వాలి, సుగ్రీవ యుద్ధము

వాలి, సుగ్రీవ యుద్ధము 


రామాయణంలో గొప్ప బలవంతులు ఎవరంటే మనకు హనుమంతుడు, రావణుడు అని అందరూ చెబుతుంటారు. కానీ వీరితో పార్టీ మరో మహా బలవంతుడు ఒకరున్నారు. అతని పేరే వాలి. వాలి కూడా ఒకరు. వాలి మహా బలవంతుడైన వానర రాజు. అతడు శ్రీరాముడి సైన్యానికి నడిపించిన అంగదుడు తండ్రి వాలి తమ్ముడు సుగ్రీవుడు. సుగ్రీవుడే రామ రావణ యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. వాలి సుగ్రీవులు కవలలు. వారి గురించి గొప్ప కథలు రామాయణంలో ఉన్నాయి. రావణాసురుడిని మూడుసార్లు ఘోరంగా ఓడించారు. వాలి చివరికి వాలిని గెలవలేక అతనితో సంధి కుదిరించుకున్నాడు. రావణుడు ముల్లోకాలను గెలిచిన రావణుడు వాలిని గెలవలేకపోయాడు. అంత గొప్ప బలవంతుడైన వాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.


వాలి సుగ్రీవుల తండ్రి పేరు వారిక్షారాజా. ఇతను వానర రాజు. రావణుడి సంహారము కోసమే శ్రీరాముడు అవతరించాడని రామాయణ గాధ అందరికీ తెలిసినదే కానీ మానవుడిగా జన్మించిన రాముడు ఒక్కడే రావణుడిని ఓడించడము సాధ్యము కాదు. అందుకే రాముడికి మహా సైన్యము అవసరమయ్యింది. రావణుడి మరణము నరులు వానరుల చేతిలోనే ఉంది. మిగిలిన వారితో మరణము లేకుండా బ్రహ్మ వరము కోరుకున్నాడు. రామావతారము సమయంలోనే రాముడు వానర సైన్యంలో మహా బలవంతులని సృష్టించాడు. అప్పుడు పుట్టిన మహా వానరుల్లో వాలి సుగ్రీవుడు ఉన్నారు. శ్రీమహావిష్ణువు దశరథ మహారాజు భార్యకు రాముడిగా పుట్టాడు. ఆయనకు సహాయంగా సూర్యుడు ధర్మశాస్త్రము తెలిసినవాళ్లు పరాక్రమవంతులు ఆకలి తప్పికలు లేని గొప్ప వానరులను బ్రహ్మ సృష్టించాడు. వాలి సుగ్రీవుల పుట్టుక చాలా విచిత్రమైనది. వాళ్లు మాతృ గర్భము నుంచి జన్మించిన వారుకాదు. ఓసారి వానర వారిక్షారాజా ఒక కొలనులో సానము చేసి బయటకు వచ్చాడు. రాగానే అతని శరీరము అందమైన స్త్రీ శరీరముగా మారిపోయింది. ఆ స్త్రీ పై ఇంద్రుడు సూర్యుడు దృష్టి పడింది. అలా ఇంద్రుడి అంశతో వారిక్షారాజా గారికి జన్మించిన వాడు వాలి. సూర్యుడు అంశతో సుగ్రీవుడు జన్మించాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు స్వీరూపంలో ఉన్న వారిక్షారాజా గారికి దేవతల అంశతో అప్పటికప్పుడు పుట్టారు. ఇలా పుట్టిన వారు కారణజన్ములు అలాగే వానర సైన్యంలో మహావీరులు