ఒక విషయం గురించి చెప్పాలి. ప్రకాశం గారు యుక్త వయసులో తాను న్యాయవాది వృత్తిలో స్థిరపడాలని కలలు కంటున్న ఆయనకి ఆ సమయంలో ఒకసారి పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో రాత్రికి రాత్రి 50 కిలోమీటర్లు ఒక్కడే నడుచుకుంటూ మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అంత కష్టపడి వెళ్లిన ఫీజు కి అవసరమైన మూడు రూపాయలు ప్రకాశం గారికి దొరకలేదు. దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి తన పట్టు చీరలు తాకట్టు పెట్టి ఆరోజు ఫీజు కట్టారంట. ఈ సంఘటన ఆంధ్రకేసరి మనసులో చిరస్థాయిగా ఉండిపోయింది. అందుకే తను ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులలో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకతమైన నిధిని ఏర్పాటు చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకునేలాగా చేశారు.
ప్రకాశం గారు రాజకీయాల నుంచి బయటకు
ప్రకాశం గారు తన ముఖ్యమంత్రి పాలనను చాలా ముక్కు సూటిగా ఎవరికి బెదరకోకుండా ప్రజల కోసమే చేసినప్పటికీ కమ్యూనిస్టులు ఈయన పాలనని వ్యతిరేకించడం, సోషలిస్టులు మద్దతు ఉపసంభరించడం వలన మీరు ముఖ్యమంత్రి అయిన 13 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం కూలిపోయింది. దాంతో ఆ తర్వాత 1955లో మధ్యంతరా ఎన్నికలు నిర్వర్తించే సమయానికి ప్రకాశం గారు రాజకీయాలు నచ్చకుండా బయటకు వచ్చేసారు. ఇక ఆ తర్వాత 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. దాంతో ఇలా ఏర్పడిన కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇక మన ప్రకాశం గారి విషయానికి వస్తే ఇటు రాజకీయాల నుండి బయటకు వచ్చినా ప్రకాశం గారు చురుకుగా రాష్ట్ర మొత్తం ప్రజల కోసం పర్యటించేవారు.
ప్రకాశం గారి మరణము
ప్రకాశం లాంటి అంతటి మహనీయుడు తన చివరి దశలో కటిక దరిద్రాన్ని అనుభవించారు. తనని శాలువాతో చక్కరిస్తే ఈ శాలువా నాకెందుకురా ఆ డబ్బుతో అరటి పండ్లు కొనుక్కొని తెస్తే ఒక పూటకు గడిచేది అని తన అనుచరులతో అన్నాడంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందరూ అధికారం కోసం ఆయనను వెన్నుపోటు పొడిచిన అధికారం కోసం ఆయన ఏనాడు తప్పులు చేయలేదు. కానీ అప్పటికే ఆయన తను సంపాదించింది అంతా ప్రజలకి ఇచ్చేశారు. ఆయన దారిద్రము నుండి వచ్చారు. ఈ పదవులు ఈ సంపాదనలు హోదాలు ఒక మాయ అని ఇవన్నీటిని వదిలిపెట్టి మళ్లీ దరిద్రముని ఆలింగనం చేసుకున్నారు. చిరిగిన దుస్తుల్లో చిల్లులు పడిన సాల్వాతో తిండి లేక నిరసించి పోయిన ముఖంతో విజయవాడ వీధుల్లో రాష్ట్రంలో అనేక చోట ఆయనను చూసినవారు ఆ దృశ్యాలని ఎప్పటికీ మర్చిపోలేక పోయారు. ఇక ప్రకాశం గారి తల్లి సుబ్బమ్మ గారు తమ అంతిమక్షణాలలో తన కొడుకును పిలిచి ఒక చిన్న మూటను అప్పగించింది. ఇందులో 800 రూపాయలు ఉన్నాయి. అందులో అవి ఆమె కష్టాది జీతము. తన అంత్యక్రియలకి ఆ డబ్బులు వాడమని చెప్పారు. దాంతో కన్నతల్లి రుణాన్ని తీర్చుకోవడానికి అవకాశాన్ని కూడా మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారు. ప్రకాశం గారు దేశమాత రుణాన్ని తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం. వడదెబ్బకి ఇద్దరూ కుటుంబ సభ్యులు పరామర్శ కోసము ప్రకాశం గారు తన 85 ఏళ్ల వయసులో వెళ్లి తాను వడదెబ్బ తిని అనారోగ్యం మే 20న 1957లో మరణించారు. ఇక టంగుటూరి ప్రకాశం పంతులుగారు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5వ తేదీన ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారి గురించి ఇప్పటి యువత కచ్చితంగా తెలుసుకోవాలి