పుట్టారు. బృహస్పతి అంశతో పుట్టిన వాడు తారుడు. కుబేరుడి అంశతో పుట్టిన వాడు గంధ మాధనుడు. విశ్వకర్మ అంశతో పుట్టిన వాడు నల్లుడు. ఇతడే ఇప్పటికీ మనకు ధనుష్కోటిలో కనపడే రామసేతుకి ఇంజనీర్. అగ్ని దేవుడి అంశతో పుట్టినవాడు నీలుడు. ఇతడు మహావీరుడు వాయు దేవుడి అంశతో పుట్టిన వాడు. మహాబలుడు ఆంజనేయుడు వేగంలో అతను గరుత్మంతుడితో సమానము. అతని శరీరము వజ్రంలా ఉంటుంది. ఇంకా లక్షల మంది గొప్ప వీరులైన ఓనరులు కారణజన్ములుగా పుట్టారు. ఇలాంటి వానర వీరులు కోటి మంది పైనే పుట్టారని రామాయణము చెబుతున్నది. ఈ వానరులలో కొందరు వృషముఖి పర్వతము పైన నివసించేవారు. మిగిలిన వాళ్ళు పర్వతాల మీద అడవులలో నివసించేవారు. ఈ వానరులల్లో చాలామంది వాలి సైన్యంగా గాను సుగ్రీవుడి సైన్యముగా గాను ఇంకొందరు హనుమంతుడు, నల్లుడు, నీలుడు దగ్గర ఉండేవారు. అలా వాలి వీరులైన వానర సైన్యముతో కిష్కిందను పరిపాలించేవాడు. మహాభారతంలో అర్జునుడు ఇంద్రుడి అంశతో పుట్టి భారత యుద్ధాన్ని ఒంటి చేతితో నడిపించే శక్తి గలిగేలా ఉంటాడు. రామాయణంలో అంతే శక్తిని వాలి కలిగి ఉంటాడు. ఇంద్రుడు వాలికి కాంచనమాల అనే వరాన్ని ప్రసాదించాడు. దానివల్ల వాడితో ఎవరైనా యుద్ధానికి వస్తే ప్రత్యర్థి బలంలో సొగము బలము వారికి వస్తుంది. అందువల్ల ఎదుటివాడు ఎంత వీరుడైన వాలిబలంలో పావు వంతు కూడా ఉండదు. అందువల్ల వాలి ఎలాంటి ప్రత్యద్విని కూడా ఓడించేవాడు. వాలికి ఉన్న ఈ వరము ప్రభావము వలన అతని జోలికి ఎవరు వచ్చేవారు కాదు. 

రావణుడు ముల్లోకాలనీ జయించి వాలిని కూడా గెలవాలని కిష్కింధనకు వచ్చాడు. అప్పుడు వాలి సంధ్యావందనము చేస్తూ ఉన్నాడు. వాలి ప్రతిరోజు వాయువేగంతో సత్య సముద్రాలలో సంధ్యావందనము చేసేవాడు. రావణుడు ఓసారి ఆ సమయంలో వాలిని గట్టిగా పట్టుకుంటే రావణుడితోపాటు వాలి ఎగిరి సప్త సముద్రాలలో తర్పణాలు వదిలినాడు. ఆ తర్వాత లంకలో రావణాసురుడిని విసిరేశారు. అంతటి బలసాలి వాలి ఆ తర్వాత వాడితో సంధ్య కుదిరించుకొని ఉన్నాడు. రావణుడు ఇంక ఎప్పుడూ అతని జోలికి రాలేదు. ఈ మహా బలము వల్లే వాలికి అహంకారము పెరిగింది. వాలి రావణుడి లాగా అహంకారుడు. సుగ్రీవుడు మాత్రము లక్ష్మణుడి లాగా మంచి సోదరుడు. వాలిని సుగ్రీవుడు భక్తితో అనుసరించాడు. అయితే వారిద్దరిని ఒక అపార్థము దూరము చేసి శత్రుత్వాన్ని పెంచింది. 

ఓసారి వాలి దుందువి అనే రాక్షసుడిని వధించాడు. అతని కొడుకు వాలి పై పగ పెంచుకొని మరోసారి యుద్ధానికి వచ్చాడు. వాలి మాయావి అనే రాక్షసుడు ఇద్దరు యుద్ధము చేసుకుంటూ ఓ కొండ గృహలోకి వెళ్ళాడు. బయట సుగ్రీవుడిని కాపలా పెట్టాడు. వాలి అయితే నెల గడిచిన వాలి బయటకు రాలేదు. లోపల శబ్దాలు వినిపించలేదు. ఆ రాక్షసుడు అన్న వాలి ఇద్దరు మరణించి ఉంటారని సుగ్రీవుడు అనుకున్నాడు. కానీ ఒకవేళ రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదము అని అనుకోని బయట ఒక పెద్ద బండరాయి ఆ గృహకు అడ్డంగా పెట్టి సుగ్రీవుడు బాధతో కిష్కిందకు వచ్చాడు. మంత్రుల సలహాతో కిష్కిందకు రాజుగా సుగ్రీవుడికి పట్టాభిషేకము జరిగింది. కొన్నాళ్లకు వాలి కిస్కిందకు వచ్చాడు. రాజ్యము కోసము తనని తమ్ముడే చంపాలని చూశాడని వాలి ని నిండించారు. సుగ్రీవుడు ఎంత చెప్పినా వినలేదు. సుగ్రీవుడి పై వాలి పగ పెంచుకొని అతని రాజ్యము నుంచి తరిమేశాడు. సుగ్రీవుడిని అనుసరించే హనుమంతుడు ఇంకొంత మంది సైన్యము వృషముఖి పర్వతంపై తలదాచుకున్నారు. వృషముఖి పర్వతము మీదకి వాలి రాలేదు. అందుకే సుగ్రీవుడు అక్కడ తల దాచుకున్నాడు. ఎందుకంటే దుందువి అనే రాక్షసుడిని వాలి అక్కడ సంహారించాడు. అప్పుడు అతని రక్తము వృషముఖ పర్వతము పై పడింది. ఆ పర్వతము పై మహా తపస్వి అయిన మాతంగముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమంపై రక్తము చెందింది అని ఆగ్రహించిన ముని వాలిని శపించాడు. ఈ వృషముఖ పర్వతము మీదకి వచ్చిన ఈ పర్వతము మీదకి కాలు పెట్టిన నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని శపించాడు. ఆ శాపముకి భయపడి వాళ్ళు ఎప్పుడు వృషముఖ పర్వతము వైపుకి వెళ్లలేదు. ఆ పర్వతము మీదనే రామ లక్ష్మణులు హనుమంతుల వారికి దర్శనము ఇచ్చారు. సీతమ్మను రాముడు వృషముఖ పర్వతము మీదకి వచ్చాడు. హనుమంతుడి ద్వారా శ్రీరాముడికి సుగ్రీవుడు పరిచయము అయ్యాడు. సంబరానికి సుగ్రీవుడినే రాముడు సహాయము అడిగాడు. తన అన్న వాలి ఉండగా తాను సహాయము చేసే పరిస్థితులలో లేనని సుగ్రీవుడు అన్నాడు. వాలి సంహారానికి తాను సహాయము చేస్తాను అని రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. అలా సుగ్రీవుడు రావణ సంహారానికి మహా ఘట్టానికి సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు. రామాయణంలో అత్యంత ప్రధానమైన ఘట్టము వాలి సంహారము. ఈ ఘట్టముపై ఎంతోమంది ధర్మసస్మాలు వెతికారు కానీ ఈ యుద్ధానికి ముందే వాలిని హెచ్చరించిన గొప్ప శ్రీ తార అత్యంత ప్రభావంతమైన పతిర్పతలు ఐదుగురు ఉన్నారు. వారిని పంచ మహా కన్యలు అని అంటారు. వారిలో ఒకరు తార ఆమె వాలి భార్య. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి తన బలగ్గర్వంతో ఈసారి సుగ్రీవుడి పని పడుదామని అనుకున్నాడు. కానీ తార వద్దని చెప్తుంది. ఆ సమయంలో తార వారితో అన్న మాటలను రామాయణము బాగా వివరించింది. సరిగ్గా ఇలాగానే రాముడితో యుద్ధానికి ముందు రావణుడితో మండోదరి కూడా చెప్పింది. మండోదరి కూడా పంచ కన్యాలలో ఒకరు. తార వాలికి చెప్పిన మాటలు ఇవి నాద సుగ్రీవుడికి ఏదో సహాయము లభించినట్టు ఉంది. అయోధ్య రాజు దశరథునుడి కుమారుల అయిన రామ లక్ష్మణులు సుగ్రీవుడికి మైత్రి కుదిరిందని నాకు తెలిసింది. రాముడి భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుడి సహాయము కోరాడు. సుగ్రీవుడు అంగీకరించాడు. ప్రతిఫలంగా సుగ్రీవులకు సహాయము చేస్తాను అని రాముడు అన్నాడు. మహా బలవంతుడై హనుమంతుడు జాంబవంతుడు అతనికి మంత్రులగా ఉన్నారు కనుక ఇప్పుడు సుగ్రీవుడితో యుద్ధానికి పోవడము ప్రమాదకరణము అని తార వాలిని వాదించింది. కానీ వాలి భార్య మాట వినలేదు సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వాలి సుగ్రీవులు చెట్లతోనూ కొండలతోనూ యుద్ధము చేస్తున్నారు. తర్వాత ఒకరితో ఒకరు ముష్టి యుద్ధం చేస్తున్నారు. కవలలు అయిన వాళ్ల ఇద్దరిలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అని తెలుసుకోలేకపోయాడు రాముడు. సుగ్రీవుడు తిరిగి వచ్చి రాముడితో నిష్ఠూరంగా మాట్లాడాడు రెండోసారి రాముడు ఓ సలహా ఇచ్చాడు. సుగ్రీవుడు ఓ పుష్పమాలను ధరించి వాలితో యుద్ధము చేశాడు. రాముడు చెట్టు చాటు నుంచి వేసిన బాణాలతో వాలి నేలకూలాడు. తనని చంపడము అధర్మము అని వాలి రాముడితో వాదించాడు. ఒక జంతువుని చెట్టు చాటు నుంచి చంపడము తప్పు కాదని రాముడు చెప్పాడు. తనకు ఒక్క మాట చెప్తే సీతమ్మను తెచ్చి రావణుడిని నీ కాళ్ళ మీద పడేస్తాను కదా అని అన్నాడు. వాలి సుగ్రీవుడిని ఓడించి అతని భార్యను కూడా నీవు స్వాధీనము చేసుకున్నావు. రావణుడికి నీకు తేడా లేదని అన్నాడు రాముడు. అలాంటి నీ సహాయము అడగడము ధర్మము కాదని చెప్పాడు. రాముడు అతని ధర్మ సూక్ష్మాలకు సంపూర్తి చెంది వాలి కన్నుమూశాడు.

ఆ తర్వాత సుగ్రీవుడు వాలి రాజ్యానికి పట్టాభిశక్తుడు అయ్యాడు. వాలి మరణించాక ఆయన భార్య తారను సుగ్రీవుడు వివాహము చేసుకున్నాడు. వాలి కొడుకుకి అంగదుడికి యువరాజు పట్టాభిషేకము చేశాడు. వాలి కొడుకు అంగదుడు లంక యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించాడు. వాలిని చెట్టు చాటు నుంచి కొట్టిన రాముడు ధర్మశిక్షణాలు చెప్పిన విధిరాతను అంతటి భగవంతుడు కూడా తప్పించలేకపోయాడు. మహాభారతము చిట్టచివరి ఘట్టంలో శ్రీకృష్ణుడు ఓ వనంలో సేద తీరుతున్నప్పుడు ఆయన కాళ్లు జింక లాగా కనిపించింది. ఓ వేటగాడికి అతను బాణము వేసి చూస్తే అది శ్రీకృష్ణుడి పాదంలో దిగబడి ఉంటుంది. ఆ వేటగాడే పూర్వజన్మలో వాలి అని వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపిన విధి ప్రతిఫలానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అనుభవించాల్సి వచ్చిందని మహాభారతంలో ఓ కథనము ఉంది. అలా విధిరాతని ఎవరు తప్పించలేరు మొత్తానికి రామాయణంలో వాలి పాత్ర అద్భుతంగా ఉంటుంది. రామాయణాన్ని మలుపు తిప్పే కీలకమైన పాత్ర అది.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